Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని అత్యంత అందమైన సముద్రాలను చూద్దామా?

భారతదేశంలోని అత్యంత అందమైన సముద్రాలను చూద్దామా?

భారతదేశంలోని అత్యంత అందమైన సముద్రాలను చూద్దామా?

ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నవారు అవకాశం దొరికిన వెంటనే షికారుకి వెళ్లాల‌నుకుంటారు. అయితే ఎక్కువ మందికి ఏ ప్రదేశాన్ని సందర్శించాలో తెలియక ఆలోచ‌న‌లో ప‌డుతుంటారు. చాలామంది జ‌ల‌పాతాల‌ను, హిల్‌స్టేష‌న్ల‌ను మంచు ప్రాంతాల‌ను ఎక్కువ‌గా ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, ఈసారి మీ ట్రావెలింగ్ ట్రిప్‌ను మాత్రం సముద్రాల‌వైపు మ‌ర‌ల్చండి. భార‌త‌దేశంలోని అత్యంత అంద‌మైన స‌ముద్రాల గురించి మేం మీతో పంచుకోబోతున్నాం. వాటిని మళ్లీ మళ్లీ సందర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో, ఈ సముద్రాలను సులభంగా సందర్శించవచ్చు. ఈ సముద్రాల నుండి సూర్యాస్తమయం యొక్క అందమైన దృశ్యాల‌ను కూడా చూడొచ్చు. మ‌రెందుకాల‌స్యం ఆ అంద‌మైన స‌ముద్రాల విశేష‌తలు తెలుసుకుందామా?

andamanandnicobar

అండమాన్ మరియు నికోబార్

వేసవి కాలంలో అండమాన్, నికోబార్‌లో సూర్యాస్తమయ దృశ్యాల‌ను అతి ద‌గ్గ‌రి నుంచి చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఇక్కడికి సులభంగా వెళ్లవచ్చు. ఇక్కడ సూర్యాస్తమయం మాత్రమే కాకుండా సముద్రం కింద దృశ్యాన్ని కూడా చూడొచ్చు. అండమాన్ నికోబార్ ద్వీపం సముద్రం మధ్యలో ఉంది. ఇక్కడి పారదర్శకమైన జలాలు, మృదువైన తెల్లని ఇసుక, పచ్చదనంతో నిండిన వాతావరణం అద్భుతం అని చెప్పాలి. ఇందులో ఈత కొట్టడానికి, సన్ బాత్ చేయడానికి, స్నార్కెలింగ్ చేయడానికి కూడా ఈ ప్రాంతం ఉత్త‌మ‌మ‌నే చెప్పాలి.

rockbeach

రాక్ బీచ్

రాక్ బీచ్‌ను "పాండిచ్చేరి బీచ్" అని కూడా పిలుస్తారు. రాక్ బీచ్ అనేది భారతదేశంలోని పుదుచ్చేరి నగరంలో, బంగాళాఖాతం వెంబడి ఉన్న ప్రసిద్ధ బీచ్ ఫ్రంట్. ఇది పాండిచ్చేరిలో 1.2 కిలోమీటర్ల పొడవు, వార్ మెమోరియల్ నుండి మొదలై గౌబెర్ట్ అవెన్యూలోని డుప్లెక్స్ పార్క్ వద్ద ముగుస్తుంది. పుదుచ్చేరిని సందర్శించాలనుకుంటే మాత్రం రాక్‌బీచ్‌ను సంద‌ర్శించ‌డం మ‌ర‌వొద్దు. ఇక్కడ కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలు నీటితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. పిల్ల‌లు స‌ర‌దాగా గ‌డిపేందుకు రాక్‌బీచ్ అనువైన ప్ర‌దేశ‌మ‌నే చెప్పుకోవాలి.

elliottbeach

ఇలియట్ బీచ్

ఇలియట్ బీచ్‌ను బెసెంట్‌ నగర్ బీచ్ లేదా బెస్సీ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలోని బెసెంట్ నగర్ పరిసరాల్లో ఉన్న ఒక సహజ పట్టణ బీచ్. ఇది మెరీనా బీచ్ యొక్క దక్షిణ కొననా ఉంది. దాని ఒడ్డున అన్నై వైలంకన్ని చర్చి అని పిలువబడే అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పుణ్యక్షేత్రం కూడా ఉంది. చెన్నై నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలియట్ బీచ్‌కి వెళ్లడం ద్వారా మీరు కొన్ని క్షణాలు ప్రశాంతంగా గడ‌పొచ్చు. ఈ ప్రాంతాన్నికుటుంబం మరియు స్నేహితులతో క‌లిసి సంద‌ర్శించొచ్చు. ఈ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. బీచ్‌లో స‌రదాగా గ‌డ‌పంతో పాటు స‌మీపంలో ఉండే ఆల‌యాల‌ను కూడా సంద‌ర్శించొచ్చు.

kochi

కొచ్చి

దక్షిణాన కొచ్చి చాలా అందమైన పర్యాటక ప్రదేశం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బీచ్‌లతో పాటు అందమైన కొబ్బరి చెట్లను కూడా చూడవచ్చు. కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లా లోని అతిపెద్ద నగరం కొచ్చి. ఇది ఒక రేవు పట్టణం. ఇది కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం. అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడే కొచ్చి 14వ శతాబ్దం నుండే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా నిలచి ప్రాముఖ్యత సంతరించుకుంది. కుటుంబంతో, స్నేహితుల‌తో క‌లిసి సంద‌ర్శించేందుకు ఈ ప్రాంతం అనువైన‌ది.

More News

Read more about: andaman and nicobar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+