ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించాలని చాలామంది పర్యాటకులు, భక్తులు అనుకుంటు ఉంటారు. స్వామివారి దర్శనం కోసం ఎంతో కాలంగా ఎదురు చూసిన వారు కూడా ఉంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ నుంచి తిరుమలకు ప్రయాణం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం నాలుగురోజులు ఉంటుంది. ఇది ట్రైన్ జర్నీ. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ వివరాలను చూసేద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని పలు పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఐఆర్‌సిటిసి ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇది కరీంనగర్ నుంచి ప్రారంభమవుతుంది. 'SAPTHAGIRI' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి ప్రాంతాలను సందర్శించేయొచ్చు. ఈ ప్యాకేజీ ఈ నెల 13, 2024 తేదీన పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పగళ్లు ఉంటుంది. ఈ తేదీ మిస్ అయిన వారు మరో తేదీలో ట్రావెల్ చేయొచ్చు.
టూర్ షెడ్యూల్ ఇదే..
ముందుగా పర్యాటకులు తెలంగాణలోని కరీంనగర్ నుంచి 12762 అనేనెంబర్‌గల ట్రైన్ రాత్రి 07.15 గంటలకు బయల్దేరుతుంది. ఈ ట్రైన్ పెద్దపల్లి స్టేషన్, వరంగల్, ఖమ్మం స్టేషన్‌లలో ఆగుతుంది. పర్యాటకులు అక్కడ ఎక్కొచ్చు. పెద్దపల్లి స్టేషన్ వద్ద రాత్రి 8.05 నిమిషాలకు ఈ ట్రైన్ ఆగుతుంది. అక్కడినుంచి వరంగల్ వద్ద రాత్రి 9.15 గంటలకు ఆపుతారు. ఆ తర్వాత ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది. ఇక, మరుసటి రోజు ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ హోటల్ లో చెకిన్ అయిన తర్వాత, ఫ్రెష్ అయ్యి.. అక్కడ్నుంచి శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను సందర్శనకు వెళతారు. ఆ తర్వాత అక్కడినుండి శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలకు బయలుదేరుతారు.

ఆ తర్వాత తిరిగి హోటల్ కు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం టిఫిన్ చేశాక, హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఉదయం 08.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 08.15 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమమవతుంది. నాలుగో రోజు తెల్లవారుజాము నుంచే ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి స్టేషన్‌లలో ట్రైన్ ఆగుతుంది. అక్కడ పర్యాటకులు దిగుతారు. ఇక, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు..
ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకునేవారు ఓసారి వీటి ధరలు చూడండి.. సింగిల్ షేరింగ్ కు రూ. 9010 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, డబుల్ షేరింగ్ కు రూ. 7640 గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.7560 ధర ఉంటుంది. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్ లో ఉంటాయి. స్టాండర్డ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 5660 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కవర్ అవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌ను www.irctctourism.com సంప్రదించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













