Search
  • Follow NativePlanet
Share
» » బ్యాక్‌వాట‌ర్స్‌పై బోట్ హౌస్‌లో విహారానికి కుమ‌ర‌కోమ్ వెళ్లండి

బ్యాక్‌వాట‌ర్స్‌పై బోట్ హౌస్‌లో విహారానికి కుమ‌ర‌కోమ్ వెళ్లండి

బ్యాక్‌వాట‌ర్స్‌పై బోట్ హౌస్‌లో విహారానికి కుమ‌ర‌కోమ్ వెళ్లండి

కేరళలోని కొట్టాయం నుండి 14 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న కుమరకోమ్ ప్రపంచవ్యాప్తంగా బ్యాక్ వాటర్స్‌ క్రూయిజ్‌లకు పర్యాయపదంగా చెప్పొచ్చు. వెంబనాడ్ సరస్సు చుట్టూ ఉన్న సుందరమైన ద్వీపాల సమూహం ఈ ప్ర‌దేశం. బ్యాక్‌వాట‌ర్స్‌ విహారానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా కుమరకోమ్ గుర్తింపు పొందింది. ఇది కొచ్చి (కొచ్చిన్) నుండి 70 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. కుమరకోమ్ కేరళలోని రైస్‌బౌల్‌గా పేరొందిన‌ కుట్టనాడ్ ప్రాంతంలో ఒక భాగం. దీని చుట్టూ కాలువలు మరియు సరస్సుతో విస్తార‌మైన‌ వరి పొలాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఈ ప‌ర్య‌ట‌న‌లో సాంప్ర‌దాయ గ్రామాలు, స్మార‌క చిహ్నాలు, మ‌త్స్య‌కార గ్రామాలు, గుంపులుగా పెరిగిన కొబ్బ‌రిచెట్ల అందాల‌ను చూసే అవ‌కాశం దొరుకుతుంది.

నిజానికి, బోట్ హౌస్‌లలో బస చేయకుండా ఈ బ్యాక్ వాటర్స్‌ స్వ‌ర్గ‌ధామం సందర్శన పూర్తి కాదనే చెప్పాలి. విస్తార‌మైన స‌ర‌స్సుగుండా విహ‌రిస్తూ.. ప్ర‌కృతి అందాల‌ను వీక్షించాల‌నుకునేవారు కుమ‌ర‌కోమ్ ప‌ర్యాట‌న‌తో త‌మ కోరిక‌ను తీర్చుకోవ‌చ్చు. బోట్ హౌస్‌లలో సింగిల్, డబుల్ లేదా ట్రిపుల్ బెడ్‌రూమ్‌లు ఉంటాయి. కొన్ని ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను కూడా అమర్చబడి ఉంటాయి. బోట్ హౌస్‌లో ఒక రాత్రి విడిది చేసేందుకు మార్చి నుండి అక్టోబర్ వరకు రూ. 7,000 నుండి రూ. 15,000 మరియు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు రూ. 8,000 మరియు 17,000 మధ్య ధ‌ర ఉంటుంది. విలాస‌వంత‌మైన స‌మ‌యాన్ని గ‌డిపేందుకు అదే త‌ర‌హాలో డ‌బ్బును ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

kumarakombackwater

మాంసాహారుల స్వర్గధామం

వెంబనాడ్ సరస్సు ఒడ్డున ఉన్న కుమరకోమ్ మాంసాహారుల స్వర్గధామం. రొయ్యలు, పీతలు, చేప‌లు తాజాగా పట్టుకుని, వేడివేడిగా వ‌డ్డిస్తారు. ఇక్క‌డ‌ అప్పాలు లేదా పొరోటాలతో స‌ముద్ర‌పు రుచుల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. కరీమీన్ కూరను ప్రయత్నించడం అస్స‌లు మర్చిపోవద్దు. కుమరకోమ్ బడ్జెట్, మధ్య-శ్రేణి మరియు లగ్జరీ హోటళ్లను కూడా అందిస్తుంది. రిసార్ట్‌లు మరియు హోమ్‌స్టేలు కూడా ఇక్క‌డ‌ అందుబాటులో ఉన్నాయి. అనేక హోటళ్ళు మరియు రిసార్ట్‌లు కూడా తమ స్వంత బోట్ హౌస్‌లను కలిగి ఉన్నాయి. ఇక్క‌డి ఆహ్లాద‌క‌ర‌మైన ప‌రిస‌రాల‌ను ప‌రిచ‌యం చేసేందుకు స్థానిక గైడ్‌లు నిత్యం అందుబాటులో ఉంటారు.

kumarakombackwater

ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం

కుమరకోమ్ ప‌ర్య‌ట‌న‌లో కుమరకోమ్ పక్షుల అభయారణ్యం, అరువిక్కుజి వాటర్‌ఫాల్, బే ఐలాండ్ డ్రిఫ్ట్‌వుడ్ మ్యూజియంల‌ను సంద‌ర్శించ‌డం అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. ఐదు స్టెప్‌ల‌పై జాలువారే అరువిక్కుజి జలపాతాలు కుటుంబ‌స‌మేతంగా గ‌డిపేందుకు ఉత్త‌మ‌మైన‌ ఒక అందమైన పిక్నిక్ స్పాట్. రబ్బరు తోటల మధ్యలో ఉన్న ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటుంది. సుమారు వంద అడుగుల ఎత్తునుంచి గ‌ల‌గ‌లా ప్ర‌వ‌హించే నీటి ధార‌ల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి.

ఇక్క‌డి పర్వతాలపై నుండి ప్రకృతి దృశ్యం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వాన్ని చేరువ‌చేస్తుంది. సెయింట్ మేరీ చర్చి ఇక్క‌డి జలపాతం పైభాగంలో ఉంది. బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం కుమరకోమ్ గ్రామంలోనే ఉంది. అరుదైన, సృజనాత్మక ఆధునిక కళారూపం ద్వారా తయారు చేయబడిన నాణ్యత కలిగిన డ్రిఫ్ట్ వుడ్ శిల్పాల ప్రత్యేకమైన సేకరణను ఇక్క‌డ చూడొచ్చు. ఇది వివిధ ఆకారాలు, నమూనాల భారీ సేకరణ ఉంటుంది.

More News

    Read more about: kumarakom kumarakom backwater
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+