Search
  • Follow NativePlanet
Share
» »గోవా - సుందర కోస్తా తీరం !

గోవా - సుందర కోస్తా తీరం !

గోవా పట్టణన్ని పరిశీలిస్తే, ముందుగా ప్రతి ఒక్కరూ గమనించేది ఈ ప్రదేశం పోర్చుగీసు జీవన విధానంతో ప్రధానంగా ప్రభావించబడిందని గుర్తిస్తారు. దీనికి కారణం పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని సుమారుగా అరవైల వరకు పాలించారు. ఇంతేకాక, గోవా ప్రజలు వారి సాంప్రదాయ వారసత్వానికి గర్వపడతారు. వారికిగల వారసత్వ భవనాలు, ఇతర మానవ నిర్మిత కట్టడాలు, సహజ సిద్ధ చిహ్నాలను పరిరక్షించుకుంటారు. ఈ పట్టణం ప్రపంచంలోని వివిధ దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. బీచ్ ప్రదేశాలు కల బ్యాంకాక్, ఇబిజ వంటి పట్టణాలతో పోలిస్తే, గోవా అధిక పర్యాటకులను ఆకర్షిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ లో బీర్ !

బ్రేక్ ఫాస్ట్ లో బీర్ !

గోవాలో ఒక రోజు ఆనందంగా ఎలా గడపాలి? మొదటగా, మీరు ఉదయం వేళ రుచికరమైన అక్కడి సాంప్రదాయ మెడిటర్రేనియన్ లేదా కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ అక్కడి హోటళ్ళలో ఆరగించేయాలి. హోటళ్ళు సాధారణంగా ఉత్తర గోవా లేదా పాంజిం లలోని కండోలిం రోడ్లపై కనపడుతూనే ఉంటాయి. గోవాలో ప్రత్యేకత ఏమంటే? ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే ఒక బీర్ బాటిల్ సైతం పుచ్చుకోవడమనేది సర్వ సాధారణం. కండోలిం వీధులను కాలినడకన లేదా ఒక ద్విచక్రవాహనం అద్దెకు తీసుకోవడం ద్వారా చూడవచ్చు. ద్విచక్రవాహనం రోజుకు రూ.250 మించి సాధారణంగా ఉండదు.

చవక ధరలలో షాపింగ్

చవక ధరలలో షాపింగ్

మీరు బ్రేక్ ఫాస్ట్ ప్రదేశం చేరేముందే అతి చవక ధరలలో కొంత షాపింగ్ కూడా చేయవచ్చు. టి- షర్టులు, సన్ గ్లాసులు, రిఫ్రిజిరేటర్ మాగ్నెట్ లు, వంటివి కొనుగోలు చేయవచ్చు. ఇవి సాధారణంగా కండోలిం లేదా అంజునా ప్రదేశాలలో దొరుకుతాయి. శనివారాలు సెకండ్ హ్యాం డ్ వస్తువుల మార్కెట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సెలవు దినం అయిందంటే చాలు బీచ్ కు జనాలు అధికంగా వచ్చేస్తారు. కండోలిం ప్రాంతంలోనే మూడు ప్రధాన బీచ్ లు ఉన్నాయి. అవి కండోలిం బీచ్, కాలాగుటే బీచ్ మరియు బాగా బీచ్ లు. వీటిలో బాగా బీచ్ బాగా మెయిన్టెయిన్ చేస్తారు.

వాటర్ స్పోర్ట్స్

వాటర్ స్పోర్ట్స్

అన్ని బీచ్ లలోను వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. వీటిని కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కైస్, బనానా రైడ్, పారా సైలింగ్ వంటివి ఎంచుకోవచ్చు.

 సీఫుడ్ తో బాటుగా బీర్

సీఫుడ్ తో బాటుగా బీర్

బీచ్ లో కల గుడిసెలలో లభించే అచ్చమైన గోవా సీఫుడ్ తో బాటుగా బీర్ పుచ్చుకోవడం మరచిపోకండి. ఈ మూడు ప్రధాన బీచ్ లనుండి కొద్ది దూరంలోనే అంజునా బీచ్ ఉంటుంది. అంజునా బీచ్ ఎంతో ప్రశాంతంగా ఉండి, ఒక పుస్తకం చదువుకోవాలన్నా లేక మీ ఇ మెయిల్స్ చెక్ చేసుకోవాలన్నా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడి విశిష్టత...నిశ్శబ్దం మరియు ప్రశాంతత.

 అతి ప్రశాంతమైన బీచ్

అతి ప్రశాంతమైన బీచ్

ఇక్కడ ప్రసిద్ధి గాంచిన చర్చిలు మరియు అతి ప్రశాంతమైన బీచ్ లు ఉన్నాయి. గోవాలో ఎంతో పేరు మోసిన కోల్వా బీచ్ దక్షిణ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఎంతో ఖరీదైన హోటళ్ళు ఉండటంచే క్రమశిక్షణ ఆచరించేవారికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది.

పార్టీ ప్రియులకు స్వర్గం

పార్టీ ప్రియులకు స్వర్గం

ఇక సాయంత్రం అయిందంటే చాలు, గోవా పట్టణం పార్టీ ప్రియులకు స్వర్గమే. ఈ పార్టీలు తెల్లవారి 3 గంటల వరకు జరుగుతాయి నైట్ క్లబ్ యజమానులు, పబ్ యజమానులు ఉదయం వరకు సంగీతాన్ని మోగిస్తూనే ఉంటారు. అయితే, సరైన రవాణా సదుపాయం ఏదీ లేకుండా గోవాలో రాత్రి పొద్దు పోయేటంత వరకు కొనసాగటం రిస్కుతో కూడినదే. మీకు క్యాబ్ దొరకటం కష్టం కావచ్చు. ఉత్తర గోవాలో కేఫే టిటోస్ మరియు మాంబోస్ అనేవి రెండు ప్రఖ్యాత నైట్ క్లబ్బులు. ఇవి కాలాగుటే బీచ్ కు దగ్గరగా ఉంటాయి.


More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+