Search
  • Follow NativePlanet
Share
» »స్నేక్ ఫ్రీ ప్లేస్‌గా ప్ర‌సిద్ధిచెందిన లక్షద్వీప్‌ను సంద‌ర్శించేద్దామా..!

స్నేక్ ఫ్రీ ప్లేస్‌గా ప్ర‌సిద్ధిచెందిన లక్షద్వీప్‌ను సంద‌ర్శించేద్దామా..!

పాము పేరు వింటేనే చాలామందికి చేతులు, కాళ్లు వణికిపోతాయి. ఎందుకంటే, పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రాణి. ఒక్కసారి పాము కాటేస్తే మనిషి చనిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. దాదాపు ప్రతిచోటా పాములు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దట్టమైన అడవులు ఉన్న చోట వివిధ జాతుల పాములు మ‌నం చూస్తూ ఉంటాం. భారతదేశంలో 350 రకాల పాములు కనిపిస్తాయి. చాలా రాష్ట్రాల్లో అనేక ర‌కాల పాములు కూడా ఉన్నాయి. ఇక‌, దేశంలోని కేర‌ళ రాష్ట్రాన్ని పాముల నిలయం అని పిలుస్తుంటారు.

ఎందుకంటే ఇక్క‌డ పాముల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క పాము కూడా లేని ప్రాంతం ఉంద‌ని మీకు తెలుసా.?? ఆ ప్రాంతాన్ని పాము రహిత ప్ర‌దేశంగా కూడా ప్ర‌క‌టించారు. అదే భార‌త్‌లోని ల‌క్ష‌ద్వీప్ ప్రాంతం. ఇక్క‌డ ఎంత‌ వెతికినా పాములు అస్స‌లు క‌నిపించ‌వు. అందుకే దీనిని పాము రహిత ప్రాంతంగా ప్రకటించారు. దీన్ని స్నేక్ ఫ్రీ ప్లేస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్ర‌దేశం గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం ల‌క్ష‌ద్వీప్. ఇది 36 ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం. దీనిని మూడు ద్వీప ఉప సమూహాలుగా విభజించడం జ‌రిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించ‌దంటే న‌మ్మండి..ఇక‌, ప్ర‌పంచంలో ఒక్క పాము కూడా లేని దేశం ఏంటో తెలుసా..? అదే ఐర్లాండ్‌. న్యూజిలాండ్‌లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పాము కూడా కనిపించలేదట‌..!

Lakshadweep

36 దీవులు..

లక్షద్వీప్ 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా 64000. అందులో 96 శాతం మంది ముస్లింలు క‌ల‌రు. మిగిలినవారు హిందూ, బౌద్ధ మరియు ఇతర మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ మొత్తం 36 ద్వీపాలు ఉన్నాయి. అయితే, ఇక్క‌డ కేవలం 10 మంది మాత్రమే ఇళ్లను నిర్మించుకున్నారు. ఇక్క‌డ అనేక బీచ్‌లు క‌ల‌వు. అందులో కవరత్తి, కిలాతన్, మినికాయ్, చెట్లత్, కద్మత్, అగతి బీచ్, అమిని, బిత్రా, ఆందేహ్, కల్పాని వంటి బీచ్‌లు ఉన్నాయి.

రాబిస్ రహిత రాష్ట్రం..

ఈ ప్ర‌దేశం పాము రహిత రాష్ట్ర హోదాను కూడా పొందింది. అంతే కాదు దీనిని రాబిస్ రహిత రాష్ట్రం అని కూడా పిలుస్తుంటారు. ఇక్క‌డ ఏ మూల చూసిన మీకు కుక్క‌లు కూడా క‌నిపించ‌వు. లక్షద్వీప్‌కు వచ్చే పర్యాటకులు కూడా తమతో పాటు కుక్కలను తీసుకురావడం లేదు. ఇక్కడ పాములు క‌నిపించ‌వు. కానీ పక్షులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఈ ద్వీపంలో సిరేనియా మరియు సముద్రపు ఆవులను చూడొచ్చు. ఇవి ఇప్పుడు చాలా ప్రదేశాలలో కనిపించ‌డం లేదు.

Let s visit Lakshadweep which is famous as snake free place

20 శాతం పాముల్లో మాత్ర‌మే విషం..

భారతదేశంలో 350 రకాల పాములు కనిపిస్తాయి. చాలా రాష్ట్రాల్లో అనేక ర‌కాల పాములను మ‌నం చూస్తున్నాం. 2022 గణాంకాల ప్రకారం భారతదేశంలో కేవలం 20 శాతం పాములు మాత్రమే విషపూరితమైనవిగా ఉన్నాయి. ఇవి తక్కువ విషపూరితమైన పాముల వర్గంలోకి వస్తాయి. ఈ విషపూరిత పాములలో, కేవ‌లం 90 శాతం మరణానికి కారణమయ్యే స్టింగ్ పాములు నాలుగు మాత్రమే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+