Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ‌లోని శ్రీవారి భ‌క్తుల కోసం IRCTC స‌ప్త‌గిరి టూర్ ప్యాకేజీ.. త్వ‌ర‌ప‌డండి!

తెలంగాణ‌లోని శ్రీవారి భ‌క్తుల కోసం IRCTC స‌ప్త‌గిరి టూర్ ప్యాకేజీ.. త్వ‌ర‌ప‌డండి!

తెలంగాణ రాష్ట్రంలోని శ్రీవారి భ‌క్తుల‌కు ఐఆర్‌సీటీసీ స‌రికొత్త ప్యాకేజీని ప‌రిచ‌యం చేస్తోంది. భక్తులు క‌లియుగ దైవంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి సప్తగిరి పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ టూర్ ప్యాకేజీని తీసుకొస్తోంది. ఈ స్పెష‌ల్‌ టూర్​ జులై 4న మొద‌లుకానుండ‌గా, ప్ర‌తి గురువారం అందుబాటులో ఉండ‌నుంది. ముందుగా కరీంనగర్​లో ఈ టూర్‌ ప్రారంభమ‌వుతుంది. త‌ర్వాత పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మీదుగా తిరుపతికి చేరుకుంటుంది.

ప‌ర్యాట‌కులు ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్క‌డినుంచైనా రైలు ఎక్కేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అంతేకాదు, తిరుగు ప్రయాణంలోనూ ఆయా స్టేష‌న్‌ల‌లో దిగొచ్చుకూడా. మొత్తం​ మూడు రాత్రులు, నాలుగు రోజులు ప‌గ‌టిపూట ఈ టూర్ కొన‌సాగుతుంది. స‌ప్త‌గిరి టూర్ ప్యాకేజీలో తిరుమల వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవ‌డంతోపాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం ఆలయాలను కూడా దర్శించుకునే అవకాశం ఉంది.

టూర్ ప్రణాళిక ఇలా..

కరీంనగర్‌ నుంచి సాయంత్రం 7.15 గంటలకు(ట్రైన్​ నెం 12762) స్టార్ట్ అవుతుంది. అక్క‌డ నుంచి పెద్దపల్లి చేరుకున్నాక‌, 8 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం స్టాప్ ఉంటుంది. ప్యాకేజీ తీసుకున్న‌వారు ఈ స్టేష‌న్‌ల‌లో ఎక్క‌డి నుంచైనా రైలు ఎక్కేందుకు అవ‌కాశం ఉంటుంది. చివ‌రిగా ఖ‌మ్మం నుంచి తిరుపతికి ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. రాత్రంతా జర్నీ చేసిన త‌ర్వాత రెండో రోజు ఉదయం 7:50 గంటలకు ట్రైన్‌ తిరుపతి చేరుకుంటుంది.

irctcsaptagiritourpackage1

రైల్వే స్టేషన్​ నుంచి ఐఆర్‌సీటీసీ ముందుగానే ఏర్పాటు చేసిన‌ హోటల్​కు తీసుకొని వెళ్తారు. అక్క‌డ‌ ఫ్రెషప్ అయ్యాక​ బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. దాని తర్వాత ప్ర‌త్యేక మార్గం ద్వారా వెళ్లి, తిరుమలలో స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుమ‌ల‌లోనే మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ఉంటాయి. అక్క‌డి నుంచి శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం చేసుకుని మ‌ళ్లీ రాత్రికి తిరుపతిలోనే విడిది చేయాల్సి ఉంటుంది.

తిరుగు ప్ర‌యాణం..

ఇక మూడో రోజు ఉద‌యం బ్రేక్​ఫాస్ట్​ చేసి, హోటల్​ నుంచి చెక్​ అవుట్ అవుతారు. అక్క‌డి నుంచి కాణిపాకం, శ్రీనివాస మంగాపుర్ ఆలయాల సంద‌ర్శ‌న ఉంటుంది. అదే రోజు సాయంత్రం గోవిందరాజ స్వామి ఆలయాన్ని కూడా ద‌ర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరుకుని, రాత్రి 8.15 గంటలకు (ట్రైన్​ నెం 12761) కరీంనగర్​కు తిరుగు ప్ర‌యాణం అవుతారు. అలా నాలుగో రోజు తెల్లవారుజామున మూడున్నరకు ఖమ్మం, 4:41గంటలకు వరంగల్​, ఉదయం 5:55 గంటలకు పెద్దపల్లి, 8:40 గంటలకు కరీంనగర్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకోవ‌డంతో స‌ప్త‌గిరి టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధ‌ర‌ల వివ‌రాలు ఇలా..

భ‌క్తుల సౌక‌ర్యాల‌ను బ‌ట్టీ ప్యాకేజీలో ధ‌ర‌లు నిర్ణ‌యించారు. ఇందులో కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.9,010, డబుల్​ షేరింగ్​కు రూ.7,640, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.7,560గా ధ‌ర ఉంది. అలాగే, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.7,140, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,710 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.

7,120, డబుల్​ షేరింగ్​కు రూ.5,740, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.5,660గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.5,250, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.4,810గా ధ‌ర నిర్ణ‌యించారు. ఈ ప్యాకేజీలోనే ట్రావెల్ ఇన్సూరెన్స్​తో పాటు హోటల్​లో వసతి, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం వంటివి ఉంటాయి. బుకింగ్‌తోపాటు మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR005 ను క్లిక్ చేయండి!

More News

    Read more about: saptagiri tour package irctc
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+