వైజాగ్‌లోని ఈ సరికొత్త కేఫ్‌లలో తాజా రుచులను ఆస్వాదించాల్సిందే..
వైజాగ్‌లోని ప్రకృతి దృశ్యాలతోపాటు ఆహారోత్పత్తుల రుచులను ఆస్వాదించదగ్గవే. ఇటీవల ఈ రుచులకు కాస్త డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్ వాసుల మనసు దోచేస్తొన్న ఇక్కడి తాజా రెస్టారెంట్‌లు, కేఫ్‌ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరికొత్త రుచుల ప్రపంచంలో కుటుంబం సమేతంగా విహరించేందుకు అనువైన గమ్యస్థానాలను మీకు పరిచయం చేయబోతున్నాం. మరెందుకాలస్యం ఘుమఘుమలు వెదజల్లే ఆ అందమైన ప్రదేశాలను చూసేద్దాం రండి!
స్వీట్ ఇండియా, గాజువాక
ఇటీవల కాలంలో స్వీట్ ఇండియా వైజాగ్ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి తియ్యని ముంచిన జిలేబీలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక రకాల ప్రసిద్ధ తినుబండారాలతో నోరూరించే ఉత్తర భారత స్ట్రీట్ ఫుడ్‌ని అందిస్తుంది ఈ ప్రాంతం. ఇక్కడ సమోసా, వడ పావ్, ధోక్లా, ఆనియన్ కచోరీ, చాట్‌లను అస్సలు మిస్సవ్వకండి. ఈ స్వీట్ ఇండియా గాజువాక, చుట్టుపక్కల ఉన్న ఉత్తర భారతీయ వంటకాలను ఇష్టపడే వారందరికీ మరింత సౌకర్యవంతంగా మారింది.

24×7 కోచ్ రెస్టారెంట్, రైల్వే స్టేషన్
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 24×7 కోచ్ రెస్టారెంట్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ కోచ్ రెస్టారెంట్ గుంటూరు, విజయవాడ విజయనగరంలో విజయవంతమైంది. మన రాష్ట్రంలోనే ఈ కోచ్ రెస్టారెంట్ నాల్గవదిగా నిలిచింది. ఈ విలక్షణమైన కోచ్ రెస్టారెంట్ స్టేషన్‌లో ప్రయాణికులు, సందర్శకులకు రౌండ్-ది-క్లాక్ డైనింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఆకర్షించే భోజన ప్రాంగణం, మండి-శైలి సిట్-అవుట్‌తో, ప్రజలు తమ భోజనాన్ని ఆస్వాదించడానికి అనువైన చోటుగా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు 24 గంటలూ తమ సమయాన్ని ఆస్వాదించేందుకు ఇది ప్రత్యేకమైన, సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుందనే చెప్పాలి.

బ్రూ ఎన్ బబుల్, గాజువాక
బ్రూ ఎన్ బబుల్ అనేది వైజాగ్‌లోని ఒక ప్రత్యేకమైన కేఫ్. ఇది కార్ వాషింగ్ సౌలభ్యంతో కాఫీ, స్నాక్స్‌ను అందించేందుకు అనువుగా దీనిని డిజైన్ చేశారు. ఈ కేఫ్‌లో, మీ కారును శుభ్రం చేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అలాగే, వివిధ రకాల కాఫీ, స్నాక్స్, మిల్క్‌షేక్‌లు, మాక్‌టెయిల్‌లను కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు. కార్ వాష్ సమయంలో కస్టమర్ల సమయాన్ని వృధా చేయకుండా, కస్టమర్లను సంతృప్తి పరిచేందుకు రుచికరమైన తినుబండరాలను, పానీయాలను అందిస్తారు.

స్కుజో డెసర్ట్ కేఫ్, ద్వారకా నగర్
స్కుజో డెసర్ట్ కేఫ్‌లో పాప్సికల్‌లు మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటాయి. ఈ రుచులని ఆస్వాదించడమే కాకుండా వాటి తయారీ ప్రక్రియను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అన్నింటినీ అధిక ప్రమాణాలతొ పరిశుభ్రత కలిగిన వాతావరణంలో అందిస్తారు. స్కుజో పాప్సికల్‌లు వాటి ప్రామాణికమైన పండ్ల రుచులకు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడకు వచ్చిన వారు తప్పకుండా వాటిని ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. మిక్స్డ్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ పాప్సికల్‌లు సందర్శన సమయంలో ఆస్వాదించే అనువైన రుచులుగా చెప్పొచ్చు.
మసాలా ఆంధ్ర, దస్పల్లా హిల్స్
స్పైసీ ఆంధ్రా-స్టైల్ రుచులు దొరికే రెస్టారెంట్ కోసం వెతుకుతున్నట్లయితే, దస్పల్లా హిల్స్‌లోని మసాలా ఆంధ్ర ది బెస్ట్ ఎంపిక అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ, శాఖాహార, మాంసాహార ప్రియులకు నచ్చే వంటకాలు అన్ని ఉంటాయి. రెండింటినీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications












