Search
  • Follow NativePlanet
Share
» » కొత్త సంవత్సర ఆనందాలు - గోవా వేడుకలు !

కొత్త సంవత్సర ఆనందాలు - గోవా వేడుకలు !

యువతను ఉర్రూత లూగించే క్రిస్టమస్ మరియు న్యూ ఇయర్ ల పండుగలు వచ్చేసాయి. ఇక పార్టీలే పార్టీలు. యువతకు ఈ రెండు పండుగల పార్టీలు సంవత్సరం అంతా గుర్తు వుండి పోయేలా చేస్తాయి. ఇక గోవా లాంటి ప్రదేశంలోకి వెళితే, రెట్టింపు ఆనందాలు. నిద్ర రాని రాత్రులు, మందు బాబులకు కిక్కులు, కుటుంబ సభ్యులకు సంతోషాలు, స్నేహితులతో అడ్వెంచర్ లు అన్నీ కలసి గోవా ఒక స్వర్గంలా అనిపిస్తుంది. గోవా ప్రదేశం చిన్నదైనప్పటికి, పర్యాటక పరంగా అధిక ఆనందాలు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దులలో కల గోవా ఒకప్పుడు పోర్చుగీస్ దేశీయులు పాలించారు. ఆ కారణంగా నేటికీ గోవా లో పోర్చుగీస్ మరియు లాటిన్ దేశ ప్రజల జీవన శైలి కనపడుతుంది. ఇక్కడ కల గొప్ప చర్చి లు గోవా ను ఒక మత పర పర్యాటక ప్రాంతంగా కూడా చేసాయి. ఈ చర్చి లు సుమారు అయిదు వందల ఏళ్ల నాటివి అయినప్పటికీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. బాసిలికా అఫ్ బం జీసస్ లో సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ అస్థికలు వున్నాయి. అంతేకాదు, ఇది యునెస్కో సంస్థ చే వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినది. ఇది పురాతన గోవా లో కలదు.

Dey.sandip

ఎపుడూ బీచ్ లు, వాటర్ స్పోర్ట్స్, పార్టీలు మాత్రమే గోవా లో ...అనుకుంటున్నారా ? ఈ సారి బర్డ్ వాచింగ్, డాల్ఫిన్ విహారాలు, క్రొకోడైల్ వాచింగ్ వంటివి చేయండి. ఇంకా మ్యూజియం లు, ఫోర్ట్ లు, టెంపుల్స్ వంటివి కూడా ఎన్నో కలవు. వీటిలో కూడా నూతన సంవత్సర హంగామా కనపడుతుంది.

గోవా లో కేసినో ఫేమస్. అలవాటు కలవారికి గొప్ప టైం పాస్. వన్య జీవుల నివాసాల నుండి షాపింగ్ మార్కెట్ ల వరకూ మీకు ఆనందాలను ఇచ్చేవే. సుమారు 1960 ల లో గోవా లో హిప్పీ లు అడుగు పెట్టినప్పటి నుండి అది ప్రపంచం వెలుగులోకి వచ్చి ఆనందాలకు నిలయం అయ్యింది. బంగారు రంగు ఇసుక తిన్నెలు , ప్రశాంత బీచ్ లు తో యోగా గురువులకు, విదేశీయులకు గోవా ఒక స్వంత ఇల్లు లా తయారైంది. అప్పటి నుండి ఇక్కడ టూరిజం పరిశ్రమ ప్రధానంగా అభివృద్ధి చెందింది. విదేశీయులకు ఇండియా లో గోవా ప్రధాన పర్యాటక ప్రదేశం అయ్యింది.

Nilesh Thakur

గోవా లో ప్రధానంగా బీచ్ లు ఒక ఆకర్షణ. ఈ వింటర్ లో బాగా బీచ్ కు వెళ్ళండి. అన్నిటి కంటే అది అనుకూలం. మంచి హోటళ్ళు, బీచ్ గుడిసెలు, కేఫ్ లు, కరాకే రాత్రులు, వంటి వాటితో గోవా ఆనందాలు అందిస్తుంది. వింటర్ వచ్చిందంటే చాలు, క్రిస్టమస్, న్యూ ఇయర్ హడావుడి తో బీచ్ వెలిగి పోతూ వుంటుంది. మీరు కన్దోలిం లేదా పాన్జిం బీచ్ లలో ఉన్నప్పటికీ బాగా బీచ్ కు తేలికగా చేరవచ్చు. పారా సెయిలింగ్, వాటర్ బైక్ రైడ్, బనానా రైడ్, బోటింగ్ లకు బాగా ప్రసిద్ధి. ఈ క్రీడలతో కొత్త సంవత్సరం మరోసారి ఆనందించండి. లేదా గోవన్ మ్యూజిక్ ల తో పాటలు పాడండి, డాన్స్ లు చేయండి, మందు కొట్టండి, స్నేహితులతో ఆనందిన్చేయండి. గోవా లో పర్యావరణ టూరిజం కూడా ఒక ప్రత్యేకత. ప్రకృతితో కొద్ది సేపు ఆనందించటం కంటే మరి ఏమి ఆనందాన్ని ఇస్తుంది ? గోవా ప్రకృతి మనకు ఇచ్చిన వరంగా భావించండి. ఇక్కడ కల సుగంధ ద్రవ్యాల తోటల మధ్య నడవండి. ఇప్పటి వరకూ చూడని ప్రదేశాలు, చూడండి, ఆనందం అనుభవించండి.

వావ్...న్యూ ఇయర్ వచ్చేసింది !

గోవా వెళ్ళినపుడు, అక్కడ కల గోవా ఆనందాలు అనుభవించక పోతే, మజా వుండదు. వెచ్చని సూర్య రశ్మి ఆనందం పొందండి. బీచ్ లలో ఆనందంగా రిలాక్స్ అవండి. ఆలస్యం చేయక, గోవా కు ముందస్తుగా ట్రావెల్ ఏర్పాట్లు చేసుకోండి. లేదంటే, ప్రయాణం కష్టతరం అవుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+