వివాహం మానవ జీవితంలో మరుపురాని ఘట్టం. ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పెద్దలు ఎన్నో జాగ్రత్తలు, ముహుర్తాలు చూసి నిర్వహించే ఒక పవిత్రకార్యం. అయితే కొన్ని సార్లు ఆ వివాహ బంధం ఆ నవ దంపతుల జీవితాల్లో అల్లకల్లోలాన్ని చెలరేగిస్తుంది. అందువల్లే ఆ వివాహం సరైన చోటు నిర్వహిస్తే అటువంటి సమస్యలు రావని భావిస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందిన ఓ దేవాలయం కేరళలో ఉంది. ఈ దేవాలయంలో ఏటా జరిగే పెళ్లిళ్ల సంఖ్య భారత దేశంలో మరే ఇతర దేవాలయంలో కూడా జరగవని చెబుతారు. ఇందుకు గల కారణాలతో పాటు ఆ క్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం

గురువాయూరు, కేరళ
P.C: You Tube
గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని ప్రముఖ పట్టణం. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.

నాలుగు చేతులు
P.C: You Tube
నాలుగు చేతులతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముగ్ధ మనోహర రూపంతో బాలగోపాలుడి రూపంలో మనకు ఈ గురువాయూర్ దేవాలయంలో కనిపిస్తాడు.

త్రిసూర్ కు 30 కిలోమీటర్లు
P.C: You Tube
కేరళలోని త్రిసూర్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆ నల్లనయ్యను సామిని కన్నన్, ఉన్ని కృష్ణన్ అంటే బాలకృష్ణుడు, ఉన్ని కన్నన్,గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.

వాయువు, గురువు
P.C: You Tube
ఇక్కడ మూలవిరాట్టు ప్రతిష్టాపనకు గురువు, వాయువు ప్రధాన కారణం కాబట్టి ఈ ప్రాంతాన్ని వారిద్దరి పేర్లను కలిపి గురువాయూరు పేర్లతో పిలవడం మొదలుపెట్టారు.

ఐదువేల ఏళ్ల నాటిది
P.C: You Tube
ఇక ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్టించబడం వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం. ఇక్కడి గర్భగుడిలోని విగ్రహం ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపుతారు.

త్రిమూర్తులు
P.C: You Tube
ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ పూజించారని చెబుతారు. ఈ విగ్రహం అత్యంత అరుదైన పాతాళ శిలతో తయారయ్యిందని చెబుతారు. ఇటువంటి శిలతో తయారైన విగ్రహం ఇదొక్కటే.

శివుడు బ్రహ్మకు ఇచ్చాడు
P.C: You Tube
ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని ఆయన దానిని సంతానం కోసం పరితపిస్తున్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ చెబుతారు. ఆయన దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాడు.

వసుదేవుడి నుంచి శ్రీ కృష్ణుడు
P.C: You Tube
అటు పై ఆతడి నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ చెబుతాడు.అటు పై వసుదేవుడి నుంచి శ్రీ కృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్టించాడనీ చెబుతారు.

స్వర్గారోహణ సమయంలో
P.C: You Tube
స్వర్గారోహణ సమయంలో శ్రీ కృష్ణుడు తన శిష్యుడైన ఉద్దవుడిని పిలిచి త్వరలో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతూ ఉంటుందని చెబుతాడు.

కేరళ తీరానికి
P.C: You Tube
ఆ విగ్రహాన్ని తీసుకుని దేవతల గురువైన బృహస్పతికి అదజేయమని చెప్పాడని పురాణాలు చెబుతాయి. అటు పై ఉద్దవుని సందేశం ప్రాకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వస్తాడు.

శివుడు తపస్సు చేస్తూ
P.C: You Tube
అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించగా ఆయన ఆదేశాలను అనుసరించి వారిరువురూ ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక పరమేశ్వరుడు తపస్సు చేసిన కోరును రుద్ర తీర్థంగా పిలుస్తారు.

పార్వతిని తీసుకొని
P.C: You Tube
అటు పై శివుడు పార్వతిని తీసుకుని అక్కడి నుంచి సరస్సు అవతలి ఒడ్డున కొలువై ఉంటాడు. ఆ ప్రాంతాన్నే ప్రస్తుతం మామ్మియూర్ అని పిలుస్తారు. ఇక గురువాయూరులోని ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించగా అటు పై ప్యాండ్యురాజులు పున:నిర్మించారని చెబుతారు.

అన్నప్రాశన
P.C: You Tube
గురువాయూరప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం.

వివాహం చేసుకొంటే
P.C: You Tube
అదే విధంగా గురువాయూరప్ప సమక్షంలో పెళ్లి చేసుకొంటే జీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అందుకే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడుతారు.

తులాభారం
P.C: You Tube
అందువల్లే కేరళలో మరే గుడిలో జరగని పెళ్లిళ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్లు, బెల్లం, కొబ్బరికాయలు తదితరాలను స్వామివారికి భక్తులు నివేదిస్తారు.

గజరాజులు
P.C: You Tube
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూరును ఊహించలేము. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ ల గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. పద్మనాభన్ ఎంతో సాధు లక్షణాలతో ఉండేది.

పద్మనాభన్
P.C: You Tube
ఈ పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామిసేవలోనే గడిపింది. క్రీస్తుశకం 1931లో అది చనిపోయే సమయంలో స్వామి నుదుట ఉన్న గంధం బొట్టు రాలిపోయిందట.

ఏకాదశి రోజున
P.C: You Tube
అటు పై పద్మనాభన్ వారసత్వాన్ని కేశవన్ అందిపుచ్చుకొంది. అచ్చం పద్మనాభన్ వలే స్వామిని సేవించేది. క్రీస్తుశకం 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది.

ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో
P.C: You Tube
ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్ కోటలో దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది. ఇందులో సుమారు 60 ఏనుగులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.

కేశవన్ విగ్రహం కూడా
P.C: You Tube
ఇక్కడ కేశవన్ విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగులకు వివిధ రకాల పందేలు పెడుతారు. వీటిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.



Click it and Unblock the Notifications













