Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల ద‌ర్శించుకోవాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

తిరుమ‌ల ద‌ర్శించుకోవాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

కొండలలో నెలకొన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకుంటున్నారా..? అయితే తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ స‌రికొత్త ప్యాకేజీ మీకోసమే..? చాలామంది ప‌ర్యాట‌కులు వేస‌విలో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. కుటుంబంతో స‌హా స్వామివారిని సేవించుకోవాల‌ని త‌పిస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ టూరిజం ఓ శుభ‌వార్త అందించింది. కేవ‌లం వ‌న్ డే ట్రిప్‌తోనే తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శంచుకోవ‌చ్చు. ఈ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ఆప‌రేట్ చేస్తోంది. ఈ ప్ర‌యాణం బ‌స్సులోనే ఉంటుంది.

ఏపీలోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఒక‌టి. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు తర‌లివ‌స్తుంటారు. శ్రీ‌వారిని ద‌ర్శ‌న భాగ్యం పొందేందుకు ప్ర‌ముఖులు, రాజ‌కీయనాయ‌కులు, సినీతార‌లు కూడా వ‌స్తుంటారు. ఇక‌, ఈ స‌మ్మర్‌లో తిరుప‌తిలో భ‌క్తుల ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సీజ‌న్‌లో స్వామివారిని ద‌ర్శించుకోవాల‌నుకునేవారికి తెలంగాణ టూరిజం ఓ కొత్త ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఒక్కరోజు వ్యవ‌ధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది.

దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. ఈ ప్ర‌యాణం కేవ‌లం బ‌స్సు మార్గంలోనే ఉంటుంది. తిరుప‌తిలో ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. అంతేకాదు, ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యాలు మ‌రెన్నో వున్నాయి. వాట‌న్నింటిని కూడా చూడొచ్చు. రండి ఆ వివ‌రాలేంటో చూసేద్దాం..

Do you want to visit Tirumala But this package is for you

తిరుమల వ‌న్ డే ట్రిప్ వివ‌రాలివే..

TIRUPATI - TIRUMALA TOUR పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. కేవ‌లం ఒక్క‌రోజులోనే ఈ ట్రిప్‌లో భాగంగా తిరుపతి, తిరుమల, తిరుచానూర్ వంటి ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించొచ్చు. మొద‌టి రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉదయం 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. అక్క‌డ ఫ్రెష్ అయ్యి త‌ర్వాత టిఫిన్ చేసి తిరుమ‌ల స‌మీపంలోని ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తారు.

అనంత‌రం తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. ఆ త‌ర్వాత అక్క‌డ చిన్న తిరుప‌తి, పిల్లలు వీక్షించేందుకు పార్కులు కూడా ఉంటాయి. వాట‌న్నింటిని సంద‌ర్శించొచ్చు. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలో ఫ్రెష్ అయ్యి సాయంత్రం 5 గంటలకు మీ తిరుగు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. మూడో రోజు ఉద‌యం ఏడుగంట‌ల‌కు హైద‌రాబాద్ చేరుకోవ‌డంతో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

Do you want to visit Tirumala But this package is for you

టిక్కెట్ ధ‌ర‌ల వివ‌రాలివే..

ప్ర‌యాణికుల‌కు ఓ ముఖ్య గ‌మ‌నిక‌. తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు తిరస్కరిస్తారు. ఇక భ‌క్తుల డబ్బులు కూడా తిరిగి ఇవ్వ‌డం జ‌ర‌గ‌దు. ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరల విష‌యానికొస్తే..

పెద్దలకు 3,700 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. చిన్నారులకు 2,960 రూపాయ‌లు చెల్లించాలి. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం భ‌క్తుల‌కు ఉచితంగా ఇవ్వ‌బ‌డుతుంది. మ‌రెందుకాల‌స్యం మీరు కూడా తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ట్రిప్‌లో భాగ‌స్వాముల‌వ్వండి..

More News

    Read more about: tirupati andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+