ఏపీలో ఆహ్లదకరమైన అనుభూతులను పంచే ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రకృతి దగ్గరగా ఉండే ప్రాంతమైన కోనసీమ దిండి రిసార్ట్స్.. అయితే, ఈ ప్రాంతాన్నివీక్షించాలనుకునేవారికి ఏపీ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ పర్యాటకులకు తిలకించేందుకు ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. ఈ టూర్‌ప్యాకేజీ ఏపీ టూరిజం అందిస్తోంది. ఈ టూర్ భాగంగా కోనసీమ బ్యాక్‌వాటర్స్ దిండి రిసార్ట్స్ వంటివి సందర్శించొచ్చు. ఇది వన్‌డే టూర్ ప్యాకేజీ.
ఈ టూర్ ప్యాకేజీలో కోనసీమల అందాలతో పాటు గోదావరి నది అందాలను కూడా వీక్షించొచ్చు. ఇంకా ఇక్కడ నైటంతా స్టే కూడా చేయొచ్చు. గోదావరి నదిలో 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన సుందరమైన ద్వీపాలు కలిగే దిండి రిసార్ట్స్‌లో గడపడం పర్యాటకులకు ఓ మధురమైన అనుభూతిని కలిగిస్తోంది. ఇక్కడ క్రూయిజ్‌లో రాత్రిపూట బస కూడా చేయొచ్చు. మరెందుకాసల్యం ఈ టూర్ ప్యాకేజీ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

టూర్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..
మొదటి రోజు పర్యటనలో భాగంగా పర్యాటకులు రాజమండ్రి నుంచి సుమారు 20 కిలోమీటర్లు ఉన్న పాలకొల్లుకు రోడ్డు మార్గంలో బయలుదేరాల్సి ఉంటుంది. ఈ రోడ్డు మార్గంలోనే కోనసీమలోని దిండి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు రిసార్ట్‌లలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. అనంతరం కోనసీమ బ్యాక్ వాటర్స్ గోదావరి ఉపనది వశిష్ట నదిలో బోటింగ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడి నదిలో బోటింగ్ చేస్తున్నప్పుడు పర్యాటకులు ఇక్కడి పచ్చని అందాలకు ముగ్ధులవ్వాల్సిందే.. ఇక్కడ అనేక దట్టమైన కొబ్బరి తోటలు, చిన్న చిన్న ద్వీపాలు ఇక్కడికి వచ్చేవారికి సాదర ఆహ్వనం పలుకుతాయి.
ఇంకా కోనసీమ బ్యాక్ వాటర్స్ అద్భుతమైన అందాలను కూడా వీక్షించొచ్చు. ఇక, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక్కడి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్వేదికి బయలుదేరాల్సి ఉంటుంది. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయం, బీచ్, బంగాళాఖాతంలో వశిష్ట నది సంగమ ప్రదేశం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. నైట్ స్టే చేసేందుకు రిసార్ట్స్ తిరిగి బయలుదేరాల్సి ఉంటుంది.

మరుసటి రోజు రిసార్ట్ నుంచి చెక్ అవుట్ అయ్యి అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాంకి బయలుదేరాలి. రోడ్డు మార్గం ద్వారానే బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ మడ అడవుల్లో బోటింగ్ చేయవచ్చు. అక్కడ సెంట్రల్ ఏసీ బోట్‌ను ప్రయాణం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ బోట్‌లో ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తారు. తిరిగి సాయంత్రం ఆరు గంటల సమయంలో యానాం చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుండి కాకినాడకు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు.
ప్యాకేజీ వివరాలివే..!
ఏపీ టూరిజం దిండి రిసార్ట్స్‌లో వసతి, కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో ఒక రాత్రి. (ఇండికా AC - 4, టవెరా/క్వాలీస్ AC -7 Pax, టెంపో ట్రావెలర్ AC - 12 నుంచి 14 , వింగర్ పాక్స్ AC, మినీ 12 బస్ AC - 12 - 15 మందికి).
డ్రైవర్ బేటాతో సహా టోల్ పన్ను, పార్కింగ్ రుసుము మినహాయింపు ఉంటుంది. నాన్ ఏసీ బోట్/ ఏసీ బోట్ షేరింగ్ టికెట్లు (బ్రేక్ ఫాస్ట్, బోట్‌లో వెజ్-లంచ్) మడ ఫారెస్ట్ బోట్ షేరింగ్ టికెట్లు (కనీసం 45 మందికి) అక్కడ టిఫిన్, వెజ్ లంచ్, టీ స్నాక్స్ అందుబాటలో ఉంటాయి.



Click it and Unblock the Notifications












