Search
  • Follow NativePlanet
Share
» » తిరువనంతపురం అంటే కేవలం ఆ ఒక్కటే కాదు...చూడటానికి మరెన్నో...

తిరువనంతపురం అంటే కేవలం ఆ ఒక్కటే కాదు...చూడటానికి మరెన్నో...

కేరళలోని తిరువనంతపురం లో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

తిరువనంతపురం అన్న తక్షణం మనకు ఇది కేరళలోని ఓ ధార్మిక క్షేత్రం అన్న విషయమే గుర్తుకు వస్తుంది. ఇందుకు కారాణం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులతో పాటు మీడియా ధార్మిక సంబంధాలతో ముడిపెట్టి ఈ తిరువనంతపుర పై చర్చ పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ పర్యాటక క్షేత్రానికి కేవలం వయస్సు మీదపడిన వారు మాత్రమే వెలుతారని అందరూ భావిస్తారు. అయితే చారిత్రాత్మకతకు, ప్రకతి సంపదలకు నిలయమైన ఈ తిరువనంతపురంతో పాటు చుట్టు పక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు సంబంధించిన క్లుప్త సమాచారం మీ కోసం...

కోవాలం బీచ్

కోవాలం బీచ్

P.C: You Tube

భారత దేశంలోని అత్యంత అందమైన బీచ్ లలో కోవాలం బీచ్ ఒకటి. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చూడటానికి చాలా మనోహరంగా కనిపిస్తుంది. అందువల్లే చాలా మంది సాయంత్రం వేళల్లో ఇక్కడికి వస్తారు. ఇక తీరం వెంబడీ పామ్ చెట్లు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

లైట్ హౌస్

లైట్ హౌస్

P.C: You Tube

ఎప్పుడో నిర్మించిన లైట్ హౌస్ ఈ కోవాలం బీచ్ కు మరింత అందాన్ని తీసుకువస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ బీచ్ దగ్గర ఉన్న క`త్రిమంగా ఏర్పాటు చేసిన పగడపు దీవులు చిన్నిపిల్లవారితో పాటు పెద్దలను కూడా ఇట్టే ఆకర్షిస్తుంది. హెర్బల్ మసాజ్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

పొవ్వార్

పొవ్వార్

P.C: You Tube

సముద్రం, నది, సరస్సు కలిసే ప్రపంచంలోని అతి తక్కువ భౌగోళిక ప్రాంతాల్లో పొవ్వార్ కూడా ఒకటి. ఇక్కడ నెయ్యార్ నదిని అరేబియ సముద్రంతో ఇక్కడి పొవ్వార్ వేరుచేస్తూ ఉంటుంది. సరిగా ప్రాచూర్యంలోకి నోచుకోకపోవడంతో పర్యాటకుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.

ఏకాంతాన్ని కోరుకునేవారు

ఏకాంతాన్ని కోరుకునేవారు

P.C: You Tube

అందువల్ల పర్యాటకంలో ఏకాంతాన్ని కోరుకొనే వారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. ఇక్కడ బోటు ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పవచ్చు.

పొన్ముడి

పొన్ముడి

P.C: You Tube

కేరళలో ఉన్న హిల్ స్టేషన్లలో పొన్ముడిదే అగ్రస్థానం అని చెప్పవచ్చు. కనుచూపుమేర పచ్చదనం తప్ప మరేది కనబడదు. ఈ పర్వత శిఖరం చేరుకొనే క్రమంలో మనకు చిన్న పిల్లకాలువలు, టీ ఎస్టేట్ లు, జలపాతాలు హాయ్ అంటు పలకరిస్తాయి.

 ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

P.C: You Tube

ట్రెక్కింగ్ కోసం వీకెండ్ న ఇక్కడికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పడిప్పుడే అడ్వెంచర్ టూరిజం హబ్ గా పొన్ముడి రూపుదిద్దుకొంటోంది. పర్వత శిఖరం పై భాగంలో ఉన్న కాటేజీలను ముందుగా బుక్ చేసుకొంటే వీకెండ్ సమయం ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది.

నేపియర్ మ్యూజియం, జ్యూ

నేపియర్ మ్యూజియం, జ్యూ

P.C: You Tube

పట్టణం మధ్య ఇంతటి పచ్చటి ప్రదేశాన్ని మనం భారత దేశంలో మరెక్కడా చూడలేము. కేరళ సంప్రదాయాలను చాటిచెప్పే ఎన్నో వస్తువులను, పరికరాలను మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు. ముఖ్యంగా ఏనుగు దంతాలతో చేసిన విలువ కట్టలేని ఎన్నో ఆభరణాలను మనం ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు.

విదేశీ వాస్తు శైలి

విదేశీ వాస్తు శైలి

P.C: You Tube

ఈ భవనం నిర్మాణంలో మనకు కేరళతో పాటు విదేశీ వాస్తు శైలి కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉన్న జూ పార్క్ లో విదేశాల్లో మాత్రమే కనిపించే జంతువులు, పక్షులు, పాములను చూడవచ్చు. దీంతో అటు పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ ప్రాంతం ఎంతగానో నచ్చుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+