ఉత్తరాఖండ్‌లోని అందమైన గ్రామాలను చూశారా?
ఉత్తరాఖండ్ యొక్క అందమైన దృశ్యాలు ముస్సోరీ, నైనిటాల్, రిషికేశ్‌లకే పరిమితం కాకుండా ఇక్కడ చూడదగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ చాలా చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నగరాల కంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రద్ధీ అనేదే ఉండదు. అందుకే ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రదేశం యొక్క సహజ అందం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఉత్తరాఖండ్‌లోని అటువంటి గ్రామాల పర్యటనకు వెళ్తాము. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదనే చెప్పుకోవాలి.

ముక్తేశ్వర్
ముక్తేశ్వర్ ఒక చిన్న గ్రామం. ఇది ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల యొక్క అద్భుతమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కే ప్రసిద్ధి చెందడమే కాకుండా, ఇక్కడ సందర్శనకు కూడా అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయం. శివునికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో ఇది ఒకటి. దీనిని "ముక్తేశ్వర్ ధామ్" లేదా "ముక్తేశ్వర్ మహాదేవ్" అని కూడా అంటారు. అంతేకాకుండా, ఇక్కడికి సమీపంలో చౌలీ కి జలీ కూడా పర్యాటకులు చూడదగ్గ ప్రదేశం. సాహస ప్రియులు ఇక్కడ రాక్ క్లైంబింగ్ మరియు రాపెల్లింగ్ వంటి కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.

తమాషా
రాణిఖేట్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం కాళీ దేవత దేవాలయం మరియు వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామాన్ని సందర్శించడం ద్వారా కూడా మీ సెలవులను చిరస్మరణీయంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు అటవీ నర్సరీని కూడా సందర్శించవచ్చు. ఈ గ్రామం నుండి ఎత్తైన పర్వతాల మధ్య సూర్యాస్తమయం దృశ్యం పర్యాటకులనున మంత్రముగ్దులను చేస్తుంది. ఇక్కడ ట్రాకింగ్ కోసం ఎంపికల కొరత లేదు.

బగోరి, తెహ్రీ గర్వాల్
గంగోత్రి ధామ్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వస్తే మీరు ఆపిల్ తోటలు మరియు పుట్టగొడుగుల పెంపకాన్ని చూడొచ్చు. చలికాలంలో అక్కడికి వెళ్లినప్పుడు కూడా మంచు కురుస్తుంది. ఇక్కడ నుండి హర్షిల్ లోయ యొక్క అందమైన దృశ్యాలు చూడవచ్చు. పర్వతాలు మరియు అందమైన రోడ్ల గుండా ముఖ్బా ఆలయానికి ప్రయాణించవచ్చు.

భగీరథి ఒడ్డున ఉన్న హిల్ స్టేషన్
హర్షిల్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. ఇది హిమాలయాల్లో భాగీరథి నది ఒడ్డున ఉన్న అందమైన హిల్ స్టేషన్. ఇది హిందూ పుణ్యక్షేత్రమైన గంగోత్రికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారి 34పై వస్తుంది. 'హర్షిల్' ఉత్తరకాశీ నుండి 78 కిలోమీటర్లు, గంగోత్రి నేషనల్ పార్క్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

గార్తాంగ్ గలి
ఇది చెక్క వంతెన. దీనికి చరిత్రతో సంబంధం ఉంది. పర్వతాల రాళ్ల మధ్య నిర్మించిన ఈ చెక్క వంతెన 150 ఏళ్ల నాటిది. నిజానికి ఈ వంతెన భారతదేశం మరియు టిబెట్ మధ్య వాణిజ్యం కోసం ఉపయోగించబడింది. 11 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన గార్తాంగ్ గలి మెట్లు ఇంజినీరింగ్‌కు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఈ చారిత్రాత్మక వంతెనను రూపొందించిన విధానం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది.



Click it and Unblock the Notifications













