Search
  • Follow NativePlanet
Share
» »ఉఖిమత్‌లోని ఈ చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌ను ఎప్పుడైనా చూశారా?

ఉఖిమత్‌లోని ఈ చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌ను ఎప్పుడైనా చూశారా?

ఉఖిమత్‌లోని ఈ చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌ను ఎప్పుడైనా చూశారా?

భార‌త‌దేశంలో ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం క‌లిగిన ప్ర‌దేశాల‌తో పాటు, చ‌ల్ల‌ని ప్ర‌దేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ మండేవేడి నుండి త‌ప్పించుకునేందుకు ఈ స‌మ‌యంలో చాలామంది చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటు ఉంటారు. భార‌త‌దేశంలోని చాలా రాష్ర్ట‌ల్లో అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటింది. ఈ ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు అందరూ చల్లటి ప్రదేశాల‌కు బ‌య‌లుదేరుతున్నారు.

కొందరు హిమాచల్ ప్రదేశ్‌కు, మరి కొందరు ఉత్తరాఖండ్‌కు వారి ప్ర‌యాణాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ మండే వేడిని ఉప‌శ‌మనం పొందాల‌నుకుంటున్నారా? అయితే ఉత్తరాఖండ్‌లోని కొన్ని అందమైన మరియు చల్లని ప్రదేశాల‌కు వెళ్లండి. అక్క‌డి ప్ర‌దేశాల‌ను మిమ్మ‌ల్ని చ‌ల్ల‌ద‌నంతో నింపేస్తాయి. ఉత్త‌రాఖండ్‌లోని ఉఖిమ‌త్‌లో ఉన్న ఈ చల్ల‌ని ప్ర‌దేశాల గురించి తెలుసుకుందాం రండి.

deoriatal1

డియోరియా తాల్

ఉఖిమత్‌లోని సందర్శన స్థ‌లాలో డియోరియా తాల్ పేరు ఖచ్చితంగా ముందుంటుంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న నిర్మలమైన వాతావరణం మరియు మంత్రముగ్ధులను చేసే దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను చూపుతిప్పుకోనివ్వ‌కుండా చేస్తాయి. సరస్సు ఒడ్డున కూర్చుని అందమైన దృశ్యాలతో పాటు చల్లని గాలిని ఆస్వాదించే అనుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఎత్తైన మరియు అందమైన పర్వతాల మధ్యలో ఉన్న ఈ సరస్సు ట్రెక్కింగ్ ప్రేమికులకు ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ఎందుకంటే ప్రధాన నగరం నుండి సరస్సు చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

tungnathtemple1

తుంగనాథ్ ఆలయం

ఉఖీమత్ నుండి సుమారు 28 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న తుంగనాథ్ దేవాలయం ఒక పవిత్ర దేవాలయం అలాగే పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం పర్వత శిఖరంపై ఉంది. దీని కారణంగా పర్యాటకులు దర్శనం కోసం ఇక్కడకు ప్ర‌తిఏటా చేరుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణం నుండి హిమాలయాలలోని అందమైన లోయలను కూడా ఆస్వాదించవచ్చు. మే నుండి జూలై వరకు ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

సారి (చీర‌) గ్రామం

ఉఖిమత్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీర గ్రామం చాలా అందమైన మరియు మనోహరమైన ప్రదేశం. నాలుగు వైపుల నుండి అందమైన పర్వతాలు మరియు మధ్యలో ఉన్న ఈ గ్రామం కూడా పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తుంది.

భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వేడి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చల్లని గాలి మధ్య మీరు కొన్ని రోజులు ప్రశాంతంగా గడపవచ్చు.

ukhimat1

ఉఖిమత్‌లో చూడవలసిన ఇతర ప్రదేశాలు

ఉఖిమత్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోప్తా హిల్ స్టేషన్ వద్ద చల్లని గాలిని ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక్క‌డికి సమీపంలోని మందాకిని నది ఒడ్డున కూడా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఉఖిమత్ చేరుకోవడం ఎలా?

సమీప విమానాశ్రయం జాలీ గ్రాంట్ విమానాశ్రయం. జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి ఉఖిమత్ వరకు దూరం దాదాపు 200 కిలోమీట‌ర్ల‌ విమానాశ్రయం వెలుపల నుండి టాక్సీలు, బస్సులు లేదా క్యాబ్‌లు తీసుకోవచ్చు. స‌మీపంలోని రిషికేష్ రైల్వే స్టేషన్ నుండి ఉఖిమత్ వరకు సుమారు 174 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రిషికేశ్ నుండి ఉఖిమత్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

More News

    Read more about: deoria tal tungnath temple
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+