Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ‌వారి భక్తులకు శుభ‌వార్త‌.. ఐఆర్‌సిటిసి తిరుమ‌ల టూర్ ప్యాకేజీ...

శ్రీ‌వారి భక్తులకు శుభ‌వార్త‌.. ఐఆర్‌సిటిసి తిరుమ‌ల టూర్ ప్యాకేజీ...

దేశంలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఒక‌టి. ఇక్క‌డ నిత్యం భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉంటుంది. సాధార‌ణ రోజుల్లో అత్యంత ర‌ద్దీగా ఉండే తిరుప‌తి. సెల‌వు రోజుల్లో భ‌క్తుల కోలాహాలంతో నిండిపోయి ఉంటుంది. వేస‌వి సెల‌వులు రాబోతున్నాయి. ఇలాంటి త‌రుణంలో చాలామంది చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌కు, హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళుతుంటారు. మ‌రికొంద‌రేమో ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటారు. అలాంటి వారికోసం ఐఆర్‌సిటిసి ఓ శుభవార్త‌ను అందించింది.

ఈ సమ్మర్​లో వేస‌వి టూర్ ప్లాన్ చేయాల‌నుకుంటున్నారా? మ‌రెందుకాల‌స్యం ఐఆర్‌సిటిసి వారి ఈ స‌రికొత్త ప్యాకేజీ గురించి తెలుసుకోవాల్సిందే. అతి త‌క్కువ ధర‌లో ఈ ప్ర‌యాణం సాగుతుంది. కేవ‌లం మూడురోజుల్లో తిరుమ‌ల దర్శ‌నం చేసుకోవ‌చ్చు. ఈ ప్యాకేజీలో భాగంగానే శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, విశ్రాంతి సదుపాయాలు లభిస్తాయి. తిరుప‌తి టూర్ ప్యాకేజీ వివ‌రాలు తెలుసుకుందాం.

srivaridevotees--irctctirumalatourpackage

విజయ్ గోవిందం పేరుతో ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ...

శ్రీ‌వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల స్వామివారి దర్శనం సులభతరం చేయడం కోసం, ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే, విశ్రాంతి సదుపాయాలతో పాటు, ప్రత్యేక దర్శన టికెట్లూ ఈ టూర్ ప్యాకేజీలో భ‌క్తుల‌కు ల‌భించ‌నున్నాయి. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC), కాకినాడ నుంచి తిరుపతికి 'విజయ్ గోవిందం' పేరుతో ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ టూర్ రెండు రాత్రులు, మూడు పగళ్లు కొన‌సాగుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలతో పాటు తిరుచానూరు ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ట్రైన్ ప్రతీ శుక్రవారం భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక‌, భ‌క్తులు సామర్లకోట, రాజమహేంద్రవరం, విజయవాడ, తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కే వెసులుబాటు ఉంటుంది.

మూడు రోజులు టూర్ వివ‌రాలు..

ఈ టూర్​లో భాగంగా మొదటిరోజు కాకినాడ టౌన్‌ నుంచి బయల్దేరే 17210 అనే నెంబ‌ర్‌గ‌ల శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రాత్రి 10:50 గంటలకు విజయవాడ రీచ్ అవుతుంది. రెండో రోజు ఉద‌యం 5:10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు వెళ్తారు. ఫ్రెషప్ అయ్యి టిఫిన్‌ చేసి తిరుమలకు బయల్దేరుతారు. స్పెషల్ దర్శనం టికెట్లతో శ్రీ‌వారిని దర్శ‌న భాగ్యం పొందుతారు.

srivaridevotees--irctctirumalatourpackage

అనంత‌రం అక్క‌డి నుండి తిరుచానూరుకు పయనమవుతారు. అక్కడ పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవ‌డం జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. 17487 అనే నెంబ‌ర్ గల తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అదే రోజు రాత్రి 10:30 గంటలకు తిరుగు పయనమవుతారు. మూడో రోజు ఆయా స్టేషన్లు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

కంఫర్ట్‌లో బెర్త్‌సింగిల్ షేరింగ్‌కు రూ.5,850 చెల్లించాలి. ట్విన్, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.4,720 చెల్లించాల్సి ఉంటుంది. అదే 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్‌, విత్ అవుట్ బెడ్‌కు రూ.3,810 చెల్లించాలి. స్టాండర్డ్‌లో(స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్​కు అయితే రూ.4,690 చెల్లించాలి. ట్విన్, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.3,560 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్‌, విత్ అవుట్ బెడ్‌కు రూ.2,650 కట్టాలి. ప్రవేశ రుసుములను భక్తులే చెల్లించుకోవాలి.

ఈ మూడు రోజుల టూర్‌లో భాగంగా ఒక రోజు బ్రేక్​ఫాస్ట్ మాత్రమే ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది. టూర్‌ గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. టూర్ ప్యాకేజీ బుక్ చేసేందుకు, ఇత‌ర స‌మాచారం కోసం భ‌క్తులు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో Vijay Govindam లింక్ పై క్లిక్ చేసి వివరాలన్నీంటిని నింపాల్సి ఉంటుంది.

More News

    Read more about: irctc tirumala tour package
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+