Search
  • Follow NativePlanet
Share
» »మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

ప‌ర్యాట‌కుల‌కు ఐఆర్‌సిటిసి నిత్యం స‌రికొత్త టూర్ ప్యాకేజీల‌ను అందిస్తోంది. ప‌ర్యాటక అందాల‌తో పాటు ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రాల‌తో పాటు వివిధ ప్రాంతాల‌ను కూడా టూరిస్టుల‌కు అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ సంద‌ర్శ‌కుల‌కు ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. ఈ సీజ‌న్‌లో మంచు అందాల‌లో ప‌ర్యటించాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్యాకేజీ వివ‌రాలు మీకోసం..

ఐఆర్‌సీటీసీ మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ప‌ర్యాట‌కుల‌కు ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా షిల్లాంగ్, చిరపుంజి, గువాహటి వంటి ప్రాంతాలను చుట్టేయొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభ‌వుతుంది. విమాన ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. మెుత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది.

టూర్ వివ‌రాలు..

ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు హైదరాబాద్‌ నుంచి టూర్​ ప్రారంభమ‌వుతుంది. ఉదయం 9:25 గంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కితే మధ్యాహ్నానికి గువాహటి చేరుకుంటారు. అక్కడ ఎయిర్​పోర్ట్​లో ప‌ర్యాట‌కుల‌ను పికప్​ చేసుకుని షిల్లాంగ్‌కు తీసుకెళ్తారు. షిల్లాంగ్ చేరుకున్నఅనంత‌రం లోకల్ మార్కెట్‌లో విహ‌రించొచ్చు. ఆ నైట్‌కు షిల్లాంగ్‌లోనే స్టే చేయాల్సి ఉంటుంది.

elephanta falls meghalaya

రెండో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చిరపుంజి ట్రిప్ ఉంటుంది. అక్కడ ఎలిఫాంటా ఫాల్స్, వ్యూ పాయింట్​, నోహ్కలికై జలపాతం, మావ్స్మై గుహలు, సెవన్​ సిస్టర్​ వాటర్​ఫాల్స్​ విజిట్​ చేయొచ్చు. రాత్రికి తిరిగి షిల్లాంగ్​ చేరుకుని అక్కడే బస చేస్తారు.

మ‌రుస‌టి రోజు ఉదయం టిఫిన్ అనంత‌రం దావ్కీ లేక్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ తర్వాత మావ్లిన్‌నాంగ్, లివింగ్ రూట్ బ్రిడ్జ్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌యాణం ఉంటుంది. సాయంత్రానికి షిల్లాంగ్​ చేరుకుని ఆ రాత్రికి అక్కడే స్టే ఇయింగ్ ఉంటుంది. ఇక‌, నాలుగో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ అనంత‌రం కజరంగి ప్ర‌యాణం ఉంటుంది. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక‌, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఐదో రోజు తెల్లవారుజామున సఫారికి సిద్ధ‌మ‌వుతారు. అనంత‌రం హోటల్​లో టిఫిన్ చేసి, చెక్​ అవుట్​ అయ్యి గువాహటికి ప‌య‌నిస్తారు. అక్కడ ఒక‌వేళ కాస్త స‌మ‌య‌ముంటే బ్రహ్మపుత్ర న‌దిని కూడా సంద‌ర్శిస్తారు. అనంత‌రం హోటల్​లో చెకిన్​ అయ్యాక‌ ఆ రాత్రికి అక్కడే స్టే ఇయింగ్ ఉంటుంది. ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంత‌రం చెక్​ అవుట్​ అయ్యి కామాఖ్య దేవాలయ సంద‌ర్శ‌న‌కు వెళ్తారు. అక్క‌డినుండి గువాహటి ఎయిర్​పోర్ట్​లో డ్రాపింగ్ ఉంటుంది. ఇక‌, అక్క‌డినుండి హైదరాబాద్​ రావడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.

meghalaya and assam irctc

టూర్ ప్యాకేజీ వివరాలివే..

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర‌లను ఓసారి ప‌రిశీలిస్తే.. కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.53,250 ఉంటుంది. డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.46,500గా నిర్ణ‌యించారు. అదే ట్రిపుల్​ ఆక్యూపెన్సీకయితే రూ. 44,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 40,650 ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.36,650 చెల్లించాల్సి ఉంటుంది. 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.30,500 చెల్లించాలి.

ఇక‌, ఈ ప్యాకేజీలో టిక్కెట్ల‌తో పాటు హోటల్​ అకామిడేషన్​, 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు, లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​, ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అన్నీ క‌వ‌ర్ అవుతాయి. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 7వ తేదీన ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇత‌ర పూర్తి స‌మాచారం మేర‌కు ప‌ర్యాట‌కుల‌కు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించగ‌ల‌రు.

More News

    Read more about: irctc tourism meghalaya assam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+