Search
  • Follow NativePlanet
Share
» »ఐఆర్‌సిటిసి అందిస్తోన్న హైదరాబాద్ టు తిరుమ‌ల ప్యాకేజీ..!

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న హైదరాబాద్ టు తిరుమ‌ల ప్యాకేజీ..!

ఏపీలోని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుణ్య‌క్షేత్రాన్ని ద‌ర్శించుకునేందుకు నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. కానీ, తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌డం అంత సులువేమీ కాదు. తిరుపతి వెళ్లాలంటే ముందుగానే రిజ‌ర్వేష‌న్ చేసుకోవాలి. చాలామంది భక్తులు స్వామివారి ద‌ర్శ‌నానికి వెళుతుంటారు కాబ‌ట్టి రిజ‌ర్వేష‌న్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. అక్క‌డికి వెళ్లాక స్వామివారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి సుమారు 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అయితే, స్వామివారి ద‌ర్శనం చేసుకోవాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్యాకేజీలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుమ‌ల‌కు ప్ర‌యాణం ఉంటుంది. మొత్తం మూడురోజుల‌పాటు ఈ టూర్ ఉంటుంది. గోవిందం రైల్ టూర్ అనే పేరుతో ఈ ప్యాకేజీ ప్రారంభ‌మ‌వుతుంది. అతి త‌క్కువ ధ‌ర‌తోనే స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. రూ. 3800 తో తిరుమ‌ల సంద‌ర్శించేయొచ్చు. ప్ర‌తి రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6.25 గంటల స‌మ‌యంలో లింగంపల్లి నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ట్రైన్ గూడూరు జంక్షన్, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, తిరుపతి స్టేష‌న్‌ల‌లో ఆగుతుంది.

మూడు రోజుల టూర్ షెడ్యూల్‌...

12734 అనే నెంబ‌ర్‌గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మొద‌టి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 6:25 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేష‌న్‌లో 7:05 గంటలకు, నల్గొండ 8:35 గంటలకు ప్రయాణికుల బోర్డింగ్ అందిస్తోంది. ఇందులో ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం 06:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్క‌డ స్టేషన్ లో పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేశాక‌, నేరుగా శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. స్వామివారి ద‌ర్శ‌నం కోసం ఉదయం 09:00 గంటలకు తిరుమలకు బయలుదేరాల్సి ఉంటుంది.

hyderabadtotirumalapackage

దర్శనం పూర్త‌య్యాక స‌మీంలోని ఆల‌యాల సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ త‌ర్వాత అదే రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో 12733 అనేనెంబ‌ర్‌గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 6:20 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ట్రైన్‌లో రాత్రంతా ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. మూడోరోజు తెల్లవారుజామున 03:04 గంటలకు నల్గొండ రైల్వేస్టేష‌న్‌కు చేరుకుంటుంది. ఆ త‌ర్వాత 05:35 గంటలకు సికింద్రాబాద్‌కు స్టేష‌న్‌కు వ‌స్తుంది. అనంత‌రం ఉద‌యం 06:55 గంటలకు లింగంపల్లికి చేరుకుంటారు.

స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి. పురుషులు ధోతీ (తెలుపు), చొక్కా లేదా కుర్తా, పైజామా ధరించాలి. స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ (చున్నీ తప్పనిసరి) వేసుకోవాలి. టీ-షర్ట్, జీన్స్ వంటి దుస్తులను అస్స‌లు ధరించకూడదు. వయస్సుతో సంబంధం లేకుండా దుస్తుల నియమం త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. ప‌ర్యాట‌కులు ఇత‌ర పూర్తి వివ‌రాల కోసం అలాగే బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com సంప్ర‌దించాల్సి ఉంటుంది.

ప్యాకేజీ ధ‌ర‌లివే..

స్వామివారి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు స్లీపర్, 3ఏసీలో ప్రయాణం ఉంటుంది.(4 / 6)

కంఫర్ట్ (3A) సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 6790/- చెల్లించాలి. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితేరూ. 5660/- చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 4940/- గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు) - రూ.4750/ చెల్లించాలి. చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 సంవత్సరాలు)రూ. 2890/- గా నిర్ణ‌యించారు.

స్టాండర్ట్ (SL) సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 5660/- ఉంటుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 4940 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 4750/ ఉంటుంది. చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు) -రూ. 3800 ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 సంవత్సరాలు)రూ. 2890/ చెల్లించాలి.

More News

    Read more about: irctc tirumala andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+