Search
  • Follow NativePlanet
Share
» »ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..విజ‌య‌వాడ టు షిరిడి ట్రిప్‌..

ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..విజ‌య‌వాడ టు షిరిడి ట్రిప్‌..

వేస‌వి సెల‌వులు రాబోతున్నాయి. ఈ క్ర‌మంలో చాలామంది టూర్‌లు ప్లాన్ చేస్తుంటారు. మ‌రికొంద‌రేమో ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌ని అనుకుంటుంటారు. మ‌న‌దేశంలో పుణ్య‌క్షేత్రాల‌కు కొద‌వేలేదు. పురాత‌న ఆలయాల నుంచి ఆధునాత‌న టెక్నాల‌జీతో కూడిన దేవాల‌యాల వ‌ర‌కూ అన్నీ ఇక్క‌డ ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త ఆఫ‌ర్‌ను అందిస్తోంది.

అతిత‌క్కువ ప్యాకేజీలో ప‌ర్యాట‌కులు ఈ టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఐఆర్‌సిటిసి టూరిజం వారు విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీని అందించారు. ఇది మొత్తం నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ. ఇందులో షిర్డీతోపాటు శనిశింగ‌నాపూర్‌ను కూడా సంద‌ర్శించొచ్చు. ఈ టూర్ వివ‌రాల‌తో పాటు బుకింగ్‌కు సంబంధించిన వివ‌రాలను కూడా చూసేద్దాం..

irctcnewtourpackage--vijayawadatoshirditrip-1-1712901406 jpg

ఏప్రిల్ 16వ తేదీ నుంచి టూర్ ప్యాకేజీ..

అతి తక్కువ ధరలోనే సొంత ప్రాంతాల నుంచి, కొత్త ప్రదేశాలను చూసి వ‌చ్చ అవ‌కాశం మీకోసం. ఇక ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ తో పాటు భోజన సౌకర్యాన్ని కూడా క‌ల్పించ‌నున్నారు. విజ‌య‌వాడ టు షిర్డీ టూర్ ప్యాకేజీ వివ‌రాలు ఇలా న్నాయి. IRCTC టూరిజం."SAI SANNIDHI EX VIJAYAWADA" అనే పేరుతో విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ఇది మొత్తం నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 16వ తేదీ నుంచి ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉండ‌నుంది. . ప్రతి మంగళవారం నాడు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రైల్వే మార్గం ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయ‌డం జ‌రుగుతుంది. ఇందులో వెళ్లాల‌నుకునేవారు. విజ‌య‌వాడ స్టేష‌న్‌లోనే కాకుండా, ఖమ్మం, సికింద్రాబాద్, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా ట్రైన్ ఎక్కే వెసులుబాటు ఉంటుంది.

నాలుగు రోజుల ప్ర‌యాణం...

మొద‌టిరోజు ఈ రైలు ప్ర‌యాణం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. 17208 అనే నెంబ‌ర్‌గ‌ల షిర్డీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ రాత్రి 10.15 గంటలకు బ‌య‌లుదేరుతుంది. ప్రయాణం రాత్రంతా ఉంటుంది. రెండోరోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. అనంత‌రం అక్క‌డినుంచి షిర్డీకి బ‌య‌లుదేరుతారు. ఆ త‌ర్వాత ఆలయ సందర్శన ఉంటుంది.

సాయంత్రం అక్క‌డి వీధుల్లో షాపింగ్ చేసుకోవ‌చ్చు. రాత్రి షిర్డీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడోరోజు ఉద‌యం శ‌నిశింగ‌నాపూర్‌కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్డీ ప్ర‌యాణం ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తిరిగి నాలుగోరోజు తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరల వివరాలు..

విజ‌య‌వాడ టు షిర్డీ టూర్ ప్యాకేజీ వివ‌రాలు ఇలా ఉన్నాయి. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16165ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, డబుల్ ఆక్యుపెన్సీకయితే, రూ.10045 మాత్ర‌మే చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 రుసుముగా నిర్ణ‌యించారు. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ధరలు వేరువేరుగా ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5985 చెల్లించ‌గా, సింగిల్ షేరింగ్ కు రూ.

13705 ధ‌ర‌గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 7590 టికెట్ ధ‌ర ఉంది. ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాల‌నుకునేవారు ఈ వెబ్‌సైట్‌లోకి https://www.irctctourism.com వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఇక్క‌డ ఇచ్చిన నెంబ‌ర్ల‌ను 40-27702407 9701360701 సంప్రదించవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+