Search
  • Follow NativePlanet
Share
» »భార‌త‌దేశ వార‌స‌త్వ సంప‌ద‌.. భ‌టిండా కోట‌!

భార‌త‌దేశ వార‌స‌త్వ సంప‌ద‌.. భ‌టిండా కోట‌!

భార‌త‌దేశ వార‌స‌త్వ సంప‌ద‌.. భ‌టిండా కోట‌!

భారతదేశం విభిన్న సాంస్కృతిక వారసత్వం కలిగిన నేల‌. ఇక్కడ ఒక‌ప్ప‌టి చారిత్ర‌క విశేషాలు నేటికీ గొప్పగా.. గర్వకార‌ణంగా నిలుస్తాయి. అలాంటివి దేశం యొక్క గొప్ప చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయి. పంజాబ్‌లోని భటిండా కోట అటువంటి ఐకానిక్ నిర్మాణ‌మే. ఇది దేశంలోనే మనుగడలో ఉన్న పురాతన కోట అని చాలామంది న‌మ్ముతారు. 1,600 సంవత్సరాల క్రితం నాటి ఈ కోట చ‌రిత్ర‌ను ప‌దిల‌ప‌ర‌చి, భవిష్యత్ తరాలకు దాని వారసత్వాన్ని ప‌రిచ‌యం చేసేందుకు పునరుద్ధరణ జాబితాలో చేర్చ‌బ‌డింది.

bhatindafortcover

భటిండా కోట చరిత్ర

భటిండా కోట కుషానుల శకం నాటి గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ కోటను 6వ శతాబ్దంలో భట్టి రాజపుత్ర పాలకులు నిర్మించారని చెబుతారు. గుప్తాలు, హన్‌లు, మొఘలులు మరియు బ్రిటీష్‌లతో సహా అనేక మంది పాలకుల సామ్రాజ్యాలను ఈ కోట చ‌విచూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ కోట‌ నిర్మాణంపై తమదైన ముద్ర వేశారు. మట్టి ఇటుకలతో చేసిన కోట గోడలు 10 నుండి 12 అడుగుల మందంతో గంభీరంగా క‌నిపిస్తాయి. ర‌క్ష‌ణ‌గోడ అంతటా అనేక బురుజులు ఉన్నాయి. ఈ కోట సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు, దీని ప్రధాన ద్వారాన్ని ఢిల్లీ గేట్ అని పిలుస్తారు.

bhatindafortcover

కోట ఎదుర్కొన్న సవాళ్లు

భ‌టిండా కోట సంవత్సరాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. వంద‌ల సంవ‌త్స‌రాల పురాత‌నం కారణంగా ఇటీవలి కాలంలో అనేక బురుజులు కూలిపోయాయి. దీని మొత్తం నిర్మాణం యొక్క స్థిరత్వానికి ముప్పు ఏర్పడింది. అదనంగా, కోవిడ్-19 మహమ్మారి మరమ్మతు పనులను రెండేళ్లపాటు నిలిపివేశారు. దీనివల్ల కోట గోడలకు, నిర్మాణాలకు మరింత నష్టం వాటిల్లింది. కోట వారసత్వాన్ని కాపాడేందుకు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిర్మాణాన్ని పునరుద్ధరించడంతోపాటు మరమ్మతులు చేసే పనిని చేపట్టింది.

bhatindafort

30 నుండి 40 మంది నిపుణులతో కూడిన బృందం ప్రస్తుతం కోట యొక్క అసలు స్వరూపాన్ని నిర్వహించడానికి సాంప్రదాయ నిర్మాణ పద్ధతులను ఉపయోగించి ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. మరమ్మతు పనులు కోట యొక్క అసలు నిర్మాణాన్ని దెబ్బతీయకుండా లేదా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా చేసేలా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు.

కోట ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం

భ‌టిండా కోట ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ప్రతిరోజూ 4,000 నుండి 5,000 మంది సందర్శకులు ఇక్క‌డికి వస్తుంటారు. గురుగోవింద్ సింగ్ సందర్శన జ్ఞాపకార్థం 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన గురుద్వారా ఖిలా ముబారక్ కూడా కోట సముదాయంలో ఉంది. దాని మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ఇక్క‌డ జోడించ‌బ‌డుతోంది. మ‌రీ ముఖ్యంగా భటిండా కోట యొక్క పునరుద్ధరణ భారతదేశం తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు ఎలా సంరక్షించడానికి కృషి చేస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ.

బటిండా కోట వంటి ఐకానిక్ నిర్మాణాల మరమ్మతులు, పునరుద్ధరణలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశ చరిత్రను ప్రపంచానికి ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉంద‌ని పురావ‌స్తు శాస్త్ర‌వేత్తుల చెబుతున్నారు. భవిష్యత్ తరాలు గతాన్ని అన్వేషించేందుకు, నేర్చుకునేందుకు ఈ కోట స‌హ‌క‌రిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో దేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతుందని మ‌న‌మూ విశ్వ‌సిద్దాం.

More News

    Read more about: bhatinda fort punjab
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+