ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జంటగా విహరించేందుకు చాలా సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందిన కొన్నింటి విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ చారిత్రాత్మక ప్రదేశాల నుండి నిర్మలమైన ఉద్యానవనాల వరకు మీ ప్రియమైన వారితో జీవితంలో మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకునే అవకాశాలు ఉన్నాయి.
పవిత్రమైన గంగానది ఒడ్డున ఉన్న కాన్పూర్ సంప్రదాయాలతోపాటు ఆధునికత మేళవింపుతో ఉన్న ఓ ప్రత్యేక సమ్మేళనానికి కేంద్రంగా నిలుస్తోంది. చారిత్రాత్మక స్మారక చిహ్నాలు, పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం, నోరూరించే వంటకాలతో ఈ నగరం మానసిక ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
ఫూల్ బ్యాగ్
దీనిని గణేష్ శంకర్ విద్యార్థి ఉద్యాన్ అని కూడా పిలుస్తారు. ఇది నగరంలోనే పేరొందిన విశాలమైన ఉద్యానవనం. దట్టమైన పచ్చదనంతోపాటు మనసును హత్తుకునే రంగురంగుల ప్రకాశవంతమైన పువ్వుల మధ్య జంటలకు ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు మనసుకు సరికొత్త అనుభూతులను చేరువ చేస్తాయి. పక్షుల కిలకిలారావాల ధ్వనులను ఆస్వాదిస్తూ మెలికలు తిరుగుతున్న మార్గాల్లో చేయి చేయి కలిపి షికారు చేసేందుకు జంటలకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. కనుచూపుమేర కనిపించే పచ్చని పచ్చిక బయళ్లపై విశ్రాంతి తీసుకోడం జీవితంలో మర్చిపోలేని క్షణాలను చేరువ చేస్తాయి.

అలెన్ ఫారెస్ట్ జూ
అలెన్ ఫారెస్ట్ జంతుప్రదర్శనశాల జంతు ప్రేమికులు మరియు సాహస యాత్రికులను మంత్రముగ్దులు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అరుదైన వన్యప్రాణులతోపాటు ఆకర్షించే వృక్షజాలాన్ని చూసి ఆశ్చర్యపోతూ, విశాలమైన మైదానాలను అన్వేషించడానికి అనువైన ప్రదేశంగా అలెన్ ఫారెస్ట్ జూ పేరుగాంచింది. మనసును హత్తుకునే ప్రకృతి వైభవం మధ్య మరపురాని క్షణాలను పదిలపరుచుకునేందుకు అలెన్ ఫారెస్ట్ జూ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి.

కాన్పూర్ మ్యూజియం
కాన్పూర్ మ్యూజియంలో కాన్పూర్ యొక్క గొప్ప చరిత్రతోపాటు ఇక్కడి సంస్కృతి కళ్లముందు సాక్షాత్కారం అయిన అనుభూతిని అందిస్తుంది. పురాతన కళాఖండాల ప్రదర్శన మిమ్మలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మ్యూజియం గొడలకు అలంకరించబడిన చిత్రపటాలు కాన్పూర్ చరిత్రక నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అంతేకాదు, మిమ్మల్ని చరిత్రపుటల్లోకి అమాంతం తీసుకువెళ్లిన అనుభూతిని అందిస్తాయి.

ఇస్కాన్ టెంపుల్
ప్రేమ అనే భావనతోపాటు భక్తి పరిపూర్ణ సామరస్యంతో పెనవేసుకున్న ఇస్కాన్ టెంపుల్‌లో ఆధ్యాత్మిక భావాన్ని తప్పక అనుభవించండి. వినసొంపైన కీర్తనలతోపాటు ఉత్సాహభరితమైన ఉత్సవాల మధ్య ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా పలకరిస్తుంది. ఇక్కడకి వచ్చే సందర్శకులు ఆలయ ఆచారాలు మరియు వేడుకల్లో పాల్గొనడం గొప్ప అవకాశంగా భావిస్తారు.
బ్లూ వరల్డ్ థీమ్ పార్క్
బ్లూ వరల్డ్ థీమ్ పార్క్‌లో సాహసంతో కూడిన విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతి మలుపులోనూ థ్రిల్స్ మరియు ఉత్సాహం మిమ్మలను ఆప్యాయంగా పలకరిస్తాయి. ఉత్తేజకరమైన రైడ్‌ల నుండి ఆకర్షణీయమైన ప్రదర్శనల వరకు ఈ పార్క్‌లో గడిపే ప్రతి క్షణం మిమ్మలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా కుటుంబసమేతంగా విహారానికి వచ్చేవారికి బ్లూ వరల్డ్ థీమ్ పార్క్ స్వర్గధామంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
జైన్ గ్లాస్ టెంపుల్
జైన్ గ్లాస్ టెంపుల్‌లో అద్భుతమైన అందం మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు చిరునామాగా నిలుస్తోంది. ఈ పవిత్రమైన సందర్శనీయ ప్రదేశంలో ప్రశాంతంగా గడిపేందుకు జంటలు ఆశగా ఎదురుచూస్తుంటాయి. ఈ ఆలయంలో గాజులో రూపొందించిన కళాఖండాలు కళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఆలయ నిర్మాణ శైలి ఓ సరికొత్త గాజు ప్రపంచంలో ఉన్న అనుభూతిని అందిస్తుంది. ఆలయ ముఖద్వారం అంతటా నృత్యం చేసే ప్రకాశవంతమైన రంగులను చూసి ఎవ్వరైనా మంత్రముగ్దులు కావాల్సిందే.



Click it and Unblock the Notifications













