జార్ఖండ్ జీడిపప్పు నగరానికి ఎప్పుడైనా వెళ్లారా?
జీడిపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల అందరూ వీటిని తినేందుకు ఇష్టపడతారు కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కాలంలో వీటిని కొనడం కాస్త కష్టమే. మార్కెట్‌లో కిలో జీడిపప్పు రూ.800-1000 వరకు లభిస్తోంది. అటువంటి పరిస్థితిలో, మధ్యతరగతి కుటుంబం దానిని కొనడం అంత సులభం కాదు.
కానీ భారతదేశంలోని ఒక జిల్లాలో మాత్రం జీడిపప్పును కూరగాయల ధరలకే అమ్ముతున్నారు. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా నమ్మాల్సిందే. ఎందుకంటే, ఇదే వాస్తవం. ఎప్పూడైనా ఆ జిల్లాకు వెళితే ఓ రెండు మూడు కిలోల జీడిపప్పును తెచ్చిపెట్టుకోండి. ఏడాదంతా సరిపోతుంది. దీని ఖర్చు ఓ వందరూపాయలుంటుంది అంతే.. పదండి ఇంతకీ జీడిపప్పును అంత తక్కువ ధరకే అమ్మే ఆ గ్రామం గురించి తెలుసుకుందాం.

ఆ గ్రామం ఎక్కడ?
జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్‌లోని జంతారా అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామం. ఈ ప్రాంతాన్ని జార్ఖండ్ జీడిపప్పు నగరం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం జార్ఖండ్‌లోని జమ్తారా నగరానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలకే మాత్రమే లభించే అవకాశం ఉంది. అంటే మనం సాధారణంగా వాడే కూరగాయాలు ప్రస్తుతం కిలో 80 రూపాయల దాకా ఉంటున్నాయి.
అంతకన్నా తక్కువ ధరకే నాలా గ్రామంలో జీడిపప్పు దొరకుతుంది అంటే కాస్త వింతగానే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు, ఇతర నగరాల వారు ఈ నాలా గ్రామానికి వచ్చి జీడిపప్పును కొనుగోలు చేస్తుంటారు.ఇక్కడి నుంచి దళారులు అధికంగా కొన్ని బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముకుంటూ ఉంటారు.

అంత చౌక ధరకే ఎందుకు?
ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్నిచెప్పి జీడితోటను పెంచే విధంగా ప్రోత్సహించింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడిసాగును మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఎఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు.
ఆయన జంతారా జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వ్యవసాయం శాస్రవేత్తలతో మాట్లాడి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు. అనంతరం అటవీశాఖ చొరవ తీసుకుని ఆ గ్రామంలో జీడితోటలో పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. అంతా వచ్చి తక్కువధరకే జీడిపప్పును కొని తీసుకెళ్తున్నారు. అది కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో రోడ్డు పక్కన పెట్టి అమ్మతుండడం వల్ల కిలో 20 రూపాయల నుంచి 30 రూపాయలకే అమ్మాల్సీ వస్తోంది.

ప్రాసెసింగ్ ప్లాంట్ లేకపోయినా...
ఇక్కడ తొలిసారిగా జీడిపంట సాగు చేయగా.. దాన్ని చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ప్రాసెసింగ్ ప్లాంట్ లేనప్పటికీ తోటల నుండి జీడిపప్పులను ఇంటికి తీసుకువచ్చి, వాటిని సేకరించి తక్కువ ధరలకు రోడ్డు పక్కన విక్రయించడం ప్రారంభించారు. అందుకే పండ్ల నుంచి జీడిపప్పు తీయడం కష్టమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగాల్ వ్యాపారులు హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ప్రాసెసింగ్ తర్వాత వ్యాపారాలు చాలా లాభాలను ఆర్జిస్తాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు సాగుకు మంచి ధర అందుబాటులో లేదు.



Click it and Unblock the Notifications













