Search
  • Follow NativePlanet
Share
» »స్విట్జర్లాండ్‌ను త‌ల‌పించే ఇండోర్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను చూశారా..?

స్విట్జర్లాండ్‌ను త‌ల‌పించే ఇండోర్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను చూశారా..?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ అత్యధిక జన‌సాంద్ర‌త కలిగిన ప‌ట్ట‌ణం. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశంగా పేరుగాంచింది. ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శిచేందుకు విదేశాల నుంచి కూడా వందలాది మంది పర్యాటకులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ ప్ర‌దేశం అనేక చారిత్ర‌క క‌ట్టడాల‌కు ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డ అనేక‌ ప్యాలెస్‌లు, జలపాతాలు మరియు పురాత‌న దేవాలయాలు కూడా ఉన్నాయి.

వీటితో పాటు ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇది ఒక ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా విరాజిల్లుతుంది. చాలా మంది హిందూ మరియు జైన యాత్రికులు నగరంలోని మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇండోర్‌కు వెళ్తుంటారు. మొదటి సారి ఇండోర్‌ని సందర్శిస్తున్నట్లయితే మాత్రం ఈ ప్ర‌దేశాల‌ను త‌ప్ప‌కుండా వీక్షించండి.

ఇండోర్ న‌గ‌రం క్లీనెస్ట్‌గా సిటిగా పేరుగాంచింది. ఇక్క‌డ అనేక రెస్టారెంట్‌లు, హోట‌ల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఇక్క‌డి ప్ర‌దేశాలు ప‌ర్యాట‌కుల‌ను స్విట్జ‌ర్లాండ్‌ను మైమ‌రిపిస్తాయి. రండి ఆ ప్ర‌దేశాలు చూద్దాం..

coralriverdam

గులావత్ లోయ

ఇండోర్ సమీపంలోని గులావత్ వ్యాలీ గ్రామం చాలా అంద‌మైన ప్ర‌దేశం. ఈ ప్రాంతంలో అనేక స‌ర‌స్సులు ఉంటాయి. ఇందులో బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ ప్ర‌దేశం ప‌ర్యాట‌కుల‌కు కేరళ బ్యాక్ వాటర్స్ ను గుర్తు చేస్తుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వెతుకుతున్న జంటలకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఇక్క‌డి స‌ర‌స్సుల‌లో అనేక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు జ‌రిగాయి. ఇది వివాహ ఫోటోగ్రాఫర్‌లకు ఎంతో ఇష్ట‌మైన ప్ర‌దేశంగా చెప్పొచ్చు.

పాతాళ జ‌ల‌పాతం..

ఇండోర్ సమీపంలోని ఈ అందమైన జలపాతం 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పేరుకు పాతాళపాణి కానీ, ఇక్క‌డి దృశ్యాలు మాత్రం స్వ‌ర్గాన్ని త‌లపించేస్తాయి. ఈ ప్ర‌దేశమంతా చుట్టు ప‌చ్చ‌ద‌నంతో నిండి ఉంటుంది. ఇక్క‌డ అత్యంత ఎత్తు నుంచి నీరు ప్ర‌వ‌హిస్తుంది. ఈ దృశ్యాల‌ను ప‌ర్యాట‌కులు త‌ప్ప‌కుండా వారి వారి కెమెరాల్లో బంధించాల్సిందే. అంత‌టి అద్భుత‌మైన దృశ్యం ఇది. ఇది ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ఇండోర్ నుండి పాతాళపానీకి సుమారు 40 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ పచ్చని చెట్లతో నిండిన అనేక అరుదైన చెట్లు మరియు పక్షులు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణలనే చెప్పుకోవ‌చ్చు. ఈ జలపాతం దగ్గర ప‌ర్యాట‌కులు శీఘ్ర విహారయాత్ర చేయవచ్చు. ఇక్క‌డి అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

జామ్ గేట్‌

ఇండోర్‌లోని ఇండియా గేట్‌ను తలపించే ప్రదేశ‌మేదీ అని అడిగితే, చాలామంది ఖచ్చితంగా జామ్‌గేట్ పేరు చెబుతారు. ఈ ప్రదేశం కూడా హిల్ స్టేషన్ కంటే తక్కువేమీ కాదు. ఈ జామ్‌గేట్ నిర్మాణం, దృశ్యం ప‌రంగా ఇండియా గేట్‌లా కనిపిస్తుంది. ఇండోర్‌లోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌లో ఇది ఒక‌టి.

ujjain1

ఉజ్జయిని

ఇండోర్ సందర్శనలో మరో ముఖ్య‌మైన ప్ర‌దేశం ఉజ్జయిని. ఇది ఇండోర్ నుండి సుమారు 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మహాకాల్ దేవాలయం కాకుండా అనేక ఇతర ప్రసిద్ధ దేవాలయాలు కూడా వెల‌సాయి. వీటితో పాటు ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. జహజ్ మహల్ ఇండోర్‌కి సుమారు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇక్క‌డి నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, దేవాస్ టెక్రీ, కోరల్ రివర్ డ్యామ్ మరియు కాజ్లిఘర్ వంటి అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా ప‌ర్యాట‌కులు త‌మ జాబితాలో చేర్చుకోవ‌చ్చు.

More News

    Read more about: indore madhya pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+