Search
  • Follow NativePlanet
Share
» »మకర సంక్రాంతి - ధాన్యాగార పండుగల వేడుక !

మకర సంక్రాంతి - ధాన్యాగార పండుగల వేడుక !

సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు... గుర్తొస్తాయి. ఎందుకంటే అవన్నీ తెలుగువారు జరుపుకునే పండుగలో భాగం. అంతేకాదు కొత్త ధాన్యం ఇంటికొచ్చే వేళ వారందరూ ఎన్నో రకాల ప్రత్యేక రుచులతో తృప్తిగా భోజనం చేస్తారు. హిందువులు అందరికి మకర సంక్రాంతి మత పర మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి వుంది. ఖగోళ శాస్త్రం మేరకు మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కొత్త ప్రారంభాలకు ఈ పండుగ మొదలుగా కూడా చెపుతారు.

ఇది కూడా చదవండి : సంక్రాంతి స్పెషల్ : జల్లికట్టు బుల్ ఫైటింగ్ !

అన్ని పండగలు తిధి ప్రకారం తేదీల్లో మార్పు ఉంటుంది కానీ, సంక్రాంతి మాత్రం ప్రతి సంవత్సరం చిన్నపాటి మార్పుతో జనవరి 14 లేదా 15 తేదీల్లో వస్తుంది. సంక్రాంతి పండగ కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతేదేశం లోని చాలా రాష్ట్రాల్లో కన్నుల పండుగగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో పొంగల్ అని, అస్సాం లో భొగాలి బిహు అని, పంజాబ్ లో లోహిరి అని, గుజరాత్ మరియు రాజస్థాన్ లలో ఉత్తరాయన్ అని పిలుస్తారు. ఈ పండుగ లో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర వహిస్తాయి. దేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో మకర సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో పేర్కొంటున్నాం పరిశీలించండి.

 కర్నాటక లో ఎలా ?

కర్నాటక లో ఎలా ?

ప్రతి సంవత్సరం జనవరి లో వచ్చే ఈ పండుగను కర్నాటక రాష్ట్రంలో 'సుగ్గి' లేదా పంటల పండుగ గా జరుపుకుంటారు. ఈ రోజున యువతులు కొత్త దుస్తులు ధరించి ఒక ప్లేట్ లో నువ్వులు, కొబ్బరి, వేరు శనగ, బెల్లం , చెరుకు గడ ముక్కలు, పటిక బెల్లం ల వంటివి వుంచి సన్నిహిత, బంధుత్వ కుటుంబాలకు పంచుతారు. తాము కూడా వాటిని పుచ్చుకుంటారు. దీనిని 'ఎళ్ళు బిరోదు' అని అంటారు.

బీహార్ లో ఎలా ?

బీహార్ లో ఎలా ?

సంక్రాంతి పండుగను బీహార్ లో తిల సంక్రాంతి అంటారు. ప్రజలు నదులు, చెరువులలో స్నానాలు చేసి, ఇంటిలో కొత్త పంటల నుండి వచ్చిన రైస్, బెల్లం నువ్వులు వంటి వాటితో పిండి వంటలు చేసి కొని , తిని కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి ఆనందిస్తారు. కూరగాయలు, రైస్, బటానీలు, బంగాళా దుంపలు వంటివి కలిపి వండి కిచిడి గా తిని ఆనందీస్తారు. అగ్నిలో కొన్ని నువ్వులు వేసి అగ్ని ఆహుతి చేస్తారు.

పంజాబ్ లో ఎలా

పంజాబ్ లో ఎలా

ఈ పండుగను పంజాబ్ లో లోహరి అనే పేరుతో చేస్తారు. కొత్త పంటలను ఇంటికి చేరుస్తారు. భోగి మంటలు వేసి, స్వీట్ లు, చెరకు గడలు, బియ్యం, వంటివి ఆ మంటలలో వేస్తారు.

 రెండవ రోజు పండుగ

రెండవ రోజు పండుగ

పంజాబ్ లో రెండవ రోజు పండుగను మాఘి లేదా మాఘ మాస మొదలు గా చెపుతారు. ఈ రోజున పాయసం వంటివి తిని ఆనందిస్తారు. నదులలో పవిత్ర స్నానాలు చేస్తారు. స్నేహితులు, బంధువులు తో కలసి అభినందనలు తెలుపు కుంటూ బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.

 అస్సాం లో ఎలా ?

అస్సాం లో ఎలా ?

అస్సాం లో ఈ పండుగను భోగాలి బిహు లేదా మాఘ బిహు అంటారు. భోగ అంటే తినటం, ఆనందించటం. కొత్త పంటలు రావటం ధాన్యాగారాలు నిండటం తో ఒక విందు వలే ఈ పండుగ చేస్తారు. బిహు పండుగ రోజున యువతులు పొలాలకు వెళ్లి అక్కడి గడ్డి, వెదురు బొంగులతో తాత్కాలిక పాకలు వంటివి వేసి అక్కడే వంటలు చేసి, తిని, నిద్రించి వాటిలో ఆనందిస్తారు. రాత్రి వంటలలో మాంసాహారం, చేపలు ప్రత్యేకం.

అస్సాం లో భోగాలి బిహు

అస్సాం లో భోగాలి బిహు

ఉదయంవేళ భోగి మంటలు వేసి స్నానాలు చేస్తారు. భోగి మంటల బూడిదను పొలాలలో, తోటలలో పంటలు బాగా పండా లంటూ చల్లుతారు. బియ్యపు రొట్టెలు తింటారు. డ్రమ్ములు వాయిస్తూ పాటలు పాడతారు. వివిధ రకాల ఆటలు ఆడతారు.

తమిళనాడు లో ఎలా ?

తమిళనాడు లో ఎలా ?

తమిళనాడు లో ఈ పండుగను తాయ్ పొంగల్ అంటారు. ఇక్కడ ఈ ధాన్యపు పంటల పండుగ నాలుగు రోజులు చేస్తారు. నాలుగు రోజులలోను రెండవ రోజు ప్రధాన పండుగ.

తమిళనాడు లో తాయి పొంగల్

తమిళనాడు లో తాయి పొంగల్

పొంగల్ పండుగ రెండవ రోజున సూర్యోదయం సమయంలో బియ్యం, పాలు కలిపి పొంగించి పొంగలి తయారు చేస్తారు. పొంగలి పొంగినట్లు తమ ఇంటి ఐశ్వర్యం అభివృద్ధి చెందాలని తలుస్తారు.

గుజరాత్ లో ఎలా ?

గుజరాత్ లో ఎలా ?

గుజరాత్ లో ఈ పండుగను ఉత్తరాయన్ అంటారు. కొత్త ధాన్యాల పండుగగా ఆచరిస్తారు. ఈ పండుగ కు ఇక్కడ గాలి పటాలను ఎగుర వేయటం ఒక ప్రత్యేకత. గాలిపటాల దుకాణాలు అహమదాబాద్ నగరంలో, ఈ ఉత్తరాయణ వారంలో ఇరవై నాల్గు గంటలూ అధిక వ్యాపారం చేస్తాయి.

గుజరాత్ లో ఉత్తరాయన్ పండుగ

గుజరాత్ లో ఉత్తరాయన్ పండుగ

గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు ఈ పండుగ రోజున పగటి పూట రక రకాల పిండి వంటలు చేసుకుని తిని ఆనందిస్తారు. పగటి పూట రంగు రంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. రాత్రి వేళలో సైతం, వెలుగులు విరజిమ్మే గాలిపటాలను ఎగుర వేస్తారు. ఇక్కడ చేసే ఈ గాలి పటాల పండుగ వేడుక ప్రపంచ వ్యాప్తంగా పేరొందినది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+