Search
  • Follow NativePlanet
Share
» »హఫ్లాంగ్.. అస్సాంలోని ఏకైక అందమైన హిల్ స్టేషన్..!

హఫ్లాంగ్.. అస్సాంలోని ఏకైక అందమైన హిల్ స్టేషన్..!

హఫ్లాంగ్.. అస్సాంలోని ఏకైక అందమైన హిల్ స్టేషన్..!

ఆగస్టులో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే, అస్సాంలోని ఈ అందమైన హిల్ స్టేషన్‌ను సందర్శించడానికి ప్లాన్ చేయండి. ఈ ప్రదేశం సాహస ప్రియులకు, ప్రకృతి ప్రేమికుల‌కు ఎంతో ఉత్తమమైనది. అస్సాంలోని ఆ అంద‌మైన హిల్‌స్టేష‌న్ పేరు హ‌ప్లాంగ్‌. ఈ ప్రాంతంలో చుట్టు ప‌చ్చ‌ద‌నంతో నిండిన కొండ‌లు ప‌ర్యాట‌కుల‌కు సాద‌ర ఆహ్వ‌నం ప‌లుకుతాయి. గౌహతి నుండి 300 కిలోమీట‌ర్ల దూరం, సిల్చార్ నుండి 100 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఈ అద్భుత‌మైన‌ ప్రదేశం నెలకొని ఉంది. హఫ్లాంగ్ అస్సాంలోని డిమా హసావో జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 680 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంది. ఈ హిల్ స్టేషన్‌ని 'వైట్ యాంట్ హిల్లాక్' అని కూడా అంటారు. రోమింగ్ కాకుండా అస్సాం సంస్కృతిని దగ్గరగా చూడాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.

హాఫ్లాంగ్‌లో చూడవలసిన సమీప ప్రదేశాలు

హాఫ్లాంగ్ సరస్సు

ఇది హ్యాంగ్ బ్రిడ్జ్ ఓవర్‌పాస్‌తో హఫ్లాంగ్ నగరం నడిబొడ్డున ఉన్న ఒక అందమైన సరస్సు. అస్సాంలోని అతిపెద్ద సహజ నీటి వనరులలో ఇది ఒకటి. ఇక్క‌డ‌ చుట్టూ పచ్చదనం, వృక్షజాలం, జంతుజాలం, పొగమంచుతో క‌ప్ప‌బ‌డిన పర్వతాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ స‌ర‌స్సు దీని అందానికి ప్ర‌సిద్ధి చెందింది. అందుకే దీనిని 'స్కాట్లాండ్ ఆఫ్ అస్సాం' అని కూడా పిలుస్తారు. ఏడాది పొడవునా ఎప్పుడైనా హఫ్లాంగ్ సరస్సును సందర్శించడానికి ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవచ్చు.

1

హాఫ్లాంగ్ కొండ

హఫ్లాంగ్ కొండ హఫ్లాంగ్‌లోని ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డి పచ్చని కొండలు, ఇక్కడి నిర్మలమైన వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ కొండ‌ను తెల్ల చీమల కొండ అని కూడా పిలుస్తారు. అస్సాంలోని హఫ్లాంగ్ గౌహతి నుండి 310 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. అందమైన హాఫ్లాంగ్ కొండలు, ప్రకృతి దృశ్యాలు, లోయలు, పర్వతాలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రశాంతమైన సెలవుదినానికి ఈ ప్రాంతం అనువైనది. అడ్వెంచ‌ర్ యాక్టివిటిల‌కు ఈ ప్రాంతం మంచి ఎంపిక‌. ఇక్క‌డి లేక్‌సైడ్ రిసార్ట్‌లు ఎంతగానో ప్ర‌సిద్ధి చెందాయి. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ పారాగ్లైడింగ్ వంటివాటికి కూడా పేరుగాంచింది.

సిల్చార్

హఫ్లాంగ్ నుండి సిల్చార్ సమీప పట్టణం. ఇక్కడి ప్రకృతి అందాలు, విభిన్న సంస్కృతి, సంప్ర‌దాయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇది అస్సాంలో రెండవ అతిపెద్ద నగరం. అడ్వెంచర్, రిలాక్స్ వెకేషన్ ఇష్టపడే వారికి ఈ ప్రదేశం చాలా మంచిది.

2

మబాంగ్

హఫ్లాంగ్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న మబాంగ్ అస్సాంలోని కళలు, సంస్కృతికి ఒక పురాతన కేంద్రంగా పేరుగాంచింది. ఈ నగరం 17వ శతాబ్దంలో డిమాస్ కచారి రాజ్యానికి రాజధానిగా ఉంది. ప్రస్తుతం ఇది రాంచండీ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.

3

జటింగా

అస్సాంలోని దిమా హసో జిల్లాలోని కొండపై ఉన్న జటింగా లోయ అందమైనదే కాకుండా పక్షుల ఆత్మహత్య కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇళ్లలో వెలుగుతున్న లైట్లకు ఆకర్షితులైన పక్షులు ఈ ప్రదేశానికి ఎగురుతాయని, అవి ఎగ‌ర‌లేక వేట‌గాళ్ల చేతిలో హతమవుతాయని ఇక్క‌డి వారు చెబుతుంటారు. స్థానిక పక్షులే కాదు, వలస పక్షులు కూడా ఈ ప్రదేశంలో ఆత్మహత్య చేసుకుంటాయ‌ని గ్రామ‌స్థులు చెబుతున్నారు. అది నిజ‌మో కాదో తెలుసుకోవాలంటే, ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే మ‌రి..

More News

    Read more about: haflong lake assam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+