విశాఖ నగర పర్యాటకంలో భీమిలి పేరు చెప్పకపోతే అది అసంపూర్తిగా ముగిసినట్లే అవుతుంది. తీరప్రాంత పట్టణమైన భీమిలి ఇటీవల కాలంలో పర్యాటక ప్రదేశంగా సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖ నగరంతో పోల్చుకుంటే.. ఇక్కడి నిశ్శబ్ద వాతావరణం, తక్కువ జనాభా కలిగిన ఇక్కడి సుందరమైన బీచ్ సరికొత్త అనుభూతులను చేరువ చేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో భీమిలి ప్రకృతి అందాలతోపాటు ఇక్కడ లభిస్తోన్న రుచికరమైన ఆహారం మరింత ప్రాచుర్యం పొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న కొన్ని రెస్టారెంట్‌లు మనసారా ఫుడ్‌ను ఆస్వాదించేందుకు భీమిలిలో ఇలాంటి ప్రదేశాలకు కొదవేలేదు అనేంతలా పేరు సంపాదించాయి. కొన్ని బీచ్‌కి సమీపంలోనే ఉండటంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక ఆలస్యం చేయకుండా, భీమిలిలోని ఉత్తమ రెస్టారెంట్లు.. అక్కడ లభించే రుచికరమైన ఆహార ఉత్పత్తులను పలకరిద్దామా..
రీబూట్ రెస్టారెంట్..
భీమిలి పర్యటనలో తప్పక అడుగుపెట్టాల్సిన రెస్టారెంట్లలో ఒకటి రీబూట్ రెస్టారెంట్. ఇది బీచ్‌కి ఆనుకుని ఉన్నందున, ఇక్కడ తినడం ఎంతో మానసిక ప్రశాంతతను చేరువచేస్తుంది. అంతేకాదు, ప్రత్యేకమైన అవుట్‌డోర్ సీటింగ్ ఏరియా చెక్క బెంచీలతో గుడిసె లాంటి పైకప్పులతో విశాలంగా ఏర్పాటు చేయబడింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బృందంగా కూర్చొని మాట్లాడుకునేందుకు ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్పొచ్చు. రీబూట్ రెస్టారెంట్ చికెన్, ఫిష్ స్టార్టర్‌లకు ఫేమస్ అనే చెప్పాలి. అలాగని, ఇక్కడి మెను అక్కడితో ఆగిపోదండోయ్. మీరు కాంటినెంటల్, చైనీస్ లేదా ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే అన్ని ఎంపికలూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

మార్లిన్ కే రెస్టారెంట్
సరదాగా విశాఖపట్నం నుండి భీమిలికి రాత్రిపూట డ్రైవ్ చేస్తే మిరుమెట్లుగొలిపే లైటింగ్‌తో భీమిలిలో మీకు ఆహ్వానం పలికే నీలి రంగు భవనమే మార్లిన్ కే రెస్తారెంట్. భారీ గాజు కిటికీలతో, ఎంతో ఆకర్షవంతంగా తీర్చిదిద్దబడిన ఈ భవనం ఎవ్వరైనా తన ప్రేమలో పడేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ప్రదేశం సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. బహిరంగంగా వీక్షించేలా ఉండడం మరో అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. తీరప్రాంతపు రుచులను ఆరగించాలని కోరిక ఉన్నవారికి మార్లిన్ కే రెస్టారెంట్ సరైన ఎంపిక అనే చెప్పాలి. ఈ రెస్టారెంట్‌లో సముద్రం నుండి తాజాగా సేకరించే రుచుకరమైన చేపలు, రొయ్యలు, పీతలతో అందించే ఉత్పత్తుల గురించి మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.
క్యాపిటల్ చికెన్
మీరు మంచి ఆహారప్రియులు అయ్యుండి.. అన్నీ తినగలిగే బఫేని ఆస్వాదించాలని ఆశపడితే వెంటనే క్యాపిటల్ చికెన్ రెస్టారెంట్‌కు వెళ్లండి. ఈ రెస్టారెంట్ అనేక రకాల నోరూరించే వంటకాలను అందిస్తుంది. అయితే ఇక్కడి బిర్యానీ, నాన్‌వెజ్ స్టార్టర్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. భీమిలి పట్టణం మధ్యలో చక్కటి భోజనాల రెస్టారెంట్ అంటే దీనిపేరునే చెబుతారు మరి.

ది స్క్వేర్
బీచ్ పక్కనే ఉన్న మరో పేరొందిన రెస్టారెంట్ ది స్క్వేర్! భీమిలి రిసార్ట్‌లోని రెండు డైన్-ఇన్ రెస్టారెంట్‌లలో ది స్క్వేర్ ఒకటి. ఇది ఖచ్చితంగా భీమిలిలో అత్యుత్తమ బఫే స్ప్రెడ్‌లలో ఒకదానిని అందిస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ అందించే ఆహారాన్ని ఇంట్లో పండించే సేంద్రీయ కూరగాయలతో తయారు చేస్తారు! ప్రతిరోజూ విభిన్న మెనూతో, సందర్శకులకు భారతీయ, చైనీస్, కాంటినెంటల్ వంటకాలలో శాఖాహారం మరియు మాంసాహారం ఎంపికలు రెండింటినీ అందిస్తారు.

మణికంఠ ఫుడ్ కోర్ట్
విశాఖ నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో.. భీమిలి-తగరపువలస రోడ్డులో ఉన్న మణికంఠ ఫుడ్ కోర్ట్ ఆహారప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడి రుచుకరమైన ఆహారపదార్థాలు రెండు పట్టణాల నుండి స్థానికులను ఆకర్షిస్తోంది. మీరు స్థానిక రోడ్ సైడ్ ఫుడ్‌ను ఆస్వాదించాలనుకున్నా మణికంఠ ఫుడ్ కోర్టు మీ కోరికను నెరవేరుస్తుంది. ఈ ఫుడ్ కోర్ట్‌లో చాట్‌లు, పావ్ భాజీలు, స్వీట్ బోబాట్‌లతోపాటు మరెన్నో వంటకాలు అందించే వివిధ రకాల స్టాల్స్ ఉన్నాయి. రెస్టారెంట్ యొక్క మొదటి అంతస్తులో వివిధ రకాల డెజర్ట్‌లు మరియు స్నాక్స్‌తో కూడిన బేకరీ ఉంటుంది. తందూరీ స్టార్టర్స్, బిరియానీల నుండి పిజ్జాలు మరియు బర్గర్‌ల వరకు మీ అభిరుచులకు అనుగుణంగా అనేక ఆహార ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి.



Click it and Unblock the Notifications












