Search
  • Follow NativePlanet
Share
» » కర్నాటక రాష్ట్రంలో తప్పక చూడవలసిన చిన్న పట్టణాలు!

కర్నాటక రాష్ట్రంలో తప్పక చూడవలసిన చిన్న పట్టణాలు!

సాధారణంగా పర్యటనలో మనం అందరమూ పెద్ద పెద్ద పట్టణాలు చూసి ఆనందిస్తాము. అయితే, కర్నాటక రాష్ట్రంలో చాలా మందికి తెలియనివి, తమ అందాలతో పర్యాటకులను అలరించేవి అయిన కొన్ని చిన్న పట్టణాలు కూడా కలవు. వీటిని మీ పర్యటనలో తప్పక చూసి ఆనందించ వచ్చు. ఈ పట్టణాలలో కొన్ని ప్రకృతి అందాలకు నెలవులు అయితే, మరి కొన్ని అక్కడ కల సాహస క్రీడలతో పర్యాటకులకు జీవం పోస్తాయి. కనుక మీ తర్వాతి కర్నాటక పర్యటనలో ఈ చిన్న పట్టణాలను తప్పక చూడండి. నిజం చెప్పాలంటే, అందమైన ఈ చిన్న పట్టణాలు, కర్నాటక రాష్ట్ర నివాసులకు కూడా తెలియక పోవచ్చు.

చిక్కమగళూర్

చిక్కమగళూర్

చిక్కమగళూర్ పట్టణంలోని ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని రొమాంటిక్ గాను, కవితా ధోరణి లోను ముంచి వేస్తాయి. ప్రశాంతమైన ఈ టవున్ ఒక కొండ ప్రాంతం. ఇది చిక్కమగళూర్ జిల్ల్లాలో కలదు. చిక్కమగళూర్ అంటే, చిన్న కుమార్తె భూమి అని కన్నడంలో అర్ధం చెపుతారు. ఈ భూమిని ఈ ప్రాంత పాలకుడు ఒకప్పుడు తన చిన్నకుమార్తె కు కట్నంగా ఇచ్చాడని చరిత్ర చెపుతుంది.

దండెలి

దండెలి

దండెలి ప్రదేశం ట్రావెలర్ లకు పూర్త్లి బిజి కల్పిస్తుంది. అనేక సాహస క్రీడలు ఇక్కడ ఆచరించవచ్చు. ఇక్కడ మీరు కయాకింగ్, వాటర్ రాఫ్టింగ్, ఓవర్ నైట్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి ఎన్నో ఆచరించవచ్చు. ఈ క్రీడలన్నీ మీకు పునరుజ్జీవనం కల్పిస్తాయి.

కాపు

కాపు

కాపు పట్టణంలో అందమైన బీచ్ కలదు. ఈ బీచ్ వాతావరణం చల్లగా ప్రశాంతంగా వుండి , కుటుంబ సమేతంగా వెళ్లేవారికి ఒక అద్భుత పిక్నిక్ ప్రదేశంగా వుంటుంది. బీచ్ చుట్టూ కల పరిసరాలు పచ్చగా వుండి పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం కల్పిస్తాయి.

బైన్దూర్

బైన్దూర్

బైన్దూర్ కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఇక్కడ ఒక బీచ్ మరియు దేవాలయాలు కలవు. ఇక్కడ కల సోమేశ్వర స్వామీ దేవాలయం అద్భుత శిల్ప శైలి కలిగి, పర్యాటకులను ముగ్ధులను చేస్తుంది.

బనవాసి

బనవాసి

బనవాసి అనబడే ఈ చిన్న పట్టణం లో కల మధుకేశ్వరా టెంపుల్ ఒక గొప్ప ఆకర్షణ. ఈ ప్రదేశం ఒక అడవి మధ్య నుండి పుట్టుకు వచ్చిందని అందుకనే దీనిని బనవాసి లేదా వన వాసి అని అంటారని చెపుతారు. వన అంటే అడవి, వాసి ఆంటే నివాసం అని చెపుతారు.
Ba

హొరనాడు

హొరనాడు

అందమైన ప్రకృతి కల హొరనాడు పట్టణంలో అతి పెద్దదైన అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. ఇక్కడి దేవతా విగ్రహం బంగారం తో చేయ బడింది. ఈ గుడి వెనుక గొప్ప చరిత్ర కలదు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+