Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ఆంజనేయ స్వామికి 40రోజులు పూజలు చేస్తే తప్పక సంతానప్రాప్తి సిద్దిస్తుంది!

ఇక్కడ ఆంజనేయ స్వామికి 40రోజులు పూజలు చేస్తే తప్పక సంతానప్రాప్తి సిద్దిస్తుంది!

దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించారని అంటుంటారు. ప్రస్తుత ఈ దేవాలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణా రావ్ దేష్ ముఖ్ నిర్మించారు. ఇక్కడ ప్రముఖ దేవుడు శ్రీ ఆంజనేయస్వామి. ఇక్కడ శ్రీ ఆంజనేయస్వామితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, దేవత అల్మారులా, శ్రీ లక్ష్మిదేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయం అభివృద్ది చెయ్యడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని భుక్తులు ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. కొండగుట్ట ఆలయాన్ని దర్శించుకునే భక్తులు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను దర్శించుకుంటారు. కొండగుట్ట ఆలయం ప్రత్యేకతలు.

శ్రీ ఆంజనేయస్వామి

శ్రీ ఆంజనేయస్వామి

చూడ చుక్కని కొండలు, గుట్టలు, రీఫ్రెష్ వాటర్ స్ట్రింగ్స్ మద్యలో ఈ దేవాలయం నిర్మించారు. శ్రీ ఆంజనేయస్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆలయం గోడల మీద వివిధ దేవతల ఆకర్షనీయమైన శిల్పాలు చెక్కించారు. ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా శ్రీ వెంకటేశ్వరస్వామి, దేవతా ఆల్మారు, శ్రీ లక్ష్మిదేవి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడచక్కటి శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు. సజీవంగా కనపడే నిలువెత్తు శ్రీ ఆంజనేయస్వామిని చూడటానికి పర్యాటకులు, భక్తులు వెల్లడానికి గుట్టల మీద ప్రత్యేక రహదారి నిర్మించారు.

ఆంజనేయస్వామి భారీ విగ్రహం

PC : విశ్వనాధ్.బి.కె.

ఈ దేవాలయం ఎక్కడుంది

ఈ దేవాలయం ఎక్కడుంది

భేతాళ స్వామి ఆలయం

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

కోండగుట్ట బస్ స్టాప్ నుంచి ఈ దేవాలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. జగిత్యాల బస్ స్టాప్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ నుంచి 39 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ జిల్లా కోండగుట్ట గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒక్కటి.

స్థానికుల కథనం ప్రకారం

స్థానికుల కథనం ప్రకారం

సుమారు 300 సంవత్సరాల క్రితం ఒక రైతుకు చెందిన గేదె తప్పిపోయింది. ఆ సందర్బంలో ఆ రైతు తన గేదె కోసం గాలించాడు. రాత్రి వరకు గేదె కోసం గాలించిన రైతు ఓపిక నసించిపోయి ఆ కొండ మీద నిద్రపోయాడు. రాత్రి రైతు కలలో శ్రీ ఆంజేనస్వామి దర్శనం ఇచ్చాడు. తప్పిపోయిన అతని గేదె ఎక్కడ ఉందని అనే సమాచారం శ్రీ ఆనంజేయస్వామి ఆ రైతుకు చెప్పాడు. వెంటనే మెలుకవలోకి వచ్చిన ఆ రైతు కొండ చుట్టు గాలించాడు. అప్పుడు ఆ రైతుకు చూడచక్కటి శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనం ఇచ్చింది. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం కనపడిన చోట చిన్నదేవాలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది.ఆలయ గోపురం

pc: Manasa.mani

సంతానం కోసం 40 రోజులు దీక్ష

సంతానం కోసం 40 రోజులు దీక్ష

సంతానం కావాలనుకున్న వారు శ్రీ ఆంజనేయస్వామిని 40 రోజుల పాటు ప్రార్థిస్తారు. ఇలా పూజలు చేస్తే సంతానం లేని వారికి పిల్లలు జన్మిస్తారని భక్తుల నమ్మకం. ఈ విధంగా సంతానం కోసం శ్రీ ఆంజనేయస్వామికి 40 రోజులు పూజలు చేస్తారు. ఇక్కడ హనుమ జయంతికి చాలా ప్రత్యేకత ఉంది. హనుమ జయంతి సందర్బంగా భక్తులు 41 రోజులు ప్రత్యేక దీక్షలు చేస్తారు. హనుమ జయంతి సందర్బంగా దాదాపు 4 లక్షల మంది భక్తులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు.

హనుమ జయంత్రి ప్రత్యేకతలు

హనుమ జయంత్రి ప్రత్యేకతలు

ఇక్కడి శ్రీ ఆంజనేయస్వామిని సంజీవ అని పిలుస్తుంటారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ స్వామి వారికి పూజలు చేస్తే వారి వ్యాదులు నయం అవుతాయని నమ్మకం. సంతానం లేనివారికి, అస్వస్తతకు గురైనవారు, అనారోగ్యంతో ఉన్న వారికి ఇక్కడి స్వామివారిని సంజీవిని అయ్యింది. ఈ దేవాలయంలో హనుమ జయంతిని రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

హనుమంతుడికి నీటి అభిషేకం

హనుమంతుడికి నీటి అభిషేకం

ఇక్కడి శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా నీటితో అభిషేకం చేస్తారు. శివుడు శ్రీ ఆంజనేయస్వామి అవతారంలో ఉన్నారని భక్తులు నమ్మకం. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి ఆంజనేయస్వామిని పూజిస్తారు. శ్రీ ఆంజనేయస్వామి దీక్షను 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు ఉంటాయి. శ్రీ ఆంజనేయస్వామి ఎడమ చేతిలో ఉన్న చందనం తీసుకోని పెట్టుకోవడం చాల మంచిదని భక్తుల నమ్మకం. ప్రతిఒక్క భక్తుడికి ఈ చందనం మీద చాలా నమ్మకం ఉంటుంది.

వేల సంఖ్యలో భక్తులు

వేల సంఖ్యలో భక్తులు

శ్రీ ఆంజనేయస్వామికి ప్రతిరోజూ ప్రత్యేకపూజలు చేస్తుంటారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది.

కరీంనగర్ వేములవాడ

కరీంనగర్ వేములవాడ

కరీంనగర్ జిల్లా పశ్చిమ భాగంలోని వేములవాడ మండలంలో కోండగుట్ట శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కరీంనగర్ వేములవాడ మద్య 35 కిలోమీటర్ల దూరం ఉంది. చాలుక్యుల రాజవంశస్తుల రాజదాని వేములవాడ అని చరిత్ర చెబుతోంది. దేవాలయాలు, విగ్రహాలను చాలుక్యులు ప్రత్యేక వాస్తు శిల్పులతో చెక్కించారని చరిత్ర చెబుతోంది.

గమ్యం ఎలా చేరుకోవాలి

గమ్యం ఎలా చేరుకోవాలి

కోండగుట్ట శ్రీ ఆంజేయస్వామి దేవాలయాన్ని చేరుకోవడానికి ఆనేక మార్గాలు ఉన్నాయి. కరీంనగర్ నుంచి 36 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి 14 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల, వరంగల్ నుంచి 115 కిలోమీటర్ల, నిజామాబాద్ నుంచి 150 కిలోమీటర్లు దూరంలో ఈ దేవాలయంలో ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం ఈ దేవాలయంకు దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఆర్ టీసీ బస్సులు కోండగుట్ట శ్రీ ఆంజనేయస్వామి ఆలయం దగ్గరకు సంచరిస్తుంటాయి.

వేములవాడ ఆలయం

వేములవాడ ఆలయం

శ్రీ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని వేములవాడ దేవాలయంలో శివలింగం ప్రత్యేకరూపంలో దర్శనం ఇస్తుంది. శ్రీరాజరాజేశ్వర దేవి ఆలయం సిద్ది వినాయకుడి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత. అనంత పద్మనాభ స్వామి, భీమేశ్వరస్వామి, కోదండరామ, కాశీ విశ్వేశ్వర దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా వేములవాడ దేవాలయాన్ని హరిహరక్షేత్రం అని పిలుస్తుంటారు. వేములవాడలో మహాశివరాత్రిని రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

రామగిరి కోట

రామగిరి కోట

12వ దశాభ్దంలో రామగిరి కోండ మీద ఈ కోటను నిర్మించారు. అనేక మూలికు, పచ్చదనంతో రామగిరి కొండ చూడముచ్చటగా కనపడుతుంది. కాకతీయులు నిర్మించిన రామగిరి కొండ అనంతరం గోల్కోండ నవాబులు స్వాధీనం చేసుకున్నారు. రామగిరి కొండ మీద శివుడు, సీతారాముల దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

PC: Urssiva

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more