Search
  • Follow NativePlanet
Share
» »తనను వాహనంగా అంగీకరించాలని కోరుతూ పరమశివుడి గురించి నంది తపస్సు చేసింది ఇక్కడే

తనను వాహనంగా అంగీకరించాలని కోరుతూ పరమశివుడి గురించి నంది తపస్సు చేసింది ఇక్కడే

పౌర్ణమి సమీపిస్తున్న తరుణంలో శివుడి వాహనమైన నంది, నవ నందుల క్షేత్రాలకు సంబంధించి ప్రత్యేక కథనం.

By Beldaru Sajjendrakishore

పమరశివుడి పరివారంలో నందికి ప్రత్యేక స్థానం. నందిని తన వాహనంగా మార్చుకుని ఈ ముల్లోకాలలో జరిగే ప్రతి చర్యను ఆ పరమశివుడు నియంత్రిస్తున్నాడని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. శివుడు లింగ రూపంలో ఉన్న ప్రతి చోట నంది తప్పక ఉంటాడు. పరమశివుడిని, నందిని వేర్వేరుగా చూడలేము. కొన్ని ఆలయాల్లో మొదట నందికి నమస్కరించిన తర్వాతనే శివుడికి పూజలు జరపాలన్న సంప్రదాయం కూడా ఉంది. ఇంతటి ప్రాధన్యత కలిగిన నంది పరమశివుడి గురించి తప్పస్సు చేసి తనను వాహనంగా నియమించుకోవాలని ప్రార్థించిన స్థలం నేడు ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది. అంతే కాకుండా నంది తపస్సు చేసిన ప్రాంతంతో సహా మొత్తం తొమ్మిది నందులు కలిగిన నవనందుల పుణ్యక్షేత్రంగా కూడా పిలువ బడుతోంది. అది ఎక్కడ ఉంది, ఆ స్థల విశిష్టత ఏమిటి తదితర వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. నందమహారాజు కాలంలో

1. నందమహారాజు కాలంలో

Image source

పూర్వం నంద మహారాజు ప్రస్తుతం నంద్యాల ఉన్న ప్రాంతాన్ని నందుల రాజ్యం పేరుతో ప్రజారంజకంగా పాలించే వాడు. నందుడు పాలించిన ఈ ప్రాంతం క్రమేణ నంద్యాలగా మారింది.

2. ప్రతి రోజు పాలను ఇచ్చేది

2. ప్రతి రోజు పాలను ఇచ్చేది

Image source

ఆయన ఆస్థానంలో ఉన్న గోపాలకుడు గోవులను తీసుకుని మేపడానికి దగ్గర్లో ఉన్న అడవికి తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలో ఒక ఆవు ప్రతి రోజు ఒక పుట్టదగ్గరకు వెళ్లి తన పొదుగు నుండి పాలు ఇచ్చేది.

3.రాజుకు తెలియజేశాడు.

3.రాజుకు తెలియజేశాడు.

Image source

ఈ విషయాన్ని గమనించిన గోపాలకుడు మొత్తం ఘటనను తన రాజైన నంద మహారాజుకు తెలియజేశాడు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో రాజు మరుసటి రోజు గోపాలకుడితో సహా అడవికి వచ్చాడు.

4. రాజు కూడా వెళ్లి చూశాడు

4. రాజు కూడా వెళ్లి చూశాడు

Image source

ఎప్పటిలాగానే ఆవు ఒక పుట్టదగ్గరకు వెళ్లి పాలు ఇవ్వడం చూశాడు. దీంతో మరింత ఆసక్తితో రాజు కొంచెం ముందుకు వెళ్లగా ఆ ఆవు బెదిరి ఆ పుట్ట పై కాలు పెట్టి అంతర్థానమై పోతుంది.

5.కలలో శివుడు కనిపించి

5.కలలో శివుడు కనిపించి

Image source

దీంతో చింతించిన రాజు విచారంతో తన ఇంటికి వెళ్లి పడుకొంటారు. అప్పుడు కలలో శివుడు ప్రత్యక్షమై తన కోసమే ఆ ఆవు ప్రతి రోజు అక్కడకు వచ్చి పాలు ఇచ్చేదని తెలియజేశాడు.

6. మహానందుడు పేరు పైనే

6. మహానందుడు పేరు పైనే

Image source

పూర్వం శిలాద మహర్షి కుమారుడైన మహానందుడు ఇక్కడే తప్పస్సు చేసి తనను వాహనంగా తీసుకోమని తనను అర్థించాడని కూడా పరమశివుడు ఆ రాజుకు తెలియజేస్తాడు. మహానందు తపస్సు చేసిన ఈ ప్రాంతం అదే పేరుతో పుణ్యక్షేత్రమవుతుందని కూడా చెబుతాడు.

7. దేవాలయాన్ని నిర్మించి

7. దేవాలయాన్ని నిర్మించి

Image source

ప్రస్తతం పుట్ట ఉన్న ప్రాంతంలో తనకు దేవాలయం కట్టించాలని ఆదేశిస్తాడు. అంతే కాకుండా త్వరలో ఈ ప్రాంతానికి దగ్గర్లో ఎనిమిది వేర్వేరు చోట్ల తాను నందితో పాటు వెలుస్తానని దీంతో ఈ ప్రాంతం నవ నందుల క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పి మాయమవుతాడు.

8. లింగం పై ఆవు గిట్ట

8. లింగం పై ఆవు గిట్ట

Image source

రాజు పరమశివుడు చెప్పినట్లే గోవును చూసిన ప్రాంతంలో పుట్టను తవ్వగా ఒక లింగం బయటపడుతుంది. దాని పై భాగాన ఆవు గిట్ట వంటి గుర్తు ఉంటుంది. కాగా, ఇక్కడ పరమ శివుడు మహానందీశ్వరుడిగా ప్రజలతో పూజలు అందుకుంటుంన్నాడు.

9. ఎనిమిది వేర్వేరు చోట్ల

9. ఎనిమిది వేర్వేరు చోట్ల

Image source

ఇదిలా ఉండగా రాజుకు చెప్పినట్లే మరి కొద్ది రోజుల్లోనే ప్రధాన ఆలయానికి దగ్గర్లో ఎనిమిది వేర్వేరు చోట్ల శివుడు వెలుస్తాడు. వాటికి కూడా రాజు ఆలయాలను నిర్మింపజేస్తాడు. ఆ ఆలయాలు వేర్వేరు పేర్లతో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా మారాయి.

10. ఒకే రోజు సందర్శించుకోవాలి.

10. ఒకే రోజు సందర్శించుకోవాలి.

Image source

ఈ ఆలయాలను కార్తిక మాసంలో సోమవారం రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు సందర్శించుకుంటే సకల పాపాలు తొలిగి పోతాయాని భక్తుల నమ్మకం. ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం లోపు వీటిని దర్శించుకోవడనాకి వీలుగా ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసింది.

11. నవ నందులు ఇవే

11. నవ నందులు ఇవే

Image source

ప్రథమనందీశ్వర ఆలయం, నాగనందీశ్వరుడు, సోమనందీశ్వరుడు, సూర్యనందీశ్వరుడు, శివనందీశ్వరుడు, కృష్ణనంది (విష్ణునంది), మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుడు, వినాయక నందీశ్వరుడు, గరుడనందీశ్వర పేరుతో నవ నందుల ఆలయాలు ఉన్నాయి.

12. ఎక్కడ ఉంది.

12. ఎక్కడ ఉంది.

Image source

మహానందితో సహా నవ నందుల క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చుట్టు పక్కల ఉన్నాయి. ముఖ్యంగా మహానంది క్షేత్రం నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

13. ఎప్పుడు ఉత్సవాలు బాగా జరుగుతాయి.

13. ఎప్పుడు ఉత్సవాలు బాగా జరుగుతాయి.

Image source

నవ నంది క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. కేవలం స్థానికులే కాకుండా చుట్టు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో కూడా ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి.

14.మొదట ఇక్కడే దర్శనం చేసుకోవాలి

14.మొదట ఇక్కడే దర్శనం చేసుకోవాలి

Image source

నవనంది పుణ్యక్షేత్రాల యాత్ర ప్రారంభించే ముందు నంద్యాల పట్టణంలోని సాక్షి మల్లికార్జున స్వామి దర్శనన్ని తప్పక చేసుకోవాలని స్థానికులు చెబుతారు. అప్పుడు మాత్రమే యాత్ర ఫలం సిద్ధిస్తుందని నమ్మకం

15.ప్రయాణ సౌకర్యాలు ఇలా

15.ప్రయాణ సౌకర్యాలు ఇలా

Image source

నంద్యాలతో పాటు కర్నూలు నుంచి ఇక్కడకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యం బాగుంది. రైలు సౌకర్యం కూడా కర్నూలుకు ఉంది. ఇక రాత్రి పూట బస చేయడానికి వీలుగా అనేక లాడ్జీలు కూడా ఉన్నాయి.

16. అనేక మంది రాజులు

16. అనేక మంది రాజులు

Image source

నందుల రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని బాదామి చాలుక్యులు, చంద్రగుప్త మౌర్యుడు తదితర రాజులు పరిపాలించారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది.

17 గోముఖ శిల నుంచి

17 గోముఖ శిల నుంచి

Image source

ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు ఎల్లప్పుడూ గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తుంటుంది. పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది.

18. వేసవిలో చల్లగా

18. వేసవిలో చల్లగా

Image source

వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+