Search
  • Follow NativePlanet
Share
» »వింట‌ర్‌లో సంద‌ర్శించేందుకు గుజ‌రాత్‌లోని ప్ర‌సిద్ధిచెందిన బీచ్‌లు..

వింట‌ర్‌లో సంద‌ర్శించేందుకు గుజ‌రాత్‌లోని ప్ర‌సిద్ధిచెందిన బీచ్‌లు..

బీచ్‌ల‌న‌గానే చాలామందికి గోవానే ట‌క్కున గుర్తొస్తుంది. డెస్టినేష‌న్ పేరుతో అంత‌గా ప్ర‌సిద్ధిచెందింది ఈ ప్ర‌దేశం. గోవాలో ప్ర‌సిద్ధిచెందిన బీచ్‌లు చాలానే ఉన్నాయి. ప‌ర్యాట‌కులు పూర్తి వినోదం కోసం ఈ బీచ్‌ల‌కు వెళ్తుంటారు. కానీ, గుజ‌రాత్ రాష్ట్రంలో కూడా అత్యంత అంద‌మైన బీచ్‌లు ఉన్నాయి. ఇవి ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఇక్క‌డి అంద‌మైన దృశ్యాల‌ను కెమెరాల్లో బంధించొచ్చు. న‌వంబర్ నుండి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు గుజ‌రాత్ సంద‌ర్శ‌న‌కు ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం అని చెప్పుకోవాలి. ఈ సీజ‌న్‌లో ఇక్క‌డ‌కు వెళ్లాల‌ని అనుకుంటే మాత్రం త‌ప్పకుండా ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఇవి విహారాయాత్ర‌కు ఎంతో అనువైన‌వి.

జ‌న‌వ‌రి నెల‌లో గుజరాత్‌లో రన్ ఉత్సవ్ కూడా జరుగుతోంది. ఇది ఇక్కడ గుజ‌రాత్‌లో నిర్వ‌హించే అతిపెద్ద పండుగ. ఈ పండుగ మూడు నెలల పాటు కొనసాగుతుంది. శీతాకాలంలో మాత్రమే ఈ పండుగను నిర్వ‌హిస్తారు. గుజరాత్‌ని సందర్శించడానికి ఇదే ఉత్తమ సమయం. కాబ‌ట్టి, గుజ‌రాత్‌లోని అంద‌మైన బీచ్‌ల‌ను సంద‌ర్శించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోండి.

madhavpurbeach , gujarat

మాండ్వి బీచ్

మాండ్వి బీచ్ గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది. ఇది ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంది. గుజరాత్‌లో రెండు మాండ్వి బీచ్‌లు ఉన్నాయి. ఒకటి కచ్‌లో ఉంది. మరొకటి అహ్మద్‌పూర్‌లో ఉంది. రెండు బీచ్‌లు ఎంతో అందంగా ఉంటాయి. రాన్ ఫెస్టివల్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన‌ట్ల‌యితే మాత్రం ఈ బీచ్ సమీపంలోనే ఉంటుంది. ఈ బీచ్ నుండి సూర్యుడు అస్తమించే దృశ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బీచ్‌లో ఎన్నో సాహస కార్యకలాపాలు ఉన్నాయి. ఇక్క‌డ గుర్రం, ఒంటె స్వారీల‌ను కూడా ఆస్వాదించొచ్చు.

మాధవపూర్ బీచ్

గుజరాత్‌లోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి మాధవపూర్ బీచ్. ఈ బీచ్ పోర్‌బందర్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోర్‌బందర్ నుండి సోమనాథ్‌కు కారులో ప్రయాణించేట‌ప్ప‌డు ఇక్క‌డి ప్రకృతి అందాల‌ను వీక్షించొచ్చు. మాధవ్‌పూర్ బీచ్ జునాగఢ్‌కు దగ్గరగా సందర్శించడానికి అత్యంత ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్పొచ్చు. కుటుంబంతో కలిసి స‌ర‌దాగా గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం గోవాలోని మాధ‌వ‌పూర్ బీచ్ ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఈ బీచ్‌లో సూర్య‌ర‌శ్మి దృశ్యాల‌ను చూడొచ్చు. సూర్యరశ్మి, ఒంటె స్వారీ, గుజరాతీ రుచులను ఆస్వాదించవచ్చు. ఇక్క‌డ విశ్రాంతి తీసుకోవచ్చు.

mandvibeach1

జామ్‌నగర్ బీచ్

గుజరాత్‌లోని జామ్‌నగర్ బీచ్ కూడా చాలా అందమైనది. ఇది విహారయాత్రల‌కు ఎంతో ఉత్తమమైనది. ప్రధాన నగరం నుండి ఈ బీచ్ దూరం సుమారు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇక్క‌డ ర‌ద్దీగా ఉండ‌దు. ఈ ప్ర‌దేశం ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంది. అందుకే ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఈ ప్ర‌దేశం ఎంత‌గానో న‌చ్చుతుంది. ఇక్కడ అనేక ఇతర చిన్న బీచ్‌లు కూడా ఉన్నాయి.

సోమనాథ్ బీచ్

సోమనాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్క‌డ ఆల‌యంతో పాటు బీచ్‌కూడా ఎంత‌గానో పేరుగాంచింది. ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్‌ను కూడా చూసే అవకాశాన్ని అస్స‌లు కోల్పోకండి. చాలా మంది భక్తులు ఆలయాన్ని సందర్శించిన తర్వాత బీచ్ సంద‌ర్శ‌న‌కు బయలుదేరుతారు. ఈ బీచ్ ర‌ద్దీగ ఉండ‌దు. ప‌ర్యాట‌కులు ఇక్క‌డ ఎంజాయ్ చేయొచ్చు.

నార్గోల్ బీచ్

బీచ్ వెంబడి పచ్చని చెట్లు ఈ ప్రాంత అందాన్ని మ‌రింత పెంచుతాయి. ఈ బీచ్ చాలా నిశ్శబ్దంగా, ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణంలో ఉంటుంది. సముద్రపు అలలను సులభంగా ఇక్క‌డ వినొచ్చు. ఇది ఇక్కడ ఆఫ్‌బీట్ ప్రదేశాలలో చేర్చబడింది. దీని కారణంగా ఈ ప్రదేశం యొక్క అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. నార్గోల్ బీచ్‌ గుజరాత్‌లోని వల్సాద్‌లో ఉంది. దీంతో పాటు ఇక్క‌డ‌ తితాల్ బీచ్ కూడా ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+