Search
  • Follow NativePlanet
Share
» »వైజాగ్ నుంచి ద‌క్షిణాదిలోని పుణ్య‌క్షేత్రాల ప‌ర్యట‌న‌కు ఐఆర్‌సీటీసి కొత్త టూర్ ప్యాకేజీ!

వైజాగ్ నుంచి ద‌క్షిణాదిలోని పుణ్య‌క్షేత్రాల ప‌ర్యట‌న‌కు ఐఆర్‌సీటీసి కొత్త టూర్ ప్యాకేజీ!

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ దేశంలోని ప్ర‌ఖ్యాత‌ పుణ్యక్షేత్రాలతోపాటు ప్ర‌ముఖ‌ పర్యాటక ప్రాంతాల్లోనూ పర్యటించాల‌నుకునేవారి కోసం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌ టూర్‌ ప్యాకేజీలను తీసుకువ‌స్తూనే ఉంటుంది. సామాన్యుల‌కు సైతం అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలకే టూర్ ప్యాకేజీల‌ను అందిస్తూ త‌మ సేవ‌ల‌ను విస్త‌రిస్తూ వ‌స్తోంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునే వారి కోసం మ‌రొక స‌రికొత్త ప్యాకేజీని ప‌రిచ‌యం చేసింది. ఈ ప్యాకేజీ విశాఖపట్నం నుండి ప్రారంభ‌వుతుంది. మ‌రెందుకు ఆల‌స్యం ఆ టూర్ ప్యాకేజీ వివ‌రాలు తెలుసుకుందామా?!

విశాఖ‌ప‌ట్నం నుంచి ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల‌కు ప‌య‌న‌మ‌వ్వాల‌నుకునేవారి కోసం ఐఆర్​సీటీసీ SOUTHERN DIVINE TEMPLE TOUR EX VISAKHAPATNAM పేరుతో ప్యాకేజీని ప‌రిచ‌యం చేసింది.

కుటుంబ‌స‌మేతంగానో లేక స్నేహితుల‌తో క‌లిసి గ్రూపుగా టూర్‌ వెళ్లాల‌నుకునేవారికి ఈ ప్యాకేజీ బాగా సెట్ అవుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 పగళ్ల ఈ టూర్ఈ ప్యాకేజీలో కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, త్రివేండ్రం లాంటి పలు ప్రముఖ ప్రాంతాల‌ను చుట్టేయ‌వ‌చ్చు. ​ఇందు కోసం ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

thiruvalluvar-statue-

వైజాగ్‌లో విమానం ఎక్క‌డంతో..

ఆగ‌స్టు 14న ప్రారంభ‌మయ్యే ఈ టూర్​ ప్యాకేజీలో మొద‌టి రోజున‌ విశాఖపట్నం నుంచి టూర్ స్టార్ట్ అవుతుంది. ప‌ర్యాట‌కులు ముందుగా వైజాగ్‌లో విమానం ఎక్కితే, మధ్యాహ్నం 3:35 నిమిషాలకు మదురైలో దిగుతారు. ముందుగానే బుక్ చేసుకున్న హోట‌ల్లో ఫ్రెష‌ప్ అయ్యాక సాయంత్రం అక్క‌డి నుంచి అక్కడి నుంచి మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ద‌ర్శ‌నానికి తీసుకువెళ‌తారు. రాత్రి భోజ‌నం, విడిది మ‌దురైలోనే ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత రామేశ్వరం ప‌య‌న‌మ‌వుతారు. అక్కడి హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత దనుష్కోటి చూసేందుకు వెళ‌తారు. ఆ రాత్రికి రామేశ్వరంలోనే స్టే చేయాల్సి ఉంటుంది.

క‌న్యాకుమారిలో సూర్యోదయాన్ని..

మూడ‌వ‌ రోజు ఉద‌యం బ్రేక్​ఫాస్ట్​ చేసి, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయ సంద‌ర్శ‌న‌కు తీసుకువెళ‌తారు. ఆల‌య సంద‌ర్శ‌న త‌ర్వాత స్థానికంగా ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను చూసేందుకు అవ‌కాశం ఉంటుంది. అలా మధ్యాహ్నం అక్క‌డే లంచ్​ చేసి, తర్వాత కన్యాకుమారి ప‌య‌న‌మ‌వుతారు. రాత్రికి క‌న్యాకుమారిలోని హోట‌ల్‌లో విడిది చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున‌ కన్యాకుమారిలో సన్‌రైజ్​ పాయింట్ దగ్గర సూర్యోదయాన్ని చూస్తే చాలు.. జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతిని సొంతం చేసుకున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

dhanushkodi

అక్క‌డే బ్రేక్​ఫాస్ట్​ చేసి, కన్యాకుమారి లోకల్ సైట్‌సీయింగ్‌కు తీసుకువెళ‌తారు. ఇక్క‌డి దేవి ఆలయం, వివేకానంద రాక్ మెమొరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ, గాంధీ మెమొరియల్ వంటి సంద‌ర్శ‌నీ ప్ర‌దేశాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అలా సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన త‌ర్వాత త్రివేండ్రం వెళ్లాలి. ఆ రాత్రికి అక్క‌డే బ‌స చేయాలి. ఐద‌వ‌ రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేస‌న త‌ర్వాత రోజు మొత్తం త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయం, జూ, కోవలం బీచ్ వంటి టూరిస్ట్ స్పాట్ల‌ను చూపిస్తారు. ఆ రాత్రికి త్రివేండ్రంలో విడిది చేసి మ‌రుస‌టి రోజు ఉద‌యం త్రివేండ్రం ఎయిర్​పోర్ట్​కు ఫ్లైట్ ఎక్కితే వైజాగ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు దిగిపోవ‌డంతో టూర్ ముగుస్తుంది.

vivekanandarockmemorial

టూర్ ప్యాకేజీ ధరలు ఇవే..

ఐఆర్‌సీటీసీ టూర్​ ప్యాకేజీ ధరల‌ను ప‌రిశీలిస్తే.. కంఫర్ట్​లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.38,005, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,880, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.51,400గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ. 34,255, 2 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.30,980గా ధ‌ర నిర్ణ‌యించారు. ఫ్లైట్ టికెట్స్, ఏసీ హోటల్‌లో విడిది, 5 బ్రేక్‌ఫాస్ట్, 5 డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ వంటివి టూర్ ప్యాకేజీలోనే కవర‌వుతాయి.

More News

    Read more about: vizag irctc tour package
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+