Search
  • Follow NativePlanet
Share

కొచ్చి: ప్రాచీనత మరియు నూతనత్వంల మేలు కలయిక

88

జీవితకాలంలో కనీసం ఒక్క సారైనా సందర్శించవలసిన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం కొచ్చి.

గొప్పదైన అరేబియన్ సముద్రాన్ని తన శరీరంలో భాగంగా చేసుకున్న అద్భుతమైన నగరం, భారత దేశంలోనే అతి పెద్ద రేవు పట్టణమైన కొచ్చి(లోగడ కొచ్చిన్) ఎర్నాకుళం జిల్లాలో ఉంది. కొచ్చి అనే పేరు కొచ్చు అజ్హి అనే మలయాళం పదం నుండి వచ్చింది. కొచ్చు అజ్హి అంటే చిన్న సరస్సు అని అర్ధం. ఈ రేవు పట్టణానికి చక్కగా సరిపోయే పేరు. ప్రాచిన పర్యాటకుల రచనలలో ఎక్కువగా కొచ్చి అనే నగరం వర్ణించబడింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల మదిని దోచే మజిలి కొచ్చి. నిజానికి, ఏంతో మంది పోర్చుగీసు వారు కొచ్చిలో స్థిరబడ్డారు. వారు తమ సొంత ప్రదేశంగా ఈ ప్రదేశాన్నిభావిస్తారు.

ఇప్పటికి కూడా, ఈ పట్టణం ఏంతో మంది పర్యాటకులని ఆకర్షించే ముఖ్య పర్యాటక ప్రదేశంగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. విభిన్న మనుషుల అభిరుచులకు మరియు అవసరాలకు తగ్గట్టు ప్రాచిన మరియు పాశ్చాత్య కలయికల మిశ్రమమే కొచ్చి నగరం. భారత దేశపు సంస్కృతి, పాశ్చాత్య ప్రభావాల మధురమైన కలయికగా కొచ్చి నగరానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

అత్యుత్తమ సాంస్కృతిక చరిత్ర

కొచ్చి, ప్రతి ఒక్కరికి ఎదో ఒక అనుభూతిని అందిస్తుంది. చరిత్రకే వన్నె తెచ్చే గొప్పదనం చరిత్రలో గొప్పగా చోటు చేసుకున్న కొచ్చి నగరానికి ఉంది. 14 వ శతాబ్దం లో కొచ్చి నగరం ప్రాముఖ్యత లో కి వచ్చింది. అప్పటినుండి, చారిత్రక పుస్తకాలలో ఈ రేవు పట్టణం గురించి పర్యాటకులు ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఆహార పదార్ధాల వ్యాపారానికి, ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు మరియు మూలికల వ్యాపారంలో ఈ పట్టణం పేరొందింది. యూదులు, చైనీయులు, గ్రీకులు, అరబ్బులు, పోర్చుగీసులు, మరియు రోమన్ వర్తకులు సుగంధ ద్రవ్యాలని కొనడానికి ఈ పట్టణానికి వచ్చేవారు. అలాగే, వారి వస్తువులతో వ్యాపారం చేసుకునేవారు. దాని ఫలితంగా, వివిధ సంస్కృతుల పద్ధతులు ఇక్కడి స్థానిక ప్రజల జీవన విధానంలో విలీనం అయ్యాయి.

ప్రపంచపు మహోన్నత సంస్కృతుల మేళవింపు కొచ్చి.

భోజన ప్రియుల స్వర్గం

ఈ నగరంలో పనిచేసే తినుబండార కేంద్రాల సంఖ్య పర్యాటకులని ఆశ్చర్య పరిచే ఒక అంశం. ప్రతిఒక్కరికీ నోరూరించేలా అద్బుతమైన పదార్ధాలని ఇక్కడి రెస్టారెంట్లు మరియు హోటళ్ళు అందిస్తాయి. ప్రపంచంలోని ఏ మూల నుంచి మీరు వచ్చినా మీ దేశంలో లభించే స్థానిక వంటకాల రుచి కొచ్చి మీకు అందిస్తుంది. అదే కొచ్చి ప్రత్యేకత. అయితే, కొచ్చి కి వొచ్చి కేరళ వంటకాల రుచి చూడడానికి ప్రయత్నించకపోవాటం అనేది ఉండదు కదా!! శాఖాహార మరియు మాంసాహార రుచికరమైన పదార్ధాలను స్థానిక వంట మనుషులు నోరూరించే విధంగా రుచికరంగా తయారుచేస్తారు. మీరు కొచ్చిని సందర్శించినప్పుడు అరటి ఆకులో చుట్టిన చేపల వంటకాన్ని రుచి చూడడం మరచిపోకండి.

అందరికీ గొప్ప అనుభూతి

కొచ్చి నుంచి ఎవ్వరూ ఆశాభంగం చెంది వెళ్ళరు. ఎందుకంటే, ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచే విధంగా పర్యాటక ఆకర్షక ప్రదేశాలు చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కార్యకలాపకేంద్ర్రాలు, మ్యూజియమ్స్, పిల్లల కోసం పార్కులు , షాపింగ్ కోసం మాల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. వృక్ష జాలం మరియు జంతు జాలం ఉండే వన్య మృగ ఉద్యానవనాలు మరియు సాంక్ట్చురీస్ వంటివవీ ఉండడం వల్ల ప్రకృతి ప్రేమికులు నిరాశ చెందే అవసరమే లేదు. అత్తిరపల్లి జలపాత సందర్శన లో ప్రకృతి వైభవం మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొచ్చి లోని అరేబియన్ సముద్రానికి సమాంతరంగా ఉండే నిర్మలమైన బ్యాక్ వాటర్స్ మీ మనసైన వారితో విశ్రాంతిగా ఒక మధ్యాహ్నం గడిపేందుకు అనువైన ప్రదేశం.

కొచ్చి లో ని బ్యాక్ వాటర్స్ కేరళ లో ని అతి పెద్ద సరస్సైన వెంబనద్ సరస్సుకి విస్తరణ. అరేబియన్ సముద్రం పక్కనించి చేసే మెరైన్ డ్రైవ్ శృంగార భరిత సాయంత్రం గడపడానికి జంటలకు గొప్ప విహార యాత్ర. జంటలకి అలాగే కుటుంబ సభ్యులకి కూడా ఇక్కడ ఆనందంగా సమయం గడిపేందుకు అనువైన ప్రదేశం. మీ ప్రియమైన వారు పక్కనే ఉండగా సముద్రం లోంచి వీచే చల్లటి గాలి మీకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.

ఒక వేళ మీకు ఆకలేస్తే పక్కనే ఉన్న బే ప్రైడ్ మాల్ కి వెళ్ళండి. ఫిష్ స్పా సౌలభ్యం కల ఏకైక మాల్ ఇదే, ఇక్కడ పెడిక్యూర్ చేయించుకోవచ్చు. ఒక వేళ మీరు ఈ నగరం యొక్క చారిత్రకత అంశాల ని అన్వేషించాలనుకుంటే ఫోర్ట్ కొచ్చి ని సందర్శించండి. ఇది కేరళలో ని మతన్చెర్రీ ద్వీపకల్పం లో ఉంది ,అద్బుతమైన సందర్శనానుభూతిని సందర్శకులకు కలిగిస్తుంది. ఫోర్ట్ కొచ్చి లో ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు ప్రఖ్యాత మతన్ చెర్రీ పాలస్ మరియు శాంటా క్రుజ్ బసిలికా.ఆ పక్కన చిన్న షికారు తో పర్యాటకులు సాంస్కృతిక పారంపర్యాన్నినేరుగా గమనించవచ్చు.

ఫోర్ట్ కొచ్చి లో ఆయుర్వేద మస్సాజ్ చేయించుకోవడం మాత్రం మరచిపోకూడదు . దేశంలోని మిగతా ప్రదేశాలకి మరియు ప్రపంచానికి రైలు, వాయు మరియు రోడ్డు మార్గం ద్వారా కొచ్చిఅనుసంధానమై ఉంది. సంవత్సరం మొత్తం పర్యాటకులని , చేపలు పట్టడంలో ఉత్సాహం గల వాళ్ళని కాంటిలెవెర్డ్ చైనీస్ ఫిషింగ్ వలలు ఆకర్షిస్తాయి. కిట కిట లాడే కొచ్చి ని సందర్శించడానికి టిక్కెట్లని ముందుగానే బుక్ చేసుకోవలసి ఉంటుంది.

మనోహరమైన కొచ్చి వాతావరణం ఈ పట్టణాన్ని సందర్శించేందుకు ఎప్పుడైనా అనువైనది. కానీ, మే నెలలో ఎండలు, ఆగష్టు, సెప్టెంబర్ ల లో ఋతుపవనాలు మీకు కొంచెం ఆశాభంగం కలిగించవచ్చు. కాబట్టి, జనవరి నుండి ఏప్రిల్ వరకు మళ్లీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కేరళ ని సందర్శించేందుకు అనువైన సమయం.

వసతికి ఎటువంటి ఇబ్బందులూ లేనందువల్ల మీ బడ్జెట్ కి తగిన విధంగా హోటల్స్ ని మీరు ఎంచుకోవచ్చు. కొచ్చి లో ఇటివల కాలంలో స్థానిక ప్రజల జీవన విధానం తెలుసుకునేందుకు హోంస్టేస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

 

కొచ్చి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొచ్చి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొచ్చి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొచ్చి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కొచ్చి రోడ్డు మార్గం ద్వారా దేశం లో ని మిగతా ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది. దేశం లో ని ఏ మూల నుంచైనా జాతీయ రహదారుల ద్వారా కొచ్చికి సులభంగా చేరుకోవచ్చు. కొచ్చి ఉత్తర దక్షిణ ప్రాంతం లో ని ఒక ముఖ్య నగరం . చుట్టూ పక్కల నగరాల నుండి మరియు పక్క రాష్ట్రాలనుండి పర్యాటకులు రావటానికి రాష్ట్ర బస్సు సర్వీసు మంచి వసతి కలిగించింది.ప్రైవేటు బస్సు ను ఎంచుకునే ముందు బస్సు రేట్ లు గురించి బాగా కనుక్కోండి, ఎందుకంటే ఒక ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ నుంచి మరొకరికి రేట్ లు మారొచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కొచ్చి లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎర్నాకులం జంక్షన్ లో ఒకటి మరియు ఎర్నాకుళం టౌన్ లో ఒకటి ఉన్నాయి. ఎర్నాకుళం జంక్షన్ లో దక్షిణ రైల్వే స్టేషన్ మరియు ఎర్నాకుళం టౌన్ లో ఉత్తర రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఈ రెండు రైల్వే స్టేషన్లు దేశంలోని మిగతా ప్రదేశాలతో చక్కగా అనుసంధానమై ఉన్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆటో అలాగే టాక్సీ సేవలు సులభంగా లభ్యం అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : కొచ్చి ప్రధాన నగరానికి 38 కి మీ ల దూరం లో ఉన్న నెడంబసరి లో కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయంలో జాతియ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఉంటాయి. విమానాశ్రయంలో లోపలా బయటా టాక్సీ సేవలు కూడా లభ్యమవుతాయి. రోజులో ఏ సమయంలోనైనా విమానాశ్రయం నుండి టాక్సీ సేవలని పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat