Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాంగడ్ - జార్ఖండ్

రాంగడ్ – ఒక ప్రశాంతమైన తీర్ధయాత్ర!

12

ఝార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాలలో ఒకటైన రాంగడ్, ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. హజారీబాఘ్ జిల్లలో ఒక భాగంగా వేరుచేయబడిన ఈ జిల్లా 2007 సెప్టెంబర్ 12 న ఏర్పాటుచేయబడింది. రాంగడ్ అంటే ‘శ్రీరాముని కోట’ అని అర్ధం.

ఈ జిల్లలో రాంగడ్, పత్రాటు, గోల, మందు చితర్పూర్, దుల్మి అనే ఆరు బ్లాకులు ఉన్నాయి. రాంగడ్ రాతియుగ కాలానికి చెందిన గొప్ప చరిత్ర కలిగి ఉందని చరిత్ర చెప్తుంది. రాంగడ్ వద్ద ముస్లిం పాలన, బ్రిటీష్ పాలన కూడా ఉందని గుప్త సామ్రాజ్యంలో ఆధారాలు ఉన్నాయి.

రాంగడ్, ఈ జిల్లాలోని పారిశ్రామిక విభాగపు భవనానికి ఉపయోగపడే బొగ్గు వంటి గొప్ప ఖనిజ వనరులను కలిగి ఉంది. రాంగడ్ లోని పత్రాటు జిల్లా వద్ద, అరవైలలో ఏర్పాటుచేయబడిన ఒక ముఖ్యమైన థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. రాంగడ్, నల్కరి డాం, నల్కరి బర్కి నది కి కూడా ప్రసిద్ది చెందింది. ఈ జిల్లా కావలసినంత వృక్ష, జంతుజాతులను కలిగిఉంది.

రాంగడ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

సందర్శకులు రాంగడ్ లోని ఈ ముఖ్యమైన ప్రదేశాలను తప్పక చూడాలి. ఇక్కడ తూటి ఝార్ణ ఆలయం, మాయతుంగ్రి ఆలయం, రాజ్రప్ప మందిరం వంటి ధార్మిక ఆకర్షణలు ఉన్నాయి. అంతేకాకుండా, దుర్-దురియ జలపాతం, అమ్-ఝరియ జలపాతం, నైకరి డాం, గంధునియా (వేడినీటి బుగ్గ), బంఖేట్ట (గుహ), ఇంకా అనేకమైనవి ఇక్కడి సహజ ఆకర్షణలలో కొన్ని.

రాంగడ్ మహాత్మా గాంధీ సమాధి స్థల్ వంటి చారిత్రిక ఆకర్షణను కూడా కలిగి ఉంది, రాంగడ్ వద్ద భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాల కోసం మహాత్మా గాంధీ 1940 వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన మరణం తరువాత, కొన్ని అవశేషాలను ఇక్కడ ఉంచారు. చైనా సేమేట్రీ II వ ప్రపంచ యుద్ధ సమయంలో పాముకాటుకు, ఆకలికి చనిపోయిన సైనికులందరి కోసం ఏర్పాటుచేయబడిన ఒక ఉమ్మడి స్మశాన వాటిక. ఇక్కడ బౌద్ధ ఆలయం, స్మారక స్థూపాలతోపాటు షుమారు 667 సమాధులు కూడా ఉన్నాయి.

రాంగడ్ వాతావరణం

రాంగడ్ ఉప తేమతో కూడిన వాతావరణాన్ని కలిగిఉన్న ఛోటానాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఉ౦ది. ఇక్కడి ఉష్ణోగ్రత పాక్షిక-తీవ్రంగా ఉంటుంది. రాంగడ్ జిల్లా శీతాకాలం – నవంబర్ నుండి ఫిబ్రవరి, వేసవి – మార్చ్ నుండి మే, వర్షాకాలం – జూన్ నుండి అక్టోబర్ వంటి మూడు కాలాలుగా విభజించబడింది.

రాంగడ్ లోని గొప్ప సంస్కృతి

రాంగడ్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలను స్థానికులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. దీపావళి, హోలీ, దాసరా, రామనవమి, ఈద్, మకర సంక్రాంతి మొదలైనవి ఇక్కడి కొన్ని ప్రధాన పండుగలు. ఈ జిల్లా అనేక పరిశ్రమలు, గనులు కలిగిఉండడం వల్ల, విస్కర్మ పూజ కూడా ప్రధానంగా జరుపుకుంటారు. రాజ్రప్ప మందిరం, తూతో ఝార్ణ మందిరం వివాహాలు జరిగే ప్రదేశాలు.

సందర్శకులు ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్స్ దుస్క, వడ తోపాటు స్థానిక వంటలను కూడా ఆనందిస్తారు. ఈ వంటలలో వివిధ పూలు, ఆకులు కూడా ఉపయోగిస్తారు. రాజ్రప్ప మందిర౦, పొడి తీపి వంటైన ఖోయ పేడాస్ ని అందిస్తుంది.

రాంగడ్ చేరుకోవడం ఎలా

రాంగడ్ బాగా అనుసంధానించబడిన జిల్లా, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చాలా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే గా విభజించబడిన రైలు నెట్వర్క్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాను ప్రధాన నగరాలకు కలిపే జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. రాంచి వద్ద ఉన్న బిర్స ముండ దీనికి సమీప విమానాశ్రయం, ఇది ఢిల్లీ, పాట్న, ముంబై, కోల్కతా వంటి నగరాలను కలుపుతుంది.

 

రాంగడ్ - జార్ఖండ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాంగడ్ - జార్ఖండ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాంగడ్ - జార్ఖండ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాంగడ్ - జార్ఖండ్

  • రోడ్డు ప్రయాణం
    బస్సుద్వారా – రాంగడ్ కంటోన్మెంట్ నుండి బీహార్, ఝార్ఖండ్ వద్ద అన్ని ప్రధాన ప్రదేశాలకు బస్ స్టాండ్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా – రాంగడ్ కంటోన్మెంట్ స్టేషన్ (28 km), రాంచి రోడ్డు (28 km), బర్కకన (33 km), కోడెర్మ (135 km) సమీప రైల్వే స్టేషన్లు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా -70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంచి దీనికి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue