Search
  • Follow NativePlanet
Share
» »ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..వేస‌వి ప్ర‌త్యేక రైళ్లు ఆగే స్టేష‌న్‌లివే..!

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..వేస‌వి ప్ర‌త్యేక రైళ్లు ఆగే స్టేష‌న్‌లివే..!

విశాఖ వాసుల‌కు గుడ్‌న్యూస్‌. స‌మ్మ‌ర్ రద్దీ కార‌ణంగా స్పెష‌ల్ ట్రైన్ల‌ను నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

అయితే, ఈ వేస‌వి ప్ర‌త్యేక రైళ్లు విశాఖ నుంచే బ‌య‌లుదేరనున్నాయి. ఏప్రిల్ 27 నుంచి జూన్ 29 వ‌ర‌కు 08557 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖ టు చెన్నై ఎగ్మోర్ అనే ట్రైన్ ప్రతి శనివారం రాత్రి 7గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉదయం 8.45 గంటలకు ఎగ్మోర్ చేరుకుంటుంది. 08558 అనే నెంబ‌ర్‌గ‌ల చెన్నై ఎగ్మోర్ టు విశాఖ ట్రైన్ ఏప్రిల్ 28 నుంచి జూన్ 30 వ‌ర‌కు ప్ర‌తి ఆదివారం ఉద‌యం 10.30 గంటలకు ఎగ్మోర్‌లో బయలుదేరుతుంది.

అదేరోజు రాత్రి 10.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక‌, ఈ స్పెష‌ల్ ట్రైన్ విశాఖలో బయల్దేరి దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్‌లలో ఆగుతుందని వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

summerspecialtrainsstopatthestation1

08555 అనే నెంబ‌ర్ గ‌ల విశాఖ టు హతియా స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్‌ 28 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ఆ మ‌రుస‌టి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు హతియా చేరుకుంటుంది. హతియా-విశాఖ (08556) స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 29 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు హతియాలో బయలుదేరుతుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉదయం 9.50గంటలకు విశాఖ వస్తుంది. ఈస్పెష‌ల్ ట్రైన్ విశాఖలో బయల్దేరి విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్‌లలో ఆగుతుంది.

ప‌లు రైళ్లు ర‌ద్దు, మ‌ళ్లింపు..

విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల నిమిత్తం ప‌లు రైళ్లను ర‌ద్దు చేస్తున్నారు. అంతేకాదు ప‌లు రైళ్ల రాక‌పోక‌ల్లో మార్పులు చేస్తున్న‌ట్లు కూడా అధికారులు తెలిపారు. 17267 అనే నెంబ‌గ‌ర్ గ‌ల కాకినాడ పోర్టు- విశాఖపట్నం ట్రైన్, విశాఖపట్నం-కాకినాడ పోర్టు రైళ్లను ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే విజయవాడ డివిజన్‌ అధికారులు తెలిపారు.

ఈ ట్రైన్‌ కాకినాడ పోర్ట్‌లో బయల్దేరి, కాకినాడ టౌన్, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, దుర్గాడ గేట్, అన్నవరం, తుని, గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్, రేగుపాలెం, ఎలమంచిలి, నరసింగపల్లి, కసింకోట, అనకాపల్లి, దువ్వాడ, మర్రిపాలెం, విశాఖపట్నంలో ఆగుతుంది. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల నిమిత్తం ప‌లు రైళ్లు మ‌ళ్లిస్తున్న‌ట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 12756 అనే నెంబ‌ర్‌గ‌ల భావనగర్ టు కాకినాడ పోర్టు ట్రైన్ మే 4, 11, 18, 25 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

More News

    Read more about: visakhapatnam andhraprades
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+