• Follow NativePlanet
Share
» »హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు - నేరుకుండ్రం కరివరదరాజ పెరుమాళ్

హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు - నేరుకుండ్రం కరివరదరాజ పెరుమాళ్

Written By: Venkatakarunasri

చెన్నై అనే పేరు తమిళ్ మాట 'చెన్నపట్నం' నుండి వొచ్చింది. ఇంగ్లీష్ వారు ఫోర్ట్ సెయింట్ జార్జ్ సమీపంలో 1639 సంవత్సరంలో అదే పేరుతో పట్టణం నిర్మించారు. ఇంగ్లీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డేకు ఈ పట్టణాన్ని 1639 లో విక్రయించిన తరువాత, ఈ పట్టణాన్ని 'చెన్నై' అని పిలవటం ప్రారంభమైంది.

దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.మనం అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. మనం దేవస్థానానికి వెళ్లినప్పుడల్లా తరచుగా దేవుడు కళ్ళు తెరిచి మనల్ని చూస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదూ!

ఎటువంటి పాపము లేనివాడు, పాపము చేయనివాడు, జన్మ పాపము కర్మ పాపము లేనివాడు, సథ్యమును బోధించువాడు. దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.

మనం ఆలయాన్ని దర్శించినప్పుడు కర్పూరకాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం.

 కర్పూరకాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం

కర్పూరకాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శివుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు, సర్వంథర్యామి, నిష్కలంకుడు, మానవుల పాపలను క్షమించేవాడు, పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చే వాడు, దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే, ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు.

కర్పూరకాంతి

కర్పూరకాంతి

మనం ఆలయాన్ని దర్శించినప్పుడు కర్పూరకాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం.

PC:Youtube

కరివరదరాజ పెరుమాళ్

కరివరదరాజ పెరుమాళ్

ఈ ఆలయం చెన్నైలోని కోయంబీడు బస్టాండ్ కి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నేరుకుండ్రంలోని కరివరదరాజ పెరుమాళ్ అనే ఆలయంలో ఈ స్వామి వారు వున్నారు.

PC:Youtube

కర్పూర హారతి

కర్పూర హారతి

అయితే ఏ గుళ్ళో లేని విధంగా ఇక్కడ స్వామి వారు కర్పూర హారతిలో మొదటగా అందరూ చూసినట్టుగానే కళ్ళు మూసుకునివుండి హారతి ఎటువైపైతే ఇస్తూ వుంటారో అటు వైపు కను గుడ్డు తిరుగుతున్నట్లుగా వుంటుంది.

PC:Youtube

అద్భుతంగా నిర్మించబడిన విగ్రహం

అద్భుతంగా నిర్మించబడిన విగ్రహం

హారతి మధ్యలోనికి రాగానే స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా వుండే అద్భుతంగా నిర్మించబడిన విగ్రహం.

PC:Youtube

గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై; యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్". అని పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పినారు.

PC:Youtube

దేవుడి ఉనికి

దేవుడి ఉనికి

సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వానికి సంబంధించి చర్చ ఎక్కడా చూడము. అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి సంబంధింనది కాదు.

PC:Youtube

ఓ అదృశ్య శక్తి

ఓ అదృశ్య శక్తి

సైన్స్ ప్రకారం చూసినపుడు దేవుడు లేడనే సమాధానం వస్తుంది. కాని నూటికి తొంబై శాతం మంది తాము చదివిన శాస్త్రంకంటే మతాన్ని, మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన "దేవుడు" ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు సమాధానం మతపరంగా ఉన్నాడు. సైన్స్ ప్రకారం లేడు. కాని విశ్వాన్ని నడిపించే ఓ అద్రుశ్య శక్తి మాత్రం ఉంది

PC:Youtube

 ఇక్కడ దగ్గరలో గల పర్యాటక ప్రదేశాలు

ఇక్కడ దగ్గరలో గల పర్యాటక ప్రదేశాలు

జగన్నాథ్ టెంపుల్

ఒరిస్సాలోని పూరి కి జగన్నాథ యాత్రకి వెళ్ళే భక్తుల కోసం ఈ జగన్నాథ ఆలయం చెన్నై లో నిర్మించబడినది. రెడ్డి కుప్పం రోడ్ లో ఉన్న ఈ ఆలయం లో జగన్నాథ స్వామి విగ్రహం, సుభద్రా దేవి విగ్రహం అలాగే బలరాముడి విగ్రహాలు ఉన్నాయి. యోగానరసింహ స్వామి ప్రతిమని ఈ ఆలయం లోపల గమనించవచ్చు. శివుడు, గణపతి, విమలా దేవి అలాగే గజలక్ష్మి దేవిలని కూడా ఈ ఆలయంలో పూజిస్తారు.

బెసంట్ నగర్ బీచ్

బెసంట్ నగర్ బీచ్

చెన్నై లో ఉన్న బెసంట్ నగర్ లో ఈ బీచ్ ఉంది. మరీనా బీచ్ పూర్తీ అయ్యిన చోట ఈ బీచ్ ప్రారంభమవుతుంది. ఈ బీచ్ కి దగ్గరలో ఉన్న కొన్ని పర్యాటక ఆకర్షణలు అష్టలక్ష్మి కోవిల్ అలాగే వేలన్కన్ని చర్చ్. ఈత రాని వ్యక్తీ ని రక్షించడానికి ప్రయత్నించి మునిగిపోయిన ఒక డచ్ నావికుడి జ్ఞాపకార్ధం ఇక్కడ నిర్మించబడిన కార్ల్ స్క్మిద్త్ మెమోరియల్ ఈ బీచ్ లో ఉంది.

బిర్లా ప్లానెటేరియం

బిర్లా ప్లానెటేరియం

చెన్నై లోని బిర్లా ప్లానెటేరియం తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (టి ఎన్ ఎస్ టి సి)లో వుంది. ఇది గాంధీ మండపం రోడ్డు మీద వున్న పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంగణం లో వుంది. ఈ ప్లానేటేరియం చెన్నై లో 1988 లో స్థాపించారు.

చెన్నై మాల్స్

చెన్నై మాల్స్

తమిళనాడు రాష్ట్రము లోని చెన్నై లో ఉన్న ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్ ఒక షాపింగ్ ప్రాంగణం. ఈ ప్రసిద్ధ షాపింగ్ మాల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉప విభాగం అయిన ఎక్స్ప్రెస్ మౌలిక సదుపాయాల ద్వారా తయారు చేయబడింది. నిజానికి, ఈ మాల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎస్టేట్ లో ఒక భాగంగా నిర్మించారు. ఈ మాల్ ప్రత్యేకత, దక్షిణ భారతదేశం మొత్తంలో ఇది ఒక అతిపెద్ద క్రీడా ప్రాంగణంగా భావిస్తారు.

మారినా బీచ్

మారినా బీచ్

చెన్నై లో ని ఉన్న ఈ బీచ్ అత్యంత ప్రాచుర్యం పొందినది. బే ఆఫ్ బెంగాల్ లో భాగం అయిన ఈ బీచ్ నగరానికి ఉత్తరాన ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి దక్షిణాన ఉన్న బెసంట్ బీచ్ వరకు ఉంటుంది. మరీనా బీచ్ యొక్క మొత్తం పొడవు 13 కిలోమీటర్లు. భారత దేశం లో నే అతి పెద్దదైన బీచ్ గా ప్రసిద్ది చెందగా ప్రపంచం లో నే రెండవ అతి పెద్దదైన బీచ్ గా ప్రసిద్ది చెందింది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాదు నుండి చెన్నైకి నెల్లూరు, కావలి, ఒంగోలు, సూర్యాపేట మీదుగా 10గంటలు పడుతుంది.

అదేవిధంగా హైదరాబాదు నుండి చెన్నైకి నెల్లూరు, కావలి, ఒంగోలు,విజయవాడ, ఖమ్మం మీదుగా 15 గంటల సమయం పడుతుంది.ఈ మార్గంలో మీకు మరొక మంచి అవకాశం కూడా వుంది.అదేనండీ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆశీస్సులు కూడా పొంది తిరుగు ప్రయాణం గావించవచ్చును.

విమానమార్గం

విమానమార్గం

హైదరాబాదులో రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చెన్నై కి గంట ప్రయాణం మాత్రమే

pc:google maps

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి