Search
  • Follow NativePlanet
Share
» »ఐఆర్‌సిటిసి ఆఫ‌ర్‌.. ఒకే టూర్ ప్యాకేజీలో తిరుపతితో సహా 5 ప్రసిద్ధ దేవాల‌యాలు..

ఐఆర్‌సిటిసి ఆఫ‌ర్‌.. ఒకే టూర్ ప్యాకేజీలో తిరుపతితో సహా 5 ప్రసిద్ధ దేవాల‌యాలు..

ఐఆర్‌సిటిసి ఆఫ‌ర్‌.. ఒకే టూర్ ప్యాకేజీలో తిరుపతితో సహా 5 ప్రసిద్ధ దేవాల‌యాలు..

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, ప‌ర్యాట‌కులు తిరుపతిలో ఉన్న బాలాజీని ద‌ర్శించుకునేందుకు వ‌స్తారు. అయితే, ఆ స్వామి వారిని దర్శించుకోవాల‌ని మీకు ఉందా? అయితే, మ‌రెందుకాల‌స్యం ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ఆఫ‌ర్ గురించి తెలుసుకోండి. ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్ర‌సిద్ధ దేవాల‌యాల‌ను కూడా వీక్షించొచ్చు.

tirupati

నాలుగు రోజులు ఐదు ప్ర‌దేశాలు..

IRCTC ప‌ర్యాట‌కుల కోసం తీసుకొచ్చిన‌ ఈ ఆఫ‌ర్ డిసెంబర్‌లో నిర్వహించబడుతుంది, ఇది నాలుగు రోజులు టూర్ ప్యాకేజీ. ఈ నాలుగు రోజులు తిరుప‌తితో పాటు ఐదు ప్ర‌సిద్ధ దేవాల‌యాల‌ను సంద‌ర్శించే అవ‌కాశం ప‌ర్యాట‌కుల‌కు క‌ల్పిస్తుంది ఐఆర్‌సిటిసి.

IRCTC 'బ్లిస్ఫుల్ తిరుపతి - 5 టెంపుల్ టూర్', 4 పగలు 3 రాత్రుల ఈ పర్యటన సూరత్ నుండి ప్రారంభం అవుతుంది. మ‌ళ్లీ ఇది సూర‌త్‌కు తిరిగి రావ‌డంతోనే ముగుస్తుంది. ఈ పర్యటన విమానం మార్గం ద్వారా ఉంటుంది. డీలక్స్ కేటగిరీ హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేయ‌నున్నారు. ఈ పర్యటన డిసెంబర్ 1వ తేదీన ప్రారంభ‌మ‌యి డిసెంబ‌ర్ 4, 2023న సూరత్‌కు తిరిగి రావడంతో ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ గురించి మరింత సమాచారం, బుకింగ్ కోసం, IRCTC అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.comని సందర్శించొచ్చు. తిరుపతి బాలాజీ ఆలయాన్ని సంద‌ర్శ‌న త‌ర్వాత స‌మీపంలోని ఆలయాలు పద్మావతి దేవి ఆలయం, కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, వెల్లూరు కాణిపాకం ఆలయం వంటి ప్ర‌సిద్ధ ఆల‌యాల‌ను కూడా సంద‌ర్శించే అవ‌కాశం ప‌ర్యాట‌కుల‌కు ఐఆర్‌సిటిసి క‌ల్పిస్తోంది.

tirupati2

టూర్ ప్యాకేజీ వివరాలు..

విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం మొద‌ట సూరత్ నుంచి చెన్నైకి బయలుదేరింది. మొద‌టిరోజు ప‌ర్యాట‌కులను చెన్నై విమానాశ్రయం నుండి మెరీనా బీచ్ స‌మీపంలోని హోటల్‌లో బ‌స‌చేసేందుకు తీసుకువెళతారు. హోటల్‌లో చెక్ ఇన్ త‌ర్వాత డిన్నర్ చేయాల్సి ఉంటుంది. రెండ‌వ‌ రోజు అల్పాహారం తర్వాత, హోటల్ నుండి చెక్ అవుట్ చేసి వెల్లూర్ గోల్డెన్ టెంపుల్‌కి ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాణిపాకం ఆలయం, శ్రీనివాస్ మంగాపురం ఆల‌యాల‌ను సంద‌ర్శించాల్సి.

సాయంత్రం తిరుపతికి బయలుదేరాల్సి ఉంటుంది. తిరుపతిలోని హోటల్‌లోనే రాత్రి బస, డిన్న‌ర్ చేయాల్సి ఉంటుంది. మూడ‌వ‌ రోజు ఉదయం అల్పాహారం తర్వాత, శ్రీ తిరుచానూరు ఆలయ సంద‌ర్శ‌న ఉంటుంది. ఈ ఆల‌యాన్నే పద్మావతి ఆలయం అని కూడా పిలుస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరుపతి బాలాజీ ఆలయ సంద‌ర్శ‌న‌. ఆ త‌ర్వాత చెన్నైకి బయలుదేరాల్సి ఉంటుంది. అనంత‌రం హోటల్‌లో చెక్-ఇన్ అయ్యి డిన్నర్ చేయాల్సి ఉంటుంది. నాల్గ‌వ రోజు టిఫిన్ చేసిన త‌ర్వాత చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు ప్ర‌యాణం. అక్కడి నుంచి సూరత్‌కు తిరుగు ప్ర‌యాణం.

ధ‌ర‌ల వివ‌రాలు..

సింగిల్స్‌కు అయితే రూ 30,400, డబుల్ రూ 24,900, ట్రిపుల్ రూ 24,000, చైల్డ్ మంచంతోపాటు రూ 21,100, చైల్డ్ మంచం లేకుండా రూ 19,800. సూరత్ నుండి వెళ్ల‌డం, రావ‌డం..చెన్నైలో 2 రాత్రి హోటల్‌లో బసచేయ‌డం, తిరుపతిలో 1 రాత్రి హోటల్‌లో బ‌స‌చేసేందుకు 3 బ్రేక్‌ఫాస్ట్‌లు, 3 డిన్నర్లు. AC టెంపో ట్రావెలర్ ద్వారా అన్నిసందర్శనా స్థలాలల‌కు ట్రాన్స్‌ఫోర్టు ఇవ‌న్నీ టూర్ ప్యాకేజీలో చేర్చ‌బ‌డ‌తాయి. తిరుపతి దర్శనం కాకుండా మరేదైనా దర్శన రుసుము. గుండు కొట్టించుకునందుకు, కెమెరా ఫీజు లేదా ప్రవేశ రుసుము వంటివి టూర్ ప్యాకేజీలో చేర్చ‌బ‌డ‌రు. వీటిని ఖ‌ర్చుల‌ను ప్ర‌యాణికులే భ‌రించాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+