Search
  • Follow NativePlanet
Share
» »ల‌య‌న్స్ డే రోజు ఇండియాలోని ఈ ప్ర‌దేశాల‌ను చూసేద్దామా..!

ల‌య‌న్స్ డే రోజు ఇండియాలోని ఈ ప్ర‌దేశాల‌ను చూసేద్దామా..!

ల‌య‌న్స్ డే రోజు ఇండియాలోని ఈ ప్ర‌దేశాల‌ను చూసేద్దామా..!

సింహం అడవికి రారాజు అని మనమందరం చిన్నప్పటి నుంచి చదివాం. కాబ‌ట్టి అటువంటి సింహాల ర‌క్ష‌ణ కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సింహాల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వ‌హిస్తారు. భారతదేశంలో సింహాలను రక్షించే అనేక పార్కులు, అభయారణ్యాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో సింహాలను దగ్గరగా చూడాలనుకునేవారు మీరు ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. అయితే, మ‌రెందుకాల‌స్యం భార‌త‌దేశంలోని సింహాల‌ను ర‌క్షించే అనేక పార్కులు, అభ‌యార‌ణ్యాలు చాలానే ఉన్నాయి. వాటిని చూసొద్దాం రండి.

1

గిర్ నేషనల్ పార్క్, గుజరాత్

గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఆసియాటిక్ సింహాల జనాభా కలిగిన ఏకైక పార్క్. ఈ పార్క్ జునాగఢ్ నుండి 65 కిలోమీట‌ర్ల‌ దూరంలో గిర్నార్ కొండల మధ్య ఉంది. ఇది వివిధ రకాల చెట్లు, పొదలతో కూడిన అడవి. ఈ అడ‌వి సింహాలతో నిండి ఉంది. సింహాల‌ను ప్ర‌త్యక్షంగా చూడాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతానికి రావొచ్చు.

2

సీతా మాత వన్యప్రాణుల అభయారణ్యం, రాజస్థాన్

రాజస్థాన్‌లోని సీతా మాత వన్యప్రాణుల అభయారణ్యం ఆసియాటిక్ సింహాల జనాభాకు నిలయంగా ఉంది. ఈ అభయారణ్యం జైపూర్ నుండి సుమారు 180 కిలోమీట‌ర్ల‌ దూరంలో ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఆగ్నేయ భాగంలో ఉంది. ఎగిరే ఉడతలకు ఈ అభయారణ్యం పుట్టిల్లు. ఫిబ్రవరి, మార్చి మధ్యకాలం ఈ ఎగిరే ఉడతల్ని చూసేందుకు అత్యంత అనువైన కాలం. అప్పుడే మహువా చెట్ల ఆకులు పందిళ్లు మాదిరగా ఏర్పడతాయి. చిన్న గ్రీబ్, ఆరెంజ్ బ్రౌన్ గెద్ద, ఊదా రంగు ముర్హెన్, పింఛంతో కూడిన భరత పక్షితో సహా 130కిపైగా పక్షి జాతులను ఇక్కడ చూడొచ్చు. ఈ అభయారణ్యానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ఉదయ్ పూర్.

3

కునో వన్యప్రాణుల అభయారణ్యం, మధ్యప్రదేశ్

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సింహాలు ఉన్న గ్వాలియర్ నుండి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవులలో ఈ అభ‌యార‌ణ్యం ఒకటి. ఈ దట్టమైన అడవిలో సాల్ మరియు వెదురు చెట్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడ సింహాల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని ద‌గ్గ‌రగా చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.

4

బర్దా వన్యప్రాణుల అభయారణ్యం, గుజరాత్

జంతు ప్రేమికులకు, ప్రకృతి ప్రేమికులకు బర్దా వన్యప్రాణుల అభయారణ్యం ఓ గొప్ప ఎంపిక‌నే చెప్పుకోవాలి. ఈ అభ‌యార‌ణ్యంలో అనేక వన్యప్రాణులతో పాటు చాలా సహజ సౌందర్యం, పచ్చదనం చూడొచ్చు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ఈ వన్యప్రాణుల అభయారణ్యం సింహాల రిజర్వ్ ఫారెస్ట్‌గా పిలువబడుతుంది.

కుంభాల్‌గర్ వన్యప్రాణుల అభయారణ్యం, రాజస్థాన్

కుంభాల్‌ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సింహాలకే కాదు, చిరుతపులులు మరియు పులులకు కూడా నిలయం. ఈ ప్రదేశం ఒకప్పుడు రాజస్థాన్ మహారాజు వేట ప్రదేశంగా ఉండేది. అయితే, ఇప్పుడు ఇది సింహాలను గుర్తించే వన్యప్రాణుల అభయారణ్యంగా మారింది. ఇక్క‌డ‌ సింహాలు లేదా వాటి పిల్లలను చూడొచ్చు. ఈ అభయారణ్యం అనేక అంతరించిపోతున్న వన్యప్రాణులకు నిలయంగా ఉంది. ఈ అభయారణ్యం తోడేలు, చిరుతపులులు, బద్దకపు ఎలుగుబంటి, హైనా, నక్క, అడవి పిల్లి, సంభార్, నీల్గై, చౌసింగ్ (నాలుగు కొమ్ముల జింక), చింకారా, కుందేలు వంటి అనేక జీవులకు సహజ నివాసాన్ని అందిస్తుంది.

More News

    Read more about: gir national park gujarat
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+