Search
  • Follow NativePlanet
Share
» »పాము విషప్రభావంతో రోగ నివారణిగా మారిన వేడినీట బుగ్గను చూశారా?

పాము విషప్రభావంతో రోగ నివారణిగా మారిన వేడినీట బుగ్గను చూశారా?

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

హిమాలయ పర్వత ప్రాంతాల రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ లో మణికరణ్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇది అటు హిందువులకే కాకుండా ఇటు సిక్కులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇలా ఒకే క్షేత్రం అటు హిందువులకు ఇటు సిక్కులకు దర్శనీయ స్థలంగా ఉండటం భారత దేశంలోనే అత్యంత అరుదైన విషయం.

ఈ మణికరణ్ గురించిన ప్రస్తావన అటు హిందూ పురాణాలతో పాటు ఇటు సిక్కు పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహేబ్ లో కూడా ఉంది. మరోవైపు ఈ మణికరణ్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ప్రకృతి ఆరాధకులకు కూడా స్వర్గధామం. చుట్టూ ఎముకలను గడ్డకట్టించే చలి ఉన్నా కూడా ఈ క్షేత్రంలో బియ్యాన్ని కూడా ఉడికించగల వేడి నీటి బుగ్గ ఉండటం విశేషం. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

 హిందూ పురాణాలను అనుసరించి

హిందూ పురాణాలను అనుసరించి

P.C: You Tube

హిందూపురాణాలను అనుసరించి ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఈ మణికరణ్ ఉన్న ప్రాంతానికి వన విహారానికి వచ్చారు. ఇక్కడి ప్రక`తి అందాలకు ముగ్థులైన ఆ ఆది దంపతులు కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రశాంత వాతావరణం

ప్రశాంత వాతావరణం

P.C: You Tube

అయితే ఇక్కడి అందమైన, ప్రశాంత వాతావరణాన్ని విడిచి వెళ్లలేక సుమారు 1,100 ఏళ్లపాటు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో పార్వతి దేవి చెవికి ధరించే అందమైన, విలువైన మణితో చేయబడిన అభరణం ఇక్కడి ఓ నీటి తటాకంలో పడిపోయింది.

పార్వతీ దేవి

పార్వతీ దేవి

P.C: You Tube

దీంతో బాధపడిన పార్వతీ దేవి తనకు ఆ ఆభరణం కావాల్సిందేనని పరమశివుడిని కోరింది. పరమశివుడు తన ప్రమద గణాలకు ఆ మణిని వెతికి తీసుకురావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఎంత వెదికినా వారికి ఆ మణితో కూడిన ఆభరణం దొరకలేదు.

మూడో నేత్రం

మూడో నేత్రం

P.C: You Tube

దీంతో కోపగించుకున్న శివుడు తన మూడో నేత్రం తెరిచాడు. ఆ ఉగ్రరూపానికి ఈ విశ్వం విలవిలాడింది. దీంతో దేవతలు అంతా కలిసి ఆ మణిని తిరిగి సంపాదించాలని సర్పరాజు అయిన శేషనాగును వేడుకొన్నారు.

శేషనాగు

శేషనాగు

P.C: You Tube

దీంతో శేషనాగు మణి పడిపోయిన సరస్సు వద్దకు వచ్చి గట్టిగా ఊదాడు. దీంతో ఆ సరస్సు లోపల పడిన అన్ని వస్తువులూ ఒడ్డుకు పడిపోయాయి. అందువలో పార్వతి మణి కూడా ఉంది. దీంతో ఆది దంపతులు శేష నాగుని మెచ్చుకొంటారు.

వరమిస్తాడు

వరమిస్తాడు

P.C: You Tube

అంతేకాకుండా ఇక పై ఈ ప్రాంతం మణికరణ్ పేరుతో వెలుగొందుతుందని మాకు చేసే పూజల్లో కొంత నీకు కూడా చేరుతాయని వరమిస్తారు. కాగా, శేష నాగు ఊదడం వల్ల కొంత విషం ఆ నీటిలో పాడిందని ఆ ప్రభావం వల్ల ఆ నీటికి సర్వరోగాలను నయం చేసే శక్తి వచ్చిందని చెబుతారు.

అందువల్లే వేడిగా

అందువల్లే వేడిగా

P.C: You Tube

ఇక శేషనాగు వేడి ఆవిరులు తగడం వల్లే ఆ నీరు ఇప్పటికీ వేడిగా ఉందని చెబుతారు. అందువల్లే ఇక్కడికి వచ్చిన వారు ఆ వేడి నీటి బుగ్గలో స్నానం చేస్తారు. కాగా, హిందూ పురాణాల ప్రాకారం మణికరణ్ ను సందర్శించిన వారు కాశీకి వెళ్లకపోయిన అక్కడి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించిన ఫలం దక్కుతుందని చెబుతారు.

సిక్కుల నమ్మకాన్ని అనుసరించి

సిక్కుల నమ్మకాన్ని అనుసరించి

P.C: You Tube

ఇక సిక్కుల మత గ్రంధం ప్రకారం గురునాయక్ తన శిష్యుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో వారికి బాగా ఆకలిగా ఉంది. విషయం తెలుసుకొన్న స్థానికులు వారికి చపాతీలు చేసుకోవడానికి పిండిని ఇచ్చారు. వాటితో చపాతీలు చేసుకొన్నారు.

చపాతీలు

చపాతీలు

P.C: You Tube

అయితే వాటిని కాల్చడానికి అవసరమైన పెనం, పొయ్యి అక్కడ లేదు. దీంతో గురునానక్ ఒక రాయిని పైకి ఎత్తగా దాని కింద వేడి నీటి బుగ్గ కనిపించింది. శిష్యుడికి చెప్పి చపాతీలను అందులో వేయగా అవి మునిగిపోయాయి.

తిరిగి వచ్చాయి

తిరిగి వచ్చాయి

P.C: You Tube

దీంతో గురునానక్ సూచనల మేరకు తన చపాతీలు తిరిగి తన వద్దకు వస్తే అందులో ఒకటి దేవుడికి ఇస్తానని మొక్కు కొంటాడు. దీంతో ఆ చపాతీలన్నీ తిరిగి ఆ నీటిలో తేలుతూ వారి వద్దకు వచ్చాయి. అప్పుడు ఆ చపాతీలు మాములుగా పొయ్యి మీద కాల్చినవాటిలా ఉన్నాయి.

 అందువల్ల సిక్కులకు కూడా

అందువల్ల సిక్కులకు కూడా

P.C: You Tube

దీంతో శిష్యుడితో పాటు గురునానక్ వాటితో తమ ఆకలిని తీర్చుకున్నారు. గురునానక్ సందర్శించిన ఈ ప్రాంతం అటు పై గురుద్వార్ గా మారిందిం. దీంతో ఈ గురుద్వార్ ను సిక్కులు తమ తీర్థయాత్రలో భాగంగా సందర్శిస్తూ ఉంటారు.

కులు నుంచి 35 కిలోమీటర్లు

కులు నుంచి 35 కిలోమీటర్లు

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో బున్థార్ ఈశాన్య భాగంలోని పార్వతీ నదీ లోయ ప్రాంతంలో మణికరణ్ ఉంది. సముద్ర మట్టానికి 1760 మీటర్ల ఎత్తున ఉన్న ఈ చిన్న పట్టణానికి చేరుకోవడానికి కులు నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కులు, మనాలిని సందర్శించిన వారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+