Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో ఉత్తమ ఆయుర్వేద రిసార్ట్స్ ఇవే

భారతదేశంలో ఉత్తమ ఆయుర్వేద రిసార్ట్స్ ఇవే

ఆయుర్వేద రెస్టోరెంట్లకు సంబంధించిన జాబితా

వైద్యశాస్త్రంలో ఒక విభాగమైన ఆయుర్వేద శాఖ ఆయుష్, వేద అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఈ ఆయుర్వేద శాస్త్రం భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతో ప్రాచూర్యం పొందింది. విదేశీ వైద్యులు కూడా భారతదేశాన్ని తరుచుగా సందర్శిస్తూ ఈ ఆయుర్వేద శాస్త్రంలోని వివిధ విషయాలను గురించి తెలుసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆయుర్వేద చికిత్స పొందడానికి ఉత్తమమైన స్థానాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

సుమతిరామ్ ఆయుర్వేద

సుమతిరామ్ ఆయుర్వేద

P.C: You Tube

సుమతిరామ్ ఆయుర్వేద రెసార్ట్ కేరళలోని తిరువనంతపురం జిల్లా కోవలం బీచ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. దీనిని క్రీస్తుశకం 1985లో స్థాపించారు. ఇక్కడ చికిత్స తీసుకోవడానికి విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ నిపుణులైన థెరపిస్ట్‌లు ఉన్నారు.

నిపుణులు

నిపుణులు

P.C: You Tube

ఇక్కడ ఉన్న నిపుణులు చికిత్స అందించడమే కాకుండా ఆ సమయంతోపాటు మిగిలిన సమయాల్లో కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న విషయమై ఉత్తమ సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ రిసార్ట్ తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 21 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ఎయిర్ పోర్టు నుంచి ఇక్కడకు వెళ్లడానికి ట్యాక్సీలు ఉన్నాయి.

ఆనంద్ రెసార్ట్ ఆయుర్వేద

ఆనంద్ రెసార్ట్ ఆయుర్వేద

P.C: You Tube

ఉత్తరఖండ్ తెహ్రీ గద్వాల్ లో ఈ ఆనంద్ రెసార్ట్ ఆయుర్వేద ఉంది. చుట్టూ అందమైన పర్వతాల మధ్య ఉన్న ఈ రెసార్ట్ లో చికిత్స తీసుకోవడానికి అనేకమంది విదేశాల నుంచి కూడా వస్తుంటారు. భారతదేశంలోని అత్యంత ప్రాచీన రిసార్ట్ ఇదే. అరోమా థెరపీ ఇక్కడ ప్రత్యేకం.

దేవయ్య ఆయుర్వేద

దేవయ్య ఆయుర్వేద

P.C: You Tube

గోవా అన్న తక్షణం మనకు అక్కడి సముద్ర తీర ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. అదే సమయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అయుర్వేద సెంటర్ ఉంది. అదే దేవయ్య ఆయుర్వేద, నేచర్ కేర్ సెంటర్. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇక్కడ మీరు యోగ, ధ్యానంతో పాటు మ్యూజిక్ థెరపీ కూడా అందుబాటులో ఉంటుంది.

లీలా ప్యాలెస్ ఆయుర్వేద రెసార్ట్, ఉదయ్‌పూర్

లీలా ప్యాలెస్ ఆయుర్వేద రెసార్ట్, ఉదయ్‌పూర్

P.C: You Tube

భారతదేశంలో ఉదయ్‌పూర్‌కు లేక్‌ సిటీ అని పేరుంది. ఇక్కడ ఉన్నటువంటి లీలా ప్యాలెస్ ఆయుర్వేద చికిత్సకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. యోగ, ధ్యానంతోపాటు ఇతర అనేక థెరపీలు ఇక్కడ ప్రత్యేకం. అనేక పర్యాటకప్రాంతాలను చూసిన మీ శరీరం కొంత సేద తీరాలనుకొంటే ఇక్కడకు వెళ్లడం ఉత్తమం

కైరాలీ ఆయుర్వేద హెల్త్ రిసార్ట్, కేరళ

కైరాలీ ఆయుర్వేద హెల్త్ రిసార్ట్, కేరళ

P.C: You Tube

కైరాలీ ఆయుర్వేద హెల్త్ రిసార్ట్ కేరళలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించి పెట్టింది. కేరళలో ప్రముఖ పట్టణమైన పాలక్కడ్ లో ఈ రిసార్ట్ ఉంది. ఇక్కడ అనేక రకాల వ్యాధులను నయం చేస్తారు. అందువల్లే ఇక్కడకు వివిధ దేశాల నుంచి కేవలం చికిత్స కోసమే ఇక్కడికి వస్తుంటారు.

థై మసాజ్

థై మసాజ్

P.C: You Tube

ఏక కాలంలో యోగ, యురోపియన్, థై మసాజ్‌తో పాటు ధ్యానం ఇక్కడ ప్రత్యేకం. అందుకు అనుగుణంగా నిపుణులు ఇక్కడ ఉంటారు. కస్టమైజ్ అంటే ‘ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా వారి అవసరాలకు తగ్గట్టు' అని అర్థం వచ్చేలా ఇక్కడ సేవలను అందిస్తారు. ఢిల్లీ నుంచి డెహ్రడూన్‌కు కు వెళ్లి అక్కడి నుంచి ఈ రెసార్ట్‌కు వెళ్లవచ్చు.

 లీలా ప్యాలెస్ ఆయుర్వేద రెసార్ట్, ఉదయ్‌పూర్

లీలా ప్యాలెస్ ఆయుర్వేద రెసార్ట్, ఉదయ్‌పూర్

P.C: You Tube

భారతదేశంలో ఉదయ్‌పూర్‌కు లేక్‌ సిటీ అని పేరుంది. ఇక్కడ ఉన్నటువంటి లీలా ప్యాలెస్ ఆయుర్వేద చికిత్సకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. యోగ, ధ్యానంతోపాటు ఇతర అనేక థెరపీలు ఇక్కడ ప్రత్యేకం. అనేక పర్యాటకప్రాంతాలను చూసిన మీ శరీరం కొంత సేద తీరాలనుకొంటే ఇక్కడకు వెళ్లడం ఉత్తమం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+