Search
  • Follow NativePlanet
Share
» »అందు కోసం ఈ 10 ప్రాంతాలు బెస్ట్

అందు కోసం ఈ 10 ప్రాంతాలు బెస్ట్

మూడు ముళ్లు, ఏడడుగులు భవిష్యతు్త జీవితం పై ఎన్నో కొంగొత్త ఆశలు, ఆకాంక్షలు. వీటన్నింటినీ మదిలో నింపుకొన్న నూతన జంటలు తమ దాంపత్య జీవితంలోని తొలి రోజులను ఎంతో మధురంగా మలుచుకోవాలనుకుంటారు. అందుకే వైవాహిక

By Beldaru Sajjendrakishore

మూడు ముళ్లు, ఏడడుగులు భవిష్యతు్త జీవితం పై ఎన్నో కొంగొత్త ఆశలు, ఆకాంక్షలు. వీటన్నింటినీ మదిలో నింపుకొన్న నూతన జంటలు తమ దాంపత్య జీవితంలోని తొలి రోజులను ఎంతో మధురంగా మలుచుకోవాలనుకుంటారు. అందుకే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే ప్రతి జంటా మొదటగా తమ హనీమూన్ స్పాట్ గురించి ఆలోచించడం మొదలుపెడుతారు. ప్రకతి రమణీయతను ఆస్వాధించేందుకు మొగ్గు చూపుతారు. వినూత్నమైన అనుభూతులను తమ జీవితంలో పదిల పరుచుకోవడానికి ఎంతో ప్లానింగ్ కూడా చేసుకుంటారు. అలాంటి ప్రకతి రమణీయతను సొంతం చేసుకున్న భారత దేశం నలుమూల ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బెస్ట్ హనీమూన్ స్పాట్ నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం

1. ఊటి

1. ఊటి

Image source

కొత్తగా పెళ్లైన జంటలకు హనిమూన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఊటినే. మధ్య తరగతి కుటుంబ నుంచి కాస్త ఉన్నత స్థాయి కుటుంబాల వరకూ వధువరులు ఈ ప్రాంతాన్నే తమ హనీమూన్ డెస్టిని కోసం ఎన్ను కొంటారు. ఏడాది మొత్తం హనీమూన్ కు అవసరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. మైసూరుకు 128 కిలోమీటర్లు, తమిళనాడులోని కొయంబత్తూర్ కు 86 కిలోమీటర్ల దూరంలోని ఊటికి దేశం మొత్తం నుంచి రవాణా సదుపాయం బాగా ఉంది.

2. శ్రీనగర్

2. శ్రీనగర్

Image source

చుట్టూ ఎతైన మంచు కొండలు, స్వచ్ఛమైన నీటిని కలిగిన సరస్సులు ప్రక`తిలోని అందాన్నంతటిని తనలోనే అమర్చుకున్న ఈ శ్రీనర్ కొత్త జంటలకు రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. చలికాలంలో కంటే వేసవి కాలంలో ఇక్కడ విహరించడానికి అనుకూలం. శ్రీనగర్ లోని సరస్సులో బోట్ పడవుల్లో విహరిస్తూ ప్రక`తిని ఆస్వాధింస్తూ జీవిత భాగస్వామితో ఊసులాడటం అనే ద`శ్యం మాటలకు అందని ఓ అద్భుత కావ్యమనడం అతిశయోక్తి కాదేమో.

3. సింమ్లా

3. సింమ్లా

Image source

నెచ్చలి చేతిలో చెయ్యి వేసి చల్లని పిల్లగాలులను ఆస్వధిస్తూ ముందుకు సాగుతుంటే తెల్లని మేఘాలను మనలను దాటుకుంటూ వెలుతుండటం ఎంత హాయిని గొలుపుతుందో కదా. మీరు హనీమూన్ ట్రిప్ కోసం సింమ్లాను ఎంచుకుంటే ఇలాంటి ఎన్నో అనుభవాలు మీకు తరుచుగా ఈ నగరంలో ఎదురవుతాయి. హిమాలయ పర్వత సానువుల్లో భాగమైన ఈ నగరంలో ఒక్కొక్కసారి నాలుగు డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. ఆ చల్లని సమయంలో వెచ్చని కోరికలకు అంతే ఉండదేమో.

4. మనాలి

4. మనాలి

Image source

హనీమూన్ వెళ్లాలనుకొనే వారి ఛాయిస్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న పట్టణం కూడా తప్పకుండా ఉంటుంది. ఇందుకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ప్రధాన కారణం. ఒక వైపున నదీ లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు, ఆ పర్వతాల్లో రంగురంగుల పుష్పాలు ఇలాంటి ద`ష్యాల కంటే కొత్త జంటలు కోరుకునేది ఇంకేమి ఉంటుంది చెప్పండి. అందుకే సముద్రమట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణానికి హనీమూన్ జంటలు క్యూ కడుతుంటాయి.

5. కేరళ

5. కేరళ

Image source

ఈ రాష్ర్టం దేశంలో పర్యాటకంలో ముందుంటుంది. ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు కేరళ సరైన ప్రాంతం. సగటు మధ్య తరగతి కుటుంబాల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకూ ప్యాకేజీలువారిగా ఇక్కడి సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏకాంతానికి భంగం కలగకుండా గూడు పడవల్లో ప్రయాణించడం జీవితంలో పరిచిపోలేని అనుభవం. ఇక కేరళ వంటకాల్లో వేడి కోరికలను పెంచే గుణాలు ఉంటాయని చెబుతారు. అందుకే దక్షిణభారత దేశ రాష్టాల్లో చాలా మంది తమ హనిమూన్ ట్రిప్ లో కేరళ తప్పక ఉండేలా చూసుకుంటారు.

6. కాశ్మీర్

6. కాశ్మీర్

Image source

చల్లని వాతావరణానికి కాశ్మీర్ పెట్టింది పేరు. చుట్టూ మంచు పర్వతాల నడుమ నెచ్చలి నడుము చుట్టూ చేయిని వేసి నడుచుకుంటే వెళ్లాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. ఇలాంటి వారికి కాశ్మీర్ చక్కగా సరిపోతుంది. అంతేకాకుండా శ`ంగార పరమైన ఆలోచనలను రెట్టింపు చేసే స్వభావం కలిగిన కుంకుమపువ్వూ కూడా దొరుకుతుంది. అయితే చలికాలంలో కంటే వేసవి కాలంలో కాశ్మీర్ ను హనీమూన్ కోసం ఎన్ను కుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా గూడు పడవల్లో ప్రయాణం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

7. డార్జిలింగ్

7. డార్జిలింగ్

Image source

పశ్చిమ బెంగాల్ లోని ఈ పట్టణం సముద్ర మట్టానికి 6700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి వాతావరణం, పరిసర ప్రాంతాలు కొత్త జంటలకు కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే హనిమూన్ ప్యాకేజ్ అందించే వారి జంటలకు డార్జిలింగ్ ను మొదటగా చెబుతారు. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. దీంతో ఏడాది మొత్తం డార్జిలింగ్ హనిమూన్ కు అనువుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

8. గోవా

8. గోవా

Image source

సముద్ర తీర ప్రాంతమైన గోవా కేవలం మనకే కాకుండా విదేశీయులకు కూడా అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. ఇక చాలా మంది తమ హనిమూన్ ట్రిప్ లో గోవా ఉండేలా చూసుకుంటారు. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు గిఫ్ట్ గా గోవాకు హనూమూన్ పంపిస్తుటాయి. ఇక్కడి హోటల్, రిసార్టులు కూడా ప్రతి వర్గాన్ని ద`ష్టిలో ఉంచుకుని సదుపాయాలు కల్పిస్తున్నాయి.

9. కూర్గ్

9. కూర్గ్

Image source

కర్నాటకలో ప్రముఖ హిల్ స్టేషన్ అయిన కూర్గ్ కూడా హనీమూన్ జంటలకు ఇష్టమైన పర్యటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. చిరుజల్లుల్లో తడుస్తూ ప్రియ సఖితో నడవటం ఎవరికి ఆనందం కలిగించదు. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం చలికాలంలో కూడా హనిమూన్ జంటలను రారమ్మని ఆహ్వనం పలుకుతుంది. ఇక్కడ కూడా సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేట్ దాటదు.

10.లడక్

10.లడక్

Image source

హిమాలయ ప్రాంతాలకు చెందిన ఈ పట్టణం సముద్ర మట్టానికి 9800 అడుగుల ఎత్తులో ఉంది. మిగిలిన హనిమూన్ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడికి కొత్త జంటలు వెల్లడం తక్కువే. ఇందుకు రవాణా సౌకర్యాల కొరతతో పాటు కొన్ని సమాజిక పరిస్థితులు కూడా కారణం కావచ్చు. అయితే ప్రక`తితో పాటు సమాజిక పరిస్థితులు అనుకూలించినప్పుడు కొత్త జంటలు కాశ్మీర్ లోయ ప్రాంతంలోని లడక్ కు వెళ్లవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+