Search
  • Follow NativePlanet
Share
» »గ్వాలియర్‌లోని జై విలాస్ రాయ‌ల్ ప్యాలెస్ విశేషాలు మీకోసం..?!

గ్వాలియర్‌లోని జై విలాస్ రాయ‌ల్ ప్యాలెస్ విశేషాలు మీకోసం..?!

భార‌త‌దేశాన్ని ఒక‌ప్ప‌డు మ‌హారాజులు పాలించేవారు. అప్ప‌డు కోటలు, రాజ్‌మ‌హాల్ ఉండేవి. ఇప్ప‌టికి వాటి ఆన‌వాళ్లు దేశంలో అలానే ఉన్నాయి. అప్ప‌ట్లో నిర్మించిన పురాత‌న క‌ట్టడాలు, రాజ‌కుటుంబీకుల మ‌హాళ్లు ఉన్నాయి. దేశంలోని రాజకుటుంబాల గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సింధియా రాజకుటుంబం. గ్వాలియర్‌లోని ఈ రాజకుటుంబానికి చెందిన రాణి తల్లి మాధవి రాజే సింధియా ఇటీవలే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న రాజమాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని జై విలాస్ ప్యాలెస్‌లో రాచరిక జీవితం గ‌డిపేవారు. ఈ మ‌హారాణి గడిపిన రాచ‌రిక జీవితం, ఆ ప్యాలెస్ వివ‌రాల‌ను ఇప్ప‌డు తెలుసుకుందాం.

జై విలాస్ ప్యాలెస్‌లో మొత్తం 400 గదులు ఉన్నాయి. ఇక, ఈ ప్యాలెస్ విలువ అక్ష‌రాల రూ. 45000 కోట్లకు పైగా ఉంటుంది. రాజమాత మాధవి రాజే సింధియా రూ. 45,000 కోట్ల విలువైన రాయల్ ప్యాలెస్‌లో నివసించారు. సింధియా రాజకుటుంబానికి రాజమాత అయిన మాధవి రాజే ఇటీవ‌లే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇటీవల ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. 1966వ సంవత్సరంలో గ్వాలియర్ రాజకుటుంబానికి కోడలిగా వచ్చిన మాధవి రాజే సింధియా గ‌త కొన్నిరోజులుగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌తో బాధ‌ప‌డింది.

అప్ప‌ట్లో రాజ‌కీయాల్లో ఉండే రాజ‌మాత గ‌త‌కొంత‌కాలంగా ఇటు రాజ‌కీయాల‌కు, అటు గ్లామ‌ర్‌కు దూర‌మ‌య్యారు. రాజమాత గ్వాలియర్‌లోని జై విలాస్ ప్యాలెస్‌లో రాచరిక జీవితాన్ని గడిపారు. నేడు ఈ ప్యాలెస్ విలువ రూ.45,000 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

jaivilasroyalpalace

ప్యాలెస్ చ‌రిత్ర‌..

జై విలాస్ ప్యాలెస్‌ను 1874లో గ్వాలియర్ రాచరిక రాష్ట్రానికి చెందిన మహారాజ్ జివాజీ రావు సింధియా నిర్మించడం జ‌రిగింది. ఈ ప్యాలెస్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. దీనిని ఫ్రెంచ్ వాస్తుశిల్పి రూపొందించారు. విలాస్ ప్యాలెస్ మొత్తం మూడు అంతస్తులు ఉంటుంది. దీని మొదటి అంతస్తు టాస్కిన్ శైలిలో నిర్మించబడింది.

అదే సమయంలో, రెండవ అంతస్తు డోరిక్ శైలిలో నిర్మించ‌గా, మూడవ అంతస్తు కొరింథియన్ శైలిలో రూపొందించబడింది. 150 ఏళ్ల నాటి ఈ జై విలాస్ ప్యాలెస్‌లో పర్షియన్, ఇటాలియన్ పాలరాయిని ఉపయోగించడం జ‌రిగింది. వీటితోపాటు ఇక్క‌డ ఏర్పాటు చేసిన తలుపులపై బంగారు గిల్ట్‌లు కూడా ఉంటాయి. ఈ ప్యాలెస్‌ను నిర్మించేందుకు సుమారు పన్నెండు సంవత్సరాలు పట్టింది.

jaivilasroyalpalace

41 గ్యాల‌రీలు క‌లిగిన మ్యూజియం..

జై విలాస్ ప్యాలెస్ రెండవ అంతస్తులో నిర్మించిన హాలు అత్యంత సుందరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ అంత‌స్తును వజ్రం, బంగారం, వెండితో రూపొందించబడింది. అదే సమయంలో, ప్యాలెస్ లోపల ఒక అద్భుతమైన షాన్డిలియర్ కూడా ఉంది. దీని బరువు 3300 కిలోలు ఉంటుంది. దర్బార్ హాల్‌లో అతిథులకు ఆహారం అందించేందుకు ఒక వెండి రైలును కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ 100 మంది కంటే ఎక్కువ మంది కలిసి కూర్చుని భోజనం చేసే అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ ఇంకా సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

అందులో ముఖ్యుంగా సర్ మైఖేల్ సెంట్రల్ జైలు, మోతీ మహల్, కోర్టు వంటి అనేక ముఖ్యమైన గ్వాలియర్ ల్యాండ్‌మార్క్‌లను కూడా నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో ఒక మ్యూజియం కూడా ఉంటుంది. అందులో ప్రస్తుతం 41 గ్యాలరీలతో, ఈ మ్యూజియం 18వ శతాబ్దం నుండి 20వ శతాబ్దానికి చెందిన విభిన్న సేకరణలను ప్రదర్శిస్తోంది. ఇక‌, ఈ ప్యాలెస్‌లో ఆ కాలం నాటి అనేక వ‌స్తువులు భ‌ద్ర‌ప‌ర‌చ‌డం జ‌రిగింది. అందులో సింధియా సైన్యం ఉపయోగించే ఆయుధాలు, కవచాలు. అలంకార కళ, రోజ్‌వుడ్ ఫర్నిచర్, శిల్పం. భారతీయ, యూరోపియన్ మాస్టర్స్, లితోగ్రాఫ్‌లు, ప్రింట్లు, మాన్యుస్క్రిప్ట్‌ల అరుదైన పెయింటింగ్‌లు, ఆగ్నేయాసియా కళా సేకరణలు కూడా ఉన్నాయి.

More News

    Read more about: gwalior madhya pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+