Search
  • Follow NativePlanet
Share
» »ఉత్త‌రాంధ్ర వాసుల‌కు శుభ‌వార్త‌.. త‌క్కువ ధ‌ర‌తో ఐఆర్‌సిటిసి వారి స్పెష‌ల్‌ టూర్ ప్యాకేజీ..

ఉత్త‌రాంధ్ర వాసుల‌కు శుభ‌వార్త‌.. త‌క్కువ ధ‌ర‌తో ఐఆర్‌సిటిసి వారి స్పెష‌ల్‌ టూర్ ప్యాకేజీ..

ఉత్త‌రాంధ్ర‌లో వీక్షించేందుకు ఎన్నో పుణ్య‌క్షేత్రాలు, ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. వాట‌న్నింటీని ఈ వీకెండ్‌లో క‌వ‌ర్ చేసుకోవాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొత్తం రెండు రోజుల ప‌ర్య‌ట‌న ఉంటుంది. ఇందులో శ్రీకాకుళంలో ప్ర‌సిద్ధిచెందిన అరసవల్లి సూర్యదేవాలయంతో పాటు వైజాగ్‌లోని సింహాచలం ఆలయాల‌ను కూడా క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. రూ.5,420 ప్రారంభ ధరతో వైజాగ్ నుంచి ఈ ప్ర‌యాణం ప్ర‌తిరోజూ అందుబాటులో ఉంటుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్దిచెందిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ల‌లో వైజాగ్ ఒకటి. ఉత్తరాంధ్రలో భాగమైన వైజాగ్‌లో ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు, ప్ర‌కృతి అందాల‌తో నిండిన ప్రాంతాలు, బీచ్‌లు పేరుగాంచిన‌వి. ఇక్క‌డికొచ్చిన‌వారు త‌ప్ప‌కుండా వీట‌న్నింటిని సంద‌ర్శిస్తారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయం ప్రముఖ పుణ్య‌క్షేత్రాల‌లో ఒకటి. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు కిలోమీట‌రు దూరంలో ఉంటుంది. ఈ పుణ్య‌క్షేత్రం భారతదేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఆలయం ఏడ‌వ‌ శతాబ్దం నాటిది.

టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు..

ఒక్కో వ్యక్తి ధర(1-3 వ్యక్తుల‌యితే)

క్లాస్ కంఫర్ట్ సింగిల్ ఆక్యుపెన్సీ అయితే, రూ. రూ.13015 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే, రూ.7225 చెల్లించాలి. లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే, రూ.5300గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.4650 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్ రూ.3020గా నిర్ణ‌యించారు.

uttarandhra--irctcspecialtourpackage

ఒక్కో వ్యక్తి ధర (న‌లుగురి నుంచి ఆరుగురు వ్యక్తులకు)

కంఫర్ట్ క్లాస్ డబుల్ ఆక్యుపెన్సీ రూ.5865 చెల్లించాలి. అదే ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే, రూ. 5420 ఉంటుంది. చైల్డ్ విత్ బెడ్ రూ.4775 గా నిర్ణ‌యించారు. అదే చైల్డ్ వితవుట్ బెడ్ అయితే, రూ.3540 చెల్లించాల్సి ఉంటుంది.

రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే...

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ షెడ్యూల్‌లో భాగంగా మొద‌టిరోజు వైజాగ్ రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుంచి పర్యాటకులను పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. అనంత‌రం హోటల్ లో చెక్ ఇన్ అయ్యాక టిఫిన్‌ చేస్తారు. ఉదయం 08:00 గంటలకు హోటల్ నుంచి శ్రీకాకుళం రోడ్డు మార్గంలో అరసవల్లికి ప్రయాణం ఉంటుంది. ఆతర్వాత ఉద‌యం 11:00 గంటలకు అరసవల్లి సూర్య‌దేవాల‌య సందర్శ‌న ఉంటుంది. 11:00 నుంచి 12:30 గంటల వరకు అరసవల్లి ఆలయంలో సూర్యనారాయణ స్వామి దర్శ‌నం ఆత‌ర్వాత మ‌ధ్యాహ్నం సమీపంలోని రెస్టారెంట్ భోజనం చేస్తారు.

1:30 నుంచి 2:00 వరకు శ్రీ‌కాక‌ళుంలోని శ్రీకూర్మం ప్రయాణం ఉంటుంది. కూర్మనాథ స్వామి దర్శనం అనంత‌రం శ్రీకూర్మం నుంచి శ్రీముఖలింగానికి ప్ర‌యాణం ఉంటుంది. ఆ త‌ర్వాత సాయంత్రం శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాత్రి 8:30 స‌మ‌యంలో శ్రీముఖలింగం నుంచి వైజాగ్‌లోని హోటల్‌కి తిరుగు ప్రయాణం ఉంటుంది. హోటల్‌లో డిన్నర్ చేశాక‌, నైట్ స్టేయింగ్ ఉంటుంది.
మ‌రుస‌టి రోజు ఉదయం 8:00 గంటలకు హోటల్‌లో టిఫిన్ చేసి చెక్-అవుట్ అవుతారు.

అనంత‌రం రోడ్డు మార్గంలో విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం సంద‌ర్శ‌న ఉంటుంది. ఉద‌యం 09:00 నుంచి 11:00 వరకు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శ‌నం ఉంటుంది. ఆ త‌ర్వాత ఉద‌యం 11:00 నుంచి 11:40 వరకు సింహాచలం నుంచి కైలాసగిరి కొండలకు ప్ర‌యాణం ఉటుంది.

కైలాసగిరి హిల్స్ సందర్శన అనంత‌రం మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తారు. అనంత‌రం స‌మీపంలోని ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, ఆర్.కె. బీచ్ సందర్శన ఉంటుంది. సాయంత్రం 5:00గంట‌ల స‌మ‌యంలో ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. మ‌రెందుకాల‌స్యం మీరుకూడా ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంది. ఈ ప్యాకేజీ బుక్‌చేసుకోవాల‌నుకునేవారు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Read more about: irctc uttarandhra travel guide
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+