Search
  • Follow NativePlanet
Share
» »ఇండోర్ - మధ్య ప్రదేశ్ యొక్క హృదయ భాగం !!

ఇండోర్ - మధ్య ప్రదేశ్ యొక్క హృదయ భాగం !!

బడా గణపతి దేవాలయం ఇండోర్ లో ని ప్రఖ్యాత దేవాలయం. ఈ దేవాలయం అందులో ని గణేషుని పెద్ద విగ్రహం వల్ల ప్రసిద్ది. 25 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ప్రపంచం లోనే అతి పెద్ద గణపతి విగ్రహం గా భావిస్తారు.

By Mohammad

మధ్య ప్రదేశ్ లో ఉన్న మాల్వా పీఠభూమి పర్యాటకులకు ఆనందమయమైన ప్రాంతం. సహజసిద్దమైన ఆకర్షనలతో పోటీ పడుతున్న మానవుని చేతిలో తయారయిన ఆకర్షనలను ఇక్కడ గమనించవచ్చు. మధ్య ప్రదేశ్ యొక్క గుండెకాయ గా ఇండోర్ పిలువబడుతుంది. అందమైన నదులు, ప్రశాంతమైన సరస్సులు ఇంకా గంభీరమైన పీఠభూమి అబ్బురపరిచే విదంగా కనిపిస్తాయి.

ఇండోర్ - పాత కొత్త ల కలయిక

ఇండోర్ లో స్మారక చిహ్నాల మరియు ల్యాండ్ మార్క్ ల యొక్క అందాలను చూడవచ్చు. ఇక్కడే రెండు శతాబ్దాల పూర్వపు రాజ్వాడా పాలసు ఈ నవీన ఆధునిక టెక్నాలజీ యుగం లో కూడా అద్భుతంగా నిలిచి ఉండటం చూడవచ్చు. ఫ్రెంచ్, మొఘలు మరియు మరాఠా ల నిర్మాణ శైలి ని ప్రతిబింబించే అద్భుత స్మారక చిహ్నాలు పర్యాటకులను ఇప్పటికీ కుడా ముగ్ధులను చేస్తాయి. పూర్వపు కట్టడాల ఆకర్షణే కాక చరిత్రను కాపాడుకోవాలనే సమిష్టి కృషి కూడా ఇక్కడి ఆకర్షణకి తోడవుతుంది.

ఇది కూడా చదవండి : గ్వాలియర్ - మధ్య ప్రదేశ్ యొక్క పర్యాటక రాజధాని !!

సహజ సిద్దమైన ప్రకృతి సౌందర్యం తో పాటు ఇక్కడ కనిపించే పురాతన నిర్మాణ అద్భుతాలు ఈ నేల యొక్క ఘనమైన గతాన్ని గుర్తుచేస్తాయి. ఈ నగరం లో ఖాన్ నది మరియు సరస్వతీ నది ల సంగమం ఉంది. ఈ నగరం లో నిర్మాణ, సంస్కృతీ మరియు సాంఘిక విశేషాల మేలు కలయిక ని పర్యాటకులు చూడవచ్చు.

అన్నపూర్ణ టెంపుల్

అన్నపూర్ణ టెంపుల్

అద్భుతమైన అన్నపూర్ణ దేవాలయం ఇండోర్ లో ఉంది. ఇండోర్ లో ని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. 9 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ దేవాలయం ఇండో ఆర్యన్ మరియు ద్రవిడ నిర్మాణ శైలి ల లో నిర్మించబడింది. 100 కంటే అడుగుల ఎత్తు కలిగి ఉన్నది ఈ దేవాలయం.

చిత్రకృప : Krisbillore

ఛత్రీబఘ్

ఛత్రీబఘ్

ఛత్రీ అనబడే స్మారక మంటపాలకి ప్రసిద్ది ఛత్రీ బఘ్. హోల్కా వంశస్తుల స్మృత్యర్ధం నిర్మించబడినవి ఈ స్మారక మంటపాలు. ఖాన్ నది కి సమీపం లో ఛత్రి బాఘ్ ఉంది. ఛత్రి బాఘ్ లో ని సమాధులు డోమ్ ఆకృతి లో ఉండి వాటిపై పిరమిడ్ ఆకృతిలో గోపురాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఛత్రీ ఒక రాజు లేదా రాణి యొక్క సమాధిని గుర్తుకు తెస్తాయి.

చిత్రకృప : Raam Bholu Soni

గీతా భవన్

గీతా భవన్

ఇండోర్ లో ఉన్న విలక్షణమైన కట్టడం గీతా భవన్. ఇది ఒక మందిరం. ఏ మతానికి చెందినది కాకపోవడం ఈ మందిరం యొక్క ప్రత్యేకత. ప్రజల నమ్మకానికి చెందినది ఈ మందిరం. వివిధ మతాల నమ్మకాలూ కలిగిన భక్తులు అందరూ కలిసి ఈ మందిరాన్ని సందర్శిస్తారు. వివిధ మతాలకు సంబంధించిన ప్రతిమలు ఈ మందిరం లో ఉన్నాయి.

చిత్రకృప : yogasanft

మేగ్ దూత్ ఉపవన్

మేగ్ దూత్ ఉపవన్

ఇండోర్ లోని అతి పెద్ద పార్క్ ఈ మెఘ్ దూత్ ఉపవన్ . ప్రాంతీయం గా నే కాక పర్యాటకులకు కుడా ముఖ్య ఆకర్షణ ఈ పార్క్. వారం మొత్తం ప్రజల తో నిండి ఉండే ఈ పార్క్ వారంతం లో మరింత రద్దీ గా ఉంటుంది. ప్రజలు కుటుంబ సమేతంగా ప్రత్యేకించి పిల్లల తో ఇక్కడ సమయం గడపటానికి ఇష్టపడతారు.

చిత్రకృప : Shibnaths2

కాంచ్ మందిర్

కాంచ్ మందిర్

ఇండోర్ లో ఉన్న అద్భుతమైన మందిరం కాంచ్ మందిర్. తెల్ల రాతితో ఇది నిర్మించబడినది. మధ్య యుగ భవనం గా నిర్మించబడిన ఈ ఆలయం లో పందిరి బాల్కానీ ఇంకా షికారా ఉంది. ఈ ఆలయం లోపల గాజు తో అద్భుతం గా ఉంటుంది. గాజు తో తయారుచేయాడిన అధ్బుతమైన హస్త కళా నైపున్యనిక్జి ఈ ఆలయం నిదర్శన.

చిత్రకృప : Bernard Gagnon

మహాత్మా గాంధీ హాల్

మహాత్మా గాంధీ హాల్

ఇండోర్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్ నిర్మాణాలలో ఒకటి మహాత్మా గాంధీ హాల్. 1904 లో నిర్మించబడిన ఈ భవనం మొదట కింగ్ ఎడ్వర్డ్ హాల్ గా పిలువబడేది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948 లో ఈ హాల్ మహాత్మా గాంధీ హాల్ గా మార్చబడింది.

చిత్రకృప : Mohit8soni

బడా గణపతి టెంపుల్

బడా గణపతి టెంపుల్

బడా గణపతి దేవాలయం ఇండోర్ లో ని ప్రఖ్యాత దేవాలయం. ఈ దేవాలయం అందులో ని గణేషుని పెద్ద విగ్రహం వల్ల ప్రసిద్ది. 25 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ప్రపంచం లోనే అతి పెద్ద గణపతి విగ్రహం గా భావిస్తారు. 1875 లో నిర్మితమైనది ఈ దేవాలయం.

చిత్రకృప : Rakeshnandi1990

పాతాల్ పాని

పాతాల్ పాని

ఇండోర్ నగరానికి 36 కిలో మీటర్ల దూరం లో ఉన్న అందమైన జలపాతం ఈ పాతల్పని. 300 అడుగుల ఎత్తు నుండి నీరు పడుతుంది. ఈ నీరు పడే ప్రదేశం యొక్క లోతు మాత్రం తెలియదు. అందుకే ఇక్కడ లోతు పాతాళాన్ని తాకుతుంది అని అందుకే దీనికి 'పాతాల్ పాని' అనే పేరు వచ్చిందని ఇతిహాసం.

చిత్రకృప : cool_spark

రాజ్వాడా పాలసు

రాజ్వాడా పాలసు

ఇండోర్ లో ని ముఖ్య ఆకర్షణ ఈ రాజ్వాడా పాలసు. హోల్కార్ వంశస్తుల చారిత్రక భవనం ఈ రాజ్వాడా పాలసు. 200 ఏళ్ళ క్రితం నిర్మించబడి ఇప్పటికి నిలిచి ఉన్న గొప్ప ఆకర్షణ ఈ ప్రదేశం. ఫ్రెంచ్, మరాఠా మరియు మొఘలుల నిర్మాణ శైలిల లో నిర్మించబడినది ఈ వైభవోపేతమైన కట్టడం. ఇది ఏడు అంతస్తుల పాలసు.

చిత్రకృప : Mohit8soni

బిజసేన్ టేక్రి

బిజసేన్ టేక్రి

ఇండోర్ లో ని కొండ పైన ఉన్న బిజసేన్ టేక్రి బిజసేన్ మాత యొక్క అందమైన ఆలయం. దుర్గా అమ్మవారి రహస్య అవతారం గా బిజసేన్ మాత ని భావిస్తారు. ఈ చిన్న ఆలయం 1920 లో నిర్మించబడినది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి ఈ నగరం యొక్క అద్భుతమైన వీక్షణం మనోహరం గా ఉంటుంది.

చిత్రకృప : Abhishek727

గోమాతగిరి

గోమాతగిరి

సహజసిద్దమైన కొండల మధ్య గోమాతగిరి ఉంది. జైన మతానికి చెందిన వారికీ ముఖ్యమైన ప్రార్ధనా కేంద్రం ఇది. గోమాతేశ్వర్ లేదా బాహుబలి యొక్క పెద్ద విగ్రహానికి ఈ ఆలయం ప్రసిద్ది. ఈ విగ్రహం 21 అడుగుల ఎత్తు తో ఉంది. శ్రావణబెలగోల లో ఉన్న బాహుబలి విగ్రహాన్ని పోలి ఉంటుంది. జైన మతానికి చెందినా 24 తీర్తంకర్ ల కు నిర్మించబడిన 24 తెల్ల పాలరాతి ఆలయాలకు గోమాతగిరి ప్రసిద్ది.

చిత్రకృప : Malaiya

దేవగురడియా శివ మందిర్

దేవగురడియా శివ మందిర్

దేవగురడియా అనే చిన్న గ్రామం లో ఈ మందిరం ఉంది. ఇండోర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరం లో ఈ గ్రామం ఉంది. మహా శివుడి కి నిర్మించిన పురాతన ఆలయం ఇది. ఈ పురాతన ఆలయం రాళ్ళతో నిర్మించబడినది. గరుడ తీర్థ గా ప్రాంతీయులలో ఈ దేవాలయం ప్రసిద్ది.

చిత్రకృప : Abhishek727

ఇండోర్ ఎలా చేరుకోవాలి ?

ఇండోర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ఇండోర్ స్వంతంగా విమానాశ్రయాన్ని కలిగి ఉన్నది. ఇక్కడికి హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, లక్నో, జైపూర్, గాంధీనగర్, నాగపూర్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లో ఎక్కి ఇండోర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : ఇండోర్ సొంత రైల్వే స్టేషన్ ను కలిగి ఉన్నది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఇండోర్ కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు కలవు.

చిత్రకృప : Abhishek727

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+