తిరుపతి పేరు వింటే ఆధ్యాత్మికత గుర్తుకొస్తుంది. అయితే, ప్రకృతి ప్రేమికులకు తిరుపతి ఓ విడిది కేంద్రమని చాలామందికి తెలియదు. ఇక్కడ చూసేందుకు విభిన్నమైన సందర్శనీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే, ప్రకృతి ఒడిలో ప్రశాంతతను చేరువ చేసే ఇక్కడి అందాలు మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. మరెందుకు ఆలస్యం తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను చూసేద్దామా?!

కపిల తీర్థం
మీరు తిరుపతిలో అడుగుపెడితే తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం కపిల తీర్థం. ఇది ఇక్కడి ప్రసిద్ధ పవిత్ర స్థలంగానే కాకుండా శివునికి అంకితం చేయబడిన ఆలయం సమీపంలోకి ప్రవహించే జలపాతపు అద్భుతాన్ని పర్యాటకులకు చూపుతుంది. ఇక్కడకు చేరుకునేందుకు బస్సు, జీప్ లేదా ప్రీపెయిడ్ టాక్సీ ద్వారా తిరుపతి నుండి 22 కి.మీ దూరంలో ఉన్న తిరుమలకు (బాలాజీ దేవస్థానం) చేరుకోవాలి. సెంట్రల్ బస్టాండ్‌కి (రైల్వే స్టేషన్ నుండి ఒక కి.మీ) వెళ్ళడానికి ఆటోను అందుబాటులో ఉంటాయి.
జింకల పార్క్
జంతు ప్రేమికులను అలరించే జింకల పార్క్ తిరుపతి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. తిరుమల కొండల పాదాల చెంత ఉన్న ఈ పార్క్ పెద్ద సంఖ్యలో జింకలు, నెమళ్లు మరియు ఇతర జంతువులకు నిలయంగా ఉంది. సందర్శకులు ఈ పార్క్ గుండా షికారు చేయవచ్చు. అలాగే, జంతువులకు ఆహారం ఇస్తూ.. సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. పార్క్‌లో ప్లేగ్రౌండ్‌తోపాటు కొన్ని చిన్న దుకాణాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఎంటంటే, ఈ పార్క్‌కు సిటీ సెంటర్ నుండి కేవలం 15 నిమిషాలలో చేరుకోవచ్చు. అందుకోసం నిత్యం టాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
ఆకాశగంగ తీర్థం
తిరుపతికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆకాశగంగ తీర్థం ప్రదేశం ప్రకృతిని ప్రేమించే వారు తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక్కడి సుందరమైన.. ప్రశాంతమైన పరిసరాలు విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడి పవిత్ర ఆకాశగంగ నదిలో హాయిగా స్నానం చేసే అవకాశం కూడా ఉంది.

శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్
తిరుపతిలోని వృక్ష, జంతుజాలం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడి జాతీయ ఉద్యానవనాన్ని తప్పక సందర్శించాలి. ఈ జాతీయ ఉద్యానవనం రెడ్ సాండర్స్, షోరియా తుంబుర్గియా, చందనం వంటి అరుదైన మొక్కలకు నిలయమనే చెప్పాలి. ఇక్కడి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించాలంటే మాత్రం మీ టూర్‌లో తప్పనిసరిగా బైనాక్యులర్‌లను తీసుకెళ్లాల్సిందే. దాని సహాయంతో ఇక్కడ దాదాపు 178 రకాల పక్షులను గుర్తించవచ్చు. జంతుజాలం పరంగా చూస్తే ఈ జాతీయ ఉద్యానవనం చిరుతపులులు, పురాతన ఏనుగులు, ఎలుగుబంట్లు, మచ్చల జింకలకు ప్రసిద్ధి చెందింది.
శిలాతోరణం
శిఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న రాతితో ఏర్పాడిన అద్భుత అమరికే శిలాతోరణం. ఇది విశిష్టమైన శిల్పకళకు ప్రసిద్ధిగాంచింది. ఈ నిర్మాణశైలిని ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాలనుంచి సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ శిలాతోరణం చరిత్ర ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రాంతం తిరుపతితోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. శిలాతోరణం చాళుక్య రాజు II పులకేశినిచే నిర్మించబడిందని చెబుతారు.



Click it and Unblock the Notifications













