వేసవి వచ్చేసింది. ఈ సమయంలో చల్లని ప్రదేశాలలో శాదదీరేందుకు ప్లాన్ చేయడం సర్వసాధారణం. అయితే, ఎక్కడికి వెళ్లాలి అనేది ఇక్కడి ప్రశ్న. అలాంటి ఆలోచనలతో తికమక పడుతోన్న పర్యాటక ప్రేమికులకు ఐఆర్‌సీటీసీ ఓ చల్లని ప్యాకేజీని పరిచయం చేస్తోంది. ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో మూడు రోజులపాటు అరకు అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. మరెందుకు ఆలస్యం అరకు టూర్ ప్యాక్‌లోని పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి!
మండు వేసవిలో ప్రకృతి ప్రేమికులు అరకు అందాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ మూడు రోజుల టూర్ ప్యాకేజీని తీసువచ్చింది. పచ్చదనం కమ్మేసిన అరకు అందాలు ఈ సీజన్‌లోనూ స్వాగతం పలుకుతాయని చాలామందికి తెలియదు. అలాంటి వారికోసమే ఐఆర్‌సీటీసీ 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఔత్సాహికులకు పరిచయం చేస్తోంది. వైజాగ్ నగరం నుంచి అరకుకు ఈ ప్యాకేజీలో భాగంగా ప్రయాణం మొదలవుతుంది. అలా అరకులోని పలు ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తారు. ఈ హాలిడే ప్యాక్ మార్చి 22వ తేది నుంచి అందుబాటులోకి రానుంది. ఓవైపు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ.. ప్రకృతి ప్రేమికులకు అరకు అందాలను పరిచయం చేసేందుకే ఈ ప్యాకేజ్‌ను పరిచయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..
ఈ ప్యాకేజ్‌లో ఐఆర్‌సీటీసీ సందర్శకుల రూట్ మ్యాప్ వెల్లడించింది. దాని ప్రకారం.. విశాఖ నగరం నుంచి మొదటి రోజు సందర్శకుల ప్రయాణం మొదలవుతుంది. అయితే, మొదటి రోజు నగరంలోని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్‌లకు తీసుకువెళతారు. తర్వాత ఆ రోజు రాత్రిని వైజాగ్‌లోనే విడిది ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖ నుంచి అరకుకు బయలుదేరుతారు. మార్గం మధ్యలో పలకరించే టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్నప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పడం కాస్త కష్టమే అనుకోండి. అలా ప్రకృతి సోయగాల నడుమ ప్రయానం సాఫీగా సాగుతుంది. అక్కడికి చేరుకున్నాక అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ చూడొచ్చు. ఆ రాత్రికి అక్కడే బస చేసి, తిరుగు ప్రయాణం మొదలవుతుంది. అలా విశాఖకు వచ్చే మార్గంలో సబ్ మెరైన్ మ్యూజియంను సందర్శించిన తర్వాత మీ టూర్ పూర్తవుతుంది.
కోచ్ ఎంపిక బట్టీ ప్యాకేజీ ధరల్లో వ్యత్యాసాలు..
ఇక టూర్ ప్యాకేజీ ధరలను పరిశీలిస్తే మనం ఎంపిక చేసుకునే కోచ్‌లను బట్టీ ధరలు నిర్ణయించారు. ప్యాకేజీ వివరాలు చూస్తే... కంఫర్ట్ క్లాస్‌లో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ. 17,715, అదే డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7980గా ధరలను నిర్ణయించారు. ఎంపిక చేసుకునే కోచ్‌ను బట్టి ఇలా ధరలలో వ్యత్యాసాలు ఉన్నాయి. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు, ప్యాకేజీ నచ్చితే మీ స్లాట్ బుక్ చేసుకునేందుకు https://www.irctctourism.com/ వెబ్ సైట్‌లోకి వెళితే.. పూర్తి సమచారం అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ మండే వేసవిలో చల్లని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మీరూ వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి!!



Click it and Unblock the Notifications












