Search
  • Follow NativePlanet
Share
» »పురుషులను స్త్రీలుగా మార్చే కుమారవనం యొక్క రహస్యాలు?

పురుషులను స్త్రీలుగా మార్చే కుమారవనం యొక్క రహస్యాలు?

పురుషులను స్త్రీలుగా మార్చే ఆ వనం గూర్చి మీకుతెలుసా? మనం పురాణాలు చూసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి.అలాంటి కధనాల్లో మనంఇప్పుడు చెప్పుకోబోయే కథకూడా ఒకటి.

By Venkatakarunasri

పురుషులను స్త్రీలుగా మార్చే ఆ వనం గూర్చి మీకుతెలుసా? మనం పురాణాలు చూసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి.అలాంటి కధనాల్లో మనంఇప్పుడు చెప్పుకోబోయే కథకూడా ఒకటి. అయితే ఈ కుమారవనం అనిపిలవబడే ఆ ప్రదేశానికి పురుషులుస్త్రీలగా మారతారట. మరి ఆ మారడంవెనక అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైవస్థత మనువు,ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. వీరు సంతానం కోసం ఒకయాగంచేయటం మొదలుపెడతారు. అయితే శ్రద్ధాదేవికి ఆడపిల్లలంటే ఇష్టం.అందుకోసం యాగకార్యం నిర్వహించే వారినిపిలిచి స్త్రీ సంతానం కలిగేలా యాగం జరిపించమని రహస్యంగా అర్ధించింది. వారు అదేవిధంగా మంత్రాలుచదువుతూ యాగంజరిపించాడు.తత్ఫలితంగా శ్రద్ధాదేవునకు ఆడపిల్ల జన్మించింది.

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

ఆ పాపపేరు ఇల.ఆశ్చర్యపోయిన శ్రద్ధాదేవుడు వశిష్టుడ్నికలిసి గురుదేవా. పుత్రకాంక్షతో నేను యాగంచేస్తే ఆడపిల్లపుట్టిందేంటి?మీ వంటి మహర్షులఆధ్వర్యంలో ఈయాగంలో ఈ అక్రమం ఎలాజరిగింది?అని నిలదీశాడు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

వశిష్టుడి దివ్యదృష్టితోజరిగింది తెలుసుకుని రాజా శాంతించు. చేసిన తప్పువల్ల ఈ పొరపాటు జరిగింది. అయినాచింతించకు.ఈ బాలికను నేను బాలుడిగా మారుస్తానని శ్రీమహావిష్ణువును ప్రార్ధించాడు.ఆయన దయ తలచి కరుణించగా వసిష్టుడు ఇలను బాలునిగా మార్చాడు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

ఆ బాలుని పేరు సుద్యుమ్నుడు. సుద్యుమ్నుడు పెరిగిపెద్దవాడై రాజ్యపాలన బాధ్యతలను స్వీకరించాడు.ఒకరోజు తన పరివారంతో కలిసి సుద్యుమ్నుడు మేరు పర్వతప్రాంతంలో వున్న కుమారవనానికి వేటకి వెళ్ళాడు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

వారు ఆ వనంలో ప్రవేశించగానే సుద్యుమ్నుడు అతని పరివారం ఆడవారుగా మారిపోయారు.వారి గుర్రాలుకూడా ఆడ గుర్రాలుగా మారిపోయాయి. జరిగిన ఈ విపరీతచర్యకు అందరూ ఆశ్చర్యపోయారు.ఈ మార్పుకు కారణంఇది.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

కుమారవనం పార్వతీపరమేశ్వరుల ఏకాంతవిహార భూమి. ఒకరోజు కొందరు మహర్షులు పరమేశ్వరదర్శనార్ధంకుమార వనంలోకొచ్చారు.ఆ సమయంలో పార్వతీపరమేశ్వరులుఏకాంతశృంగారతపస్సులో వున్నారు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

రాకూడని సమయంలో వచ్చినందుకు మహర్షులు పశ్చాత్తాపంచెంది క్షమించమని పరమేశ్వరుని వేడుకుని వెళ్ళిపోయారు. అసంతృప్తిచెందిన పార్వతిని పరమేశ్వరుడుబుజ్జగిస్తూ పార్వతీ బాధపడకు ఇకనుంచి ఈ వనంలో ఏ పురుషప్రాణి ప్రవేశించినా స్త్రీప్రాణిగా మారిపోతుంది అని వరమిచ్చాడు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

ఆ కారణంగా సుద్యుమ్నుడు అతని పరివారం, గుర్రాలు కూడా స్త్రీలుగా మారిపోయాయి.తిరిగి యలగా మారిన సుద్యుమ్నుడు చెలికత్తెలుగా మారిన తన అనుచరులతో కలిసి ఆ కుమారవనం వెలుపలవిహరిస్తుంటే చంద్రుని కుమారుడైన బుధుడు యలను చూచి వలచి, మోహించి ఆమెను తనతో తీసుకునిపోయాడు.ఇల,బుధుల ప్రణయానికి ప్రత్యక్షసాక్షిగా పుట్టినవాడే పురూరవుడు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

ఈ విధమైన జీవితంతో విసుగుచెందిన ఇలతిరిగి వశిష్టుడ్ని ప్రార్ధించింది.వసిష్టుడు శివుని ప్రార్ధించి ఇలను తిరిగి సుద్యుమ్నుడిగా మార్చమని అర్ధించాడు. శివుడు కరుణించి తాను పార్వతికిచ్చిన మాటకు భంగంకాని విధంగా ఇల ఒక నెల స్త్రీగా, ఒక నెల పురుషుడిగా వుండేవిధంగా వరమిచ్చాడు.

PC:youtube

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

పురుషులను స్త్రీలగా మార్చే కుమారవనం !

ఈవిధంగా శివపార్వతుల ఏకాంతసమయంలో మునుల రాకకారణంగా ఈ వనానికి ఏ పురుషుడువచ్చినా ఆడవారిగా మారిపోతారని శివుడు పార్వతికి మాట ఇచ్చాడు.

PC:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+