Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. సమ్మర్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే...

తిరుపతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. సమ్మర్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే...

వేస‌వి సెల‌వులు రాబోతున్నాయి. మ‌రికొద్ది రోజుల్లో పిల్ల‌ల‌కు, ఉద్యోగుల‌కు స‌మ్మ‌ర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఇలాంటి త‌రుణంలో చాలామంది ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు కానీ, హిల్‌స్టేష‌న్లు కానీ సంద‌ర్శించాల‌నుకుంటారు. చాలామంది పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. అలాంటి వారికోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఓ ప్రత్యేక‌త ఉంది. ఇక్క‌డికి నిత్యం వేలాది సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ ఆలయానికి ప్ర‌ముఖులు, రాజ‌కీయ‌నాయ‌కులు, సెల‌బ్రిటీలు కూడా వ‌స్తుంటారు.

అయితే, స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో తిరుప‌తికి వెళ్లాలంటే చాలా రిస్క్‌. ఎందుకంటే, సెల‌వుల్లో ఎక్కువ‌మంది అటువైపే ప్ర‌యాణాలు చేస్తుంటారు. దీంతో ట్రైన్లు ఫుల్ అయిపోతాయి. అందుకే తిరుమ‌ల వెళ్లేవారికి ప్ర‌త్యేకంగా స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్ వేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆ ప్ర‌త్యేక ట్రైన్స్‌ను ప్ర‌కంటించింది రైల్వే. వాటి వివ‌రాల‌ను తెలుసుకుందాం.

tirupati--summertrains1

తిరుప‌తి టు మ‌చిలీప‌ట్నం స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్‌..

07121 అనే నెంబ‌ర్ గ‌ల ట్రైన్ తిరుపతి నుంచి మచిలీపట్నం రూట్‌లో ప్రతీ ఆదివారం ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 14, 21, 28, మే 5, 12, 19, 26 తేదీల్లో 7 సర్వీసుల్లోకి అందుబాటులో ఉంటుంది. ఇక, ఈ ప్ర‌త్యేక రైలు రాత్రి 10.20 గంటలకు తిరుపతిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

07122 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ మ‌చిలీపట్నం నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం ప్ర‌యాణికుల కోసం అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఏప్రిల్ 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో 7 సర్వీసులు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ సాయంత్రం 5.40 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

విశాఖపట్నం నుంచి తిరుపతికి స్పెష‌ల్ ట్రైన్‌..

తిరుపతి టు మచిలీపట్నం, మచిలీపట్నం టు తిరుపతి సమ్మర్ స్పెష‌ల్ ట్రైన్స్ దారిలో రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, పెడన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

tirupati--summertrains

ఇక విశాఖపట్నం నుంచి తిరుపతికి అందుబాటులో ఉన్న స్పెష‌ల్ ట్రైన్‌ను పొడిగించింది భారతీయ రైల్వే. 08583 అనే నెంబ‌ర్‌గ‌ల స్పెష‌ల్ ట్రైన్ విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ఈ స్పెష‌ల్ ట్రైన్‌ను పొడిగించింది రైల్వే. ఈ స్పెష‌ల్ ట్రైన్ సోమవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కూడా క‌ల‌వు..

08584 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు పొడిగించింది రైల్వే. ఈ ట్రైన్ ప్ర‌తి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం టు తిరుపతి, తిరుపతి టు విశాఖపట్నం రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంటలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2వ ఏసీ-1, 3వ ఏసీ-5, స్లీపర్ క్లాస్-9, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/డిసేబుల్ కోచ్‌లు-1, జనరేటర్ మోటార్ కార్-1 ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉన్నాయి.

More News

    Read more about: tirupati andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+