ముంబై లో ఉండే డ్రైవ్ ఆధారంగా కొచ్చి లో మెరైన్ డ్రైవ్ ని నిర్మించారు. కొచ్చి లో ని బ్యాక్ వాటర్స్ అందాలని పరిపూర్ణంగా వీక్షించేందుకు అవకాశం మెరైన్ డ్రైవ్ ద్వారా లభిస్తుంది. సముద్రపు అందాలని కాలుష్యరహిత వీక్షణ ద్వారా అందించడం వల్ల ఈ ప్రదేశం పర్యాటకులకి మరియు స్థానికులకి ఏంతో ఇష్టమైన ప్రదేశం.
ఆదివారం సాయంత్రాలు సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించడం కోసం ఏంతో మంది ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు. ఈ మెరైన్ డ్రైవ్ కి ఆర్ధికపరంగా కూడా ప్రాముఖ్యత ఉంది. అనూహ్యమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతి కోసం ఎన్నో మాల్స్ ఈ మెరైన్ డ్రైవ్ కి సమీపంలో ని ఉన్నాయి. వివిధ రకాల వంటకాల రుచులని అందించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా దారి పొడవునా ఉన్నాయి.
మెరైన్ డ్రైవ్ కి అతి సమీపంలో ఉన్న ఎం జి రోడ్ లో ఎన్నో మంచి రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనది కయీస్ బిర్యానీ సెంటర్. ఇక్కడి బిర్యాని రుచి చూడకపోతే కొచ్చి సందర్సన పరిపూర్ణం కానట్టే. మటన్ కర్రీ తో చికెన్ బిర్యానీ ని ఆర్డర్ చేసి తినండి. ఒక అనుభూతిని మిస్ కాకుండా ఉంటారు.