కొచ్చి లోని అంతర్గత ప్రాంతం ఫోర్ట్ కొచ్చి. సముద్రం సాగినంత వరకు ఈ ఫోర్ట్ కొచ్చి నెలకొని ఉంది. ఫోర్ట్ కొచ్చి కి ప్రపంచంలో ని మిగతా భాగాలకి అనుసంధానంగా ఒక దృఢమైన వంతెన ఉంది. చరిత్ర, కళ , ఆహారం మరియు ఆధ్యాత్మిక పరంగా ఈ ప్రదేశం పర్యాటకులకి ఏంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
కాలినడకన లేదా సైకిల్ లేదా ద్విచక్ర వాహనాల ద్వారా ఈ ప్రదేశాన్ని అత్యుత్తమంగా అన్వేషించవచ్చు. సైకిల్స్ లేదా ద్విచక్ర వాహనాలు పర్యాటకులకి అద్దెకి కల్పించే వసతి కూడా కలదు. మ్యూజియమ్స్, పాలసెస్, ఆరాధనా ప్రాంతాలు, హిందువుల కోవెలలు, చర్చులు, హెరిటేజ్ భవనాలు, ఆర్ట్ గాలెరీలు, పార్కులు, బీచ్, ఆయుర్వేదిక్ మసాజులు, రహదారి పక్కన ఉండే కాఫీ షాపులు మరియు స్మ్రుతి చిహ్నముల వంటి విశేషాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. చక్కని పర్యాటక అనుభూతి కొరకు స్థానిక ప్రజలు పర్యాటకులకి హోంస్టే సౌకర్యం కూడా కలిగిస్తారు. ఇక్కడి భవనాలలో ప్రతిబింబించే సంపన్నమైన సంస్కృతీ పారంపర్యం ఫోర్ట్ కొచ్చి ప్రత్యేకత.
ఇక్కడ కనిపించే పోర్చుగీసు, యూదులు, గ్రీకులు మరియు టిబెటన్ల సంస్కృతిని చాలా సులభంగా మీరు గుర్తించవచ్చు.అయినప్పటికీ, వీటన్నిటి మధ్యా కేరళ సంస్కృతీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.