Search
  • Follow NativePlanet
Share
» »ఈ నగ్న విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా?

ఈ నగ్న విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా?

కేరళలోని నగ్న విగ్రహం గురించిన కథనం.

కేరళలో అత్యంత ప్రజాధరణ పొందిన శిల్పాల్లో యక్షప్రతిమ ఒకటి. ఈ భారీ శిల్పం మలంపూళ ఉద్యానవనంలో ఉంది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మధ్యలో సొగసైన పూల వనాల మధ్య ఉన్న ఈ ప్రతిమను చూడటానికి ప్రజలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. ఈ ప్రతిమకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం...

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

పలక్కాడ్ లోని మలంపూళ పార్క్ లో యక్షిణి ప్రతిమను ప్రతిష్టించాలన్న ఆలోచన వచ్చినప్పుడు స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. అందుకు ప్రధాన కారణం ఆ యక్షిణి నగ్నంగా ఉండటమే. ఇది మన భారతీయ సంప్రదాయానికి పూర్తిగా భిన్నమని ఎన్నో పోరాటాలు కూడా చేశారు.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

చివరికి ఇక్కడగా ప్రతిమ నగ్నంగా ఉంచబోమని చెబుతూ ప్రతిమను చెక్కడానికి సిద్ధయమయ్యారు. క్రీస్తుశకం 1969లో కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన శిల్పకళాకారుడు కుంజిరామన్ ఈ యక్షిణి ప్రతిమను చెక్కాడు. బ`హదాకారంలో ఉన్న శిల్పాన్ని ఏకశిలలో చెక్కారు. అటు పై మొల్లగా నగ్నంగానే శిలను ఇక్కడ ప్రతిష్టించారు.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

మొదట్లో 50 అడుగుల ఎత్తు ఉన్న ప్రతిమను ఇక్కడ ప్రతిష్టించాలని భావించారు. అయితే ప్రభుత్వం సహకారం అందించకపోవడంతో పాటు నిధుల కొరత వల్ల 30 అడుగులకే ప్రతిమ ఎత్తును పరిమితంచేశారు.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

స్థానికులే కుండా చుట్టు పక్కల ఉన్న ఎంతో మంది ఈ ప్రతిమను చూడటానికి నిత్యం వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. మలంపూళ పార్క్ మాత్రమే ఇక్కడ పర్యాటక కేంద్రం కాదు. పాలక్కడ్ కోట, పుదుండి జలశయం, మలంపూళా జలాశయం, స్నేక్ పార్క్ తదితర ప్రాంతాలు మలంపూళ పార్క్ చుట్టు పక్కల ఉన్న మరికొన్ని ప్రధాన పర్యాటక కేంద్రాలు.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

పాలక్కడ్ పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో తంకసి అత్యంత అందమైన గ్రామం. ఇక్కడి నెల్లియంపతి కూడా ప్రధాన పర్యాటక కేంద్రం ఇక్కడ ఎలమణ్ణం శంకరనారాయణన్ అనే దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని స్థానిక సంస్క`తికి ప్రతికగా భావిస్తారు.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

శివరాత్రితో పాటు తిరువదియార్, ఉత్తుడాస్, తిరుపూణం ఉత్సవాలను ఈ దేవాలయంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కేరళ బ`ందావనం అని పిలిచే మలంపూళా ఉద్యానవనానికి మీరు వచ్చినప్పుడు అక్కడి ప్రక`తి అందానికి మీరు ఫిదా కావడం ఖచ్చితం.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

పచ్చటి తివాచీ లాంటి గడ్డి పై ఒక సారి పాదరక్షలు లేకుండా నడిచి చూడండి ఎంతటి అందమైన అనుభూతిని మీరు సొంతం చేసుకొంటారో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడి పిల్లల ఉద్యానవనంలో మీ
పిల్లలను వదిలి వారు ఆడుకొంటూ ఉన్నప్పుడు వారి ఆనందంలో మీరు మీ సంతోషాన్ని చూసుకోవచ్చు.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

ఈ మలంపూళ గార్డెన్ లో 30 అడుగుల నగ్న యక్షిణి ప్రతిమతో పాటు అక్వేరియం, ఏరియల్ రోబో, రాక్ గార్డెన్, రోస్ గార్డెన్ తదితరాలు కూడా చూడదగినవి. ఒక రోజు మొత్తం సరదాగా గడపాలనుకొనేవారికి ఈ గార్డెన్ సరిగా సరిపోతుంది. ఇక్కడ నీరు, ఆహారం పుష్కలంగా దొరుకుతాయి. రెస్ట్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

ఇక ఈ పార్క్ లో ఉన్న స్నేక్ పార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కొన్ని వందల జాతులకు చెందిన సరీస`పాలు ఇక్కడ సంరక్షించబడుతున్నాయి. పర్యాటకులకు వీటి వల్ల ఎటువంటి హాని కలగకుండా అటవీశాఖ వారి నియంత్రణలో ఈ స్నేక్ పార్క్ ఉంది. క్రీస్తుశకం 1984 లో ఈ స్కేక్ పార్క్ ఇక్కడ ప్రారంభమయ్యింది.

యక్షిణి విగ్రహం, కేరళ

యక్షిణి విగ్రహం, కేరళ

P.C: You Tube

ఇక్కడికి 10 కిలోమీటర్లద దూరంలో ఉన్న పాంటసీ పార్క్ కూడా చూడదగినది. క్రీస్తుశంక 1998లో దీనిని ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉంది. ఈ పార్క్ లో బ్యాటరీ కార్, వాటర్ కిట్టీ రైడ్, బేబీ ట్రైన్ రైడ్, వంటి ఎన్నో థీమ్ లు అందుబాటులో ఉంటాయి. వయస్సు బేధం లేకుండా ఎంతో అందరూ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+