Search
  • Follow NativePlanet
Share
» »వైజాగ్ సిటీకి చేరువ‌లోని ప్ర‌కృతిసిద్ధ‌మైన ప‌ర్యాట‌క ప్రాంతాలివే!

వైజాగ్ సిటీకి చేరువ‌లోని ప్ర‌కృతిసిద్ధ‌మైన ప‌ర్యాట‌క ప్రాంతాలివే!

పచ్చని కొండలు.. లోతైన స‌ముద్ర‌పు తీరం మధ్య ఉన్న వైజాగ్ అందాన్ని మాటల్లో చెప్ప‌లేం. ప‌ర్యాట‌క ప్ర‌ఖ్యాతత‌కు చిరునామాగా విశాఖ న‌గ‌రం ప్రతిబింబిస్తుంది. ఇక్క‌డి న‌గ‌ర‌పు అందాల‌ను ఆస్వాదిస్తూ ఉండిపోతే స‌రిపోదు.. మ‌దుర‌మైన ప‌ర్యాట‌క అనుభూతుల‌ను చేరువ‌చేసే జ‌ర్నీని ఎంజాయ్ చేస్తూ.. న‌గ‌ర‌పు స‌రిహ‌ద్దుల్లో కొలువై ఉన్న సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌ను చూడాల్సిందే. కుటుంబ స‌మేతంగా ఒక‌రోజు ప్ర‌శాంతంగా గ‌డిపేందుకు వైజాగ్ చుట్టుప‌క్క‌ల ఉన్న ఈ ప‌ర్యాట‌క అందాల‌ను ఎంపిక చేసుకోవ‌డం ఉత్త‌మం!

జింధగడ శిఖరం

వైజాగ్ సిటీ నుండి 140 కిలోమీట‌ర్ల దూరంలో జింధగడ శిఖరం ఉంది. ఇది సముద్ర మట్టానికి 1,690 మీటర్ల ఎత్తులో తూర్పు కనుమల్లో (ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎత్తైన శిఖరం) ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తింపు పొందింది. నిత్య సుందరమైన అరకు లోయ అందాల‌ను ఆస్వాదిస్తూ.. ముందుకు సాగాల్సి ఉంటుంది. వైజాగ్ నుండి మాడుగుల, పాడేరు నుండి డుంబ్రిగుడ వరకు అరకు రోడ్డు మార్గంలో కొండకు చేరుకోవచ్చు. క్యాంప్‌సైట్‌కి 10 కిలోమీట‌ర్లు ట్రెక్కింగ్ చేయ‌డం ద్వారా (సుమారు రెండు గంటలు పడుతుంది) శిఖ‌రాన్ని అందుకున్న అనుభూతి చేరువ అవుతుంది.

jindhagadapeak

డుడుమ జలపాతాలు

ఆంధ్ర మరియు ఒడిశా మధ్య సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతాలు ప్ర‌కృతి ప్ర‌సాదించిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా సంద‌ర్శ‌కులు భావిస్తారు. వైజాగ్ నుండి డుడుమ జలపాతాల మధ్య దూరం సుమారు 177 కిలోమీట‌ర్లు ఉంటుంది. న‌గ‌రం నుంచి ఇక్క‌డ‌కు చేరుకునేందుకు ఐదు గంట‌ల స‌మ‌యం వ‌ర‌కూ ప‌డుతుంది. అయితే, ఈ ప్ర‌యాణంలో ఎక్క‌డా అల‌స‌ట అనే మాట వినిపించ‌దు. ఇక్క‌డి సాయంత్ర‌పు ప్ర‌కృతి అందాల‌ను జీవితంలో ఒక్క‌సారైనా చూడాల్సిందే. జాలువారే జ‌ల‌పాతాల అందాల‌ను మాటల్లో వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే.

arakuvalley1

గోస్తనీ గుహలు

జింధగడ శిఖరం వద్ద ఆకాశాన్ని తాకి, డుడుమ వద్ద నీటి ప్రవాహాన్ని అనుభవించిన తర్వాత చూడాల్సిన ప‌ర్యాట‌క అందం గోస్త‌నీ గుహ‌లు. అక్షరాలా వైజాగ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో గోస్థానీ గుహలు ఉన్నాయి. ట్రెక్కింగ్ ప్రియుల మ‌న‌సుదోచే గోస్త‌నీ గుహ‌లు బొర్రా గుహలలోని ఏడు గుహల స‌ముదాయంలో ఒకటి. చీకటి గుహల గుండా ట్రెక్కింగ్ చేయ‌డం ద్వారా గోస్తని నది ప్రవహించే అడవిలోని ముఖ‌ద్వారానికి దారి క‌నిపిస్తుంది. ఈ ట్రెక్ దాదాపు నాలుగు కిలోమీట‌ర్ల‌ వరకు సాగుతుంది. ఎకోహైక్స్ లేదా స్టార్‌డస్ట్ అడ్వెంచర్స్ వంటి స్థానిక ట్రెక్కింగ్ గ్రూపులు మీరు గుహలను గ్రూపులుగా సాహస యాత్ర చేసేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం

న‌గ‌రం నుంచి చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రకృతి ఆస్వాదించాల‌నుకుంటే కోరుకుంటే, మీరు కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం స‌రైన ఎంపిక‌. వైజాగ్ నుండి కేవలం మూడు కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. 7,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం ఎన్నో అరుదైన‌ వృక్షజాలం మరియు జంతుజాలాన్ని త‌న‌లో దాచుకుంది. కొండలతో కూడిన ప్రకృతి దృశ్యాలు, పచ్చని అడవులు మరియు లెక్కలేనన్ని స్థానిక జంతు జాతులతో ఈ ప్రదేశం ఎంతో సందడిగా ఉంటుంది. మీరు భారతీయ చిరుతపులి, నక్కలు, జింకలు మరియు మరిన్ని అరుదైన‌ జంతువులను ఇక్కడ చూడొచ్చు. ట్రెక్కింగ్ నుండి పక్షులను వీక్షించడం, వన్యప్రాణుల సఫారీల వరకు, ఇక్కడ అనేక కార్యకలాపాలను చేపట్టవచ్చు.

More News

Read more about: visakhapatnam andhra prdesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+